Thimmarajupalli TV Twitter Review: తిమ్మరాజుపల్లి టీవీ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

Thimmarajupalli TV Twitter Review: హీరోగా వరుస విజయాలు అందుకుంటున్నా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా, వి.మునిరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమాతో దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. సాయితేజ్, వేధా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు నటించారు. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే 90వ దశకపు పీరియాడికల్ డ్రామాగా రూపొందించారు.

Also Read
Dacoit Day 7 Collections: తగ్గిన డెకాయిట్ కలెక్షన్లు.. అడివిశేష్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితేంటీ?
Dacoit Day 7 Collections: తగ్గిన డెకాయిట్ కలెక్షన్లు.. అడివిశేష్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితేంటీ?

కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ కాంత రేఖ సంగీతం అందించగా, అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. యంగ్ టాలెంట్‌తో వచ్చిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 17న)ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో గురువారం ప్రదర్శించిన స్పెషల్ ప్రీమియర్‌కు అద్భుతమైన టాక్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాల్లోకి వెళితే..

Recommended For You
శ్రీ రాముడిపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటోన్న హిందూ సంఘాలు
శ్రీ రాముడిపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటోన్న హిందూ సంఘాలు
Thimmarajupalli TV Twitter Review in Telugu

ఒక నెటిజన్ 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరంగా స్పందించాడు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉందని, గ్రామీణ జీవితాన్ని ఎంతో సహజంగా చూపించిందని తెలిపాడు. క్లీన్ స్టోరీతో పాటు లోతైన భావోద్వేగాలు ఉన్న సినిమాలను ఇష్టపడేవారికి ఇది తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో చూపించిన అందమైన లొకేషన్స్, సహజమైన విజువల్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయని పేర్కొన్నాడు.

You May Also Like
Peddi: రామ్ చరణ్ 'పెద్ది’ మళ్లీ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
Peddi: రామ్ చరణ్ 'పెద్ది’ మళ్లీ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

అలాగే నటీనటులందరూ ఎంతో నిష్ఠతో నటించారని, ప్రతి పాత్ర కూడా నిజాయితీగా కనిపించిందని అభిప్రాయపడ్డాడు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు బాగా సరిపోయాయని ప్రశంసించాడు. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ, అది హృదయాన్ని తాకేలా ఉందని, సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ వెంటాడుతుందని చెప్పాడు. మొత్తంగా ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఇదొక మంచి ఎంపిక అని సూచించాడు. చివరగా కిరణ్ అబ్బవరం, ఆయన ప్రొడక్షన్ టీమ్‌కు అభినందనలు తెలియజేస్తూ, ఇది నిజంగా హృదయపూర్వక ప్రయత్నమని తన పోస్టులో పేర్కొన్నాడు.

Bhooth Bangla Twitter Review: భూత్ బంగ్లా ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే?
Bhooth Bangla Twitter Review: భూత్ బంగ్లా ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే?

మరో మూవీ లవర్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇది సరళమైన గ్రామీణ కథతో మొదలై 90వ దశకపు మధురమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసిందని తెలిపాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు చాలా సహజంగా, అందంగా కనిపించాయని చెప్పాడు. సినిమా మొత్తం తన భావోద్వేగాలకు నిజాయితీగా నిలబడిందని, కుటుంబ విలువలను బలంగా చూపించిందని అభిప్రాయపడ్డాడు. పాటలు చాలా బాగున్నాయని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు మంచి ఫీల్ ఇచ్చిందని పేర్కొన్నాడు. అలాగే ప్రతి నటుడు సహజమైన నటనతో ఆకట్టుకున్నారని, ఎక్కడా అతిశయోక్తి లేకుండా కథను ముందుకు తీసుకెళ్లారని చెప్పాడు. మొత్తంగా క్లీన్, హార్ట్‌ఫుల్ గ్రామీణ డ్రామా కావడంతో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి సినిమా ఇదని తన రివ్యూలో వెల్లడించారు.

ఆమెను నమ్మితే నిండా ముంచేసింది.. ఆ దెబ్బకు జీవితం మారిపోయింది..
ఆమెను నమ్మితే నిండా ముంచేసింది.. ఆ దెబ్బకు జీవితం మారిపోయింది..

మరో సినీ అభిమాని ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ఇది న్యూ ఏజ్ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ అని పేర్కొన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్‌ను కూడా కలిపి చూపించడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యిందని, 3.25/5 రేటింగ్ ఇవ్వదగ్గ సినిమా ఇదని చెప్పాడు. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని, దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తూ ఇంత రా, రస్టిక్ ఫీల్ ఉన్న సినిమాను తీసుకురావడం గొప్ప విషయమని అభినందించాడు. ప్రతి నటుడు తన పాత్రలో సహజంగా నటించి మెప్పించాడని, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ పూర్తిగా కొత్తగా, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కథ టీవీ మరియు ఆత్మగౌరవం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని, ఇది సాధారణ కథ కాదు అని స్పష్టం చేశాడు. అలాగే కేఏ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు తెరపై బాగా కనిపించాయని, విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ సినిమా సమ్మర్ సీజన్‌లో ఫ్యామిలీతో కలిసి చూసే థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని, ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ఆ నెటిజన్ తన రివ్యూలో వెల్లడించాడు.

'జబర్దస్త్ లో అలాంటి రూమర్స్ క్రియేట్.. బయటకు రావడానికి కారణం అతనే '
'జబర్దస్త్ లో అలాంటి రూమర్స్ క్రియేట్.. బయటకు రావడానికి కారణం అతనే '

మరో నెటిజన్ తిమ్మరాజుపల్లి టీవీ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఈ సినిమా చాలా సింపుల్ స్టోరీతో సాగుతుందని చెప్పాడు. ఫస్ట్ హాఫ్‌లో ప్రధానంగా క్యారెక్టర్స్ పరిచయం, థీమ్ సెటప్ మాత్రమే ఉండటంతో అది కొంతవరకు యావరేజ్‌గా అనిపించిందని పేర్కొన్నాడు. అయితే సెకండ్ హాఫ్‌లో కథ కొంచెం మిస్టరీ వైపు మళ్లి ఆసక్తిని పెంచుతుందని, కొన్ని ఎపిసోడ్స్ బాగానే వర్క్ అయ్యాయని అభిప్రాయపడ్డాడు. కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించినప్పటికీ సినిమా చాలా క్లీన్‌గా, నేచురల్‌గా ఉందని ప్రశంసించాడు. అయినా మధ్య మధ్యలో కొంత లాగ్ ఫీల్ అవుతుందని, కొన్ని సీన్స్ కథను డైవర్ట్ చేసేలా ఉన్నాయని చెప్పాడు. మొత్తంగా చూసుకుంటే ఇది ఒక మంచి ప్రయత్నమని, ఓవర్ ఆల్‌గా ఒకసారి చూడదగ్గ సినిమా అని,లాస్ మాత్రం కాదని తన రివ్యూలో వెల్లడించాడు.

'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!
'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!

మరోకరు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఇది ఒక సింపుల్ కానీ హృదయానికి హత్తుకునే గ్రామీణ డ్రామా అని పేర్కొన్నాడు. సినిమాలో చూపించిన బ్యూటిఫుల్ విలేజ్ సెట్టింగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పాడు. సినిమాలో ఎమోషన్స్‌ను చాలా బాగా హ్యాండిల్ చేశారని, కథ కూడా సింపుల్‌గా ఉండి కనెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. పాటలు కథకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని, ప్రతి యాక్టర్ తన పాత్రకు న్యాయం చేస్తూ అద్భుతంగా నటించాడని ప్రశంసించాడు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ సినిమాకు ప్రాణం లాంటివని, అవే హైలైట్‌గా నిలిచాయని పేర్కొన్నాడు. మొత్తంగా ఫ్యామిలీస్‌కి బాగా నచ్చే సినిమా ఇదని, 3.25/5 రేటింగ్ ఇవ్వొచ్చని తన రివ్యూలో వెల్లడించాడు.

'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'
'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'

మరో నెటిజన్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇది ఓకే-ఓకే అనిపించే సినిమా అని పేర్కొన్నాడు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా యావరేజ్‌గా, కొంత వరకు బోర్ ఫీల్ వచ్చేలా ఉందని, దాదాపు గంట పాటు కథ పెద్దగా ముందుకు వెళ్లదని అభిప్రాయపడ్డాడు. గ్రామీణ కామెడీ, పాటల మీదే ఎక్కువగా ఆధారపడిందని చెప్పాడు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంత బెటర్‌గా ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ బాగా వర్క్ అయ్యిందని చెప్పాడు. చివరి 30 నిమిషాలు సినిమాను నిలబెట్టేలా ఉన్నాయని పేర్కొన్నాడు. నటీనటుల ప్రదర్శన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయని అభిప్రాయపడ్డాడు. నిర్మాతగా కిరణ్ అబ్బవరం టెక్నికల్‌గా మంచి క్వాలిటీ ఉన్న సినిమాను అందించాడని ప్రశంసించాడు. మొత్తానికి గ్రామీణ నేపథ్య సినిమాలు ఇష్టపడే వారికి ఒకసారి చూడదగ్గ సినిమా ఇదని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ కోసం ట్రై చేయొచ్చని చెప్పుతూ 2.5/5 రేటింగ్ ఇచ్చాడు.

అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

మరో సినిమా అభిమాని తిమ్మరాజుపల్లి టీవీ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఈ సినిమా కథ మొత్తం ఒక టీవీ చుట్టూ తిరుగుతుందని చెప్పాడు. కథలో ఉన్న ఆ కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపించిందని పేర్కొన్నాడు. సినిమాలో ఎక్కువగా కొత్తవాళ్లు నటించినప్పటికీ, వారి నటన మాత్రం అనుభవజ్ఞుల్లా ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా రాజప్ప పాత్రలో నటించిన వ్యక్తి అద్భుతంగా నటించి సినిమాకే హైలైట్‌గా నిలిచాడని చెప్పాడు. మ్యూజిక్ కూడా చాలా బాగా ఉందని, కథకు మంచి ఫీల్ ఇచ్చిందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని, 3.5/5 రేటింగ్ ఇవ్వొచ్చని తన రివ్యూలో వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X