For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thiruchitrambalam Movie Review పాత కథను మళ్లీ కొత్తగా.. ధనుష్, నిత్యా మీనన్ ఫెర్పార్మెన్స్ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.5/5

  విభిన్నమైన పాత్రలు, విలక్షణ నటనతో ఆకట్టుకొంటున్న ధనుష్‌కు ఇటీవల కాలంలో సక్సెస్‌ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఎదురయ్యాయి. గత కొద్ది కాలంగా ఆయన సినిమా ఓటీటీకే పరిమితమయ్యాయి. జగమే తాంద్రియమ్, అత్రంగి రే, మారన్, ది గ్రే మ్యాన్ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కర్ణన్ సినిమా అనంతరం ఏడాదిన్నర తర్వాత తిరు (తమిళంలో తిరుచిత్రంబళం) థియేట్రికల్ రిలీజ్‌తో ధనుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ధనుష్‌కు సక్సెస్ అందించిందా? అనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఈ సినిమాను సమీక్షించాల్సిందే.

   తిరు కథ ఏమిటంటే?

  తిరు కథ ఏమిటంటే?

  తిరు అలియాస్ పండు (ధనుష్) ఫుడ్ డెలీవరీ యాప్‌లో పనిచేసే యువకుడు. పోలీస్ ఆఫీసరైన తండ్రి నీలకంఠం (ప్రకాశ్ రాజ్)‌ని ద్వేషిస్తుంటాడు. తాత సీనియర్ పండు (భారతీరాజా)తో చాలా చనువుగా ఉంటాడు. తన కాలనీలో ఉండే చిన్ననాటి స్నేహితురాలు శోభన (నిత్య మీనన్) అంటే చెప్పలేనంత ఇష్టం. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో తండ్రికి, తిరుకు భారీ గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత హార్ట్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురి అవుతాడు.

  తిరు మూవీలో ట్విస్టులు

  తిరు మూవీలో ట్విస్టులు


  తండ్రిని తిరు ఎందుకు ద్వేషిస్తాడు? ఒకే ఇంట్లో ఉన్నా పదేళ్లుగా ఇద్దరు ఎందుకు మాట్లాడుకోరు. తండ్రి కొడుకుల మధ్య అగాథం ఏర్పడటానికి కారణం ఏమిటి? తండ్రితో గొడవ ఎందుకు జరిగింది? పక్షవాతానికి గురైన తండ్రి సంరక్షణ బాధ్యతను తిరు తన భుజాలపైకి ఎత్తుకొన్నాడా? తిరు జీవితంలో స్నేహితురాలు శోభన ఎలాంటి పాత్ర పోషించింది? తిరు ప్రేమను తన ప్రియురాలు అనూష (రాశీఖన్నా) ఎందుకు రిజెక్ట్ చేసింది. ఓ పెళ్లిలో మొదటి చూపులోనే ఇష్టపడిన రంజనీ (ప్రియా భవానీ శంకర్) తిరు ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది. తండ్రి కొడుకు, తాత మనవడు బంధానికి ముగింపు ఏమిటి? చివరికి తిరు ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే తిరు సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా అనాలిసిస్

  ఫస్టాఫ్ ఎలా అనాలిసిస్


  తిరు సినిమా విషయానికి వస్తే.. ఇలాంటి కథతో చాలా సినిమాలు తెరమీదకు వచ్చాయి. పాత సీసాలో కొత్త నీరు అనే విధంగా తిరు కథ అనిపిస్తుంది. పక్కనే బాల్య స్నేహితురాలిని పెట్టుకొని.. మరో అమ్మాయి కోసం హీరో ప్రయత్నించడం. ఆ అమ్మాయి తిరస్కరిస్తే.. స్నేహితురాలు సహాయం చేయడం లాంటి కథలు చాలానే చూశాం. కాకపోతే ఈ చిత్రం తండ్రి కొడుకుల పాత్రల మధ్య ఎమోషన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తొలి భాగంలో పాత్రల ఎస్టాబ్లిష్‌ చేయడానికే చాలా సమయం తీసుకొన్నాడు. ఈ సినిమాకు అవసరం.. ఎమోషనల్ పాయింట్‌గా మారడానికి అవకాశం ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను ఒక్క ముక్కలో తేల్చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. సినిమాకు బలంగా, ఫీల్‌గుడ్‌గా మారే తల్లి (రేవతి) పాత్రను విస్మరించడం ఈ సినిమాకు ఓ మైనస్‌గా కనిపిస్తుంది.

  సెకండాఫ్‌లో ఎమోషన్స్

  సెకండాఫ్‌లో ఎమోషన్స్


  ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కథలో రకరకాల వేరియేషన్స్‌తో సాగుతుంది. ప్రియా భవానీతో లవ్ ట్రాక్ కొద్ది సేపే ఉన్నప్పటికీ.. సినిమాకు పెద్దగా ఉపయోగకరంగా అనిపించదు. ఇక నిత్యా మీనన్ (శోభన), ధనుష్ (తిరు) లవ్ ట్రాక్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తమ్ముడు, తొలిప్రేమ, సిద్దార్థ్ ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమాలు వద్దన్న గుర్తుకు వస్తాయి. ఇక తండ్రి కొడుకుల కాన్‌ఫ్లిక్ట్, ఎమోషన్స్ సెకండాఫ్‌లో పెద్దగా ఉపయోగించుకోలేకపోయారనిపిస్తుంది. క్లైమాక్స్‌లో అంతా ఊహించినట్టే జరగడం రొటీన్, రెగ్యులర్‌గా ముగుస్తుంది.

   ధనుష్, నిత్యా మీనన్ ఫెర్ఫార్మెన్స్

  ధనుష్, నిత్యా మీనన్ ఫెర్ఫార్మెన్స్


  ధనుష్‌కు తిరు లాంటి పాత్రలు కొట్టిన పిండే. పెద్దగా కష్టపడకుండానే సునాయసంగా కథను తన భుజాలపై ఎప్పటిలానే మోశాడు. కథలో తండ్రి, కొడుకుల మధ్య వచ్చే ఎపిసోడ్స్‌లో ఎమోషన్స్‌‌ను అద్బుతంగా పండించాడు. ముగ్గురి హీరోయిన్లతో లవ్ ట్రాక్‌లో ఎప్పటిలానే అదరగొట్టాడు. భారతీరాజా, ప్రకాశ్ రాజ్‌తో పోటాపోటిగా నటించాడు. నిత్య మీనన్‌ ఎప్పటిలానే పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. క్లైమాక్స్‌‌లో నిత్య మీనన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసింది. రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్ పెద్దగా స్కోప్ లేని పాత్రలో కనిపించారు. భారతీరాజా పాత్ర అందర్నీ ఆకట్టుకొంటుంది.

   టెక్నికల్ అంశాల గురించి

  టెక్నికల్ అంశాల గురించి


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే. దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్.. రొటీన్, రెగ్యులర్ కథలో తండ్రి కొడుకుల బంధాలను బలంగా రాసుకొన్నాడు. కానీ దర్వకుడు రాసుకొన్న కొత్తదనం లేని సన్నివేశాలు, ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన సీన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతాయి. ఇక ఓం ప్రకాశ్ అందించిన సినిమాటోగ్రఫి ఒకేలా ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు ఫర్వాలేదనిపిస్తాయి.కాకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొంటుంది. సన్ పిక్చర్స్ అంటే క్వాలిటీ విలువలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ సినిమాను నాసిరకంగా చుట్టేశారనిపిస్తుంది.

   ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..


  తండ్రి కొడుకుల మధ్య బంధాలు, ప్రేమ కోసం తపించే యువకుడి కథానేపథ్యంగా తిరు చిత్రం రూపొందింది. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం, పాత్రల మధ్య ఎమోషన్స్ నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్తదనం లేని కథ కావడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. థియేట్రికల్ రిలీజ్ కంటే.. ఓటీటీ రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమాకు యాప్ట్‌గా ఉండేది. ధనుష్, నిత్యమీనన్, ప్రకాశ్ రాజ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఫీల్ గుడ్ అంశాలు. ఈ ముగ్గురి ఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. థియేటర్‌లో సినిమా ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకొనే వాళ్లు ఓసారి ట్రై చేయవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  నటీనటులు పెర్ఫార్మెన్స్
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  మైనస్ పాయింట్స్
  రొటీన్, రెగ్యులర్ కథ
  ఫస్టాఫ్ వేరీ స్లో
  పాటలు
  కథ, కథనాలు

  తిరులో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  తిరులో నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీ ఖన్నా, భారతీరాజ, ప్రకాశ్ రాజ్, రేవతి తదితరులు
  రచన, దర్శకత్వం: మిత్రన్ ఆర్ జవహార్
  నిర్మాత: కళానిధి మారణ్
  సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్
  మ్యూజిక్: ప్రసన్న జీకే
  బ్యానర్: సన్ పిక్చర్స్
  రిలీజ్: 2022-08-18

  English summary
  Dhanush's Thiruchitrambalam is hits the screens on August 18th. Here is the exclusive review by Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X