Thudarum Movie Review: తుడరం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: మోహన్‌లాల్, శోభన, ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు
దర్శకత్వం: తరుణ్ మూర్తి
స్క్రీన్ ప్లే: కేఆర్ సునీల్, తరుణ్ మూర్తి
నిర్మాత: ఎం రంజిత్
సినిమాటోగ్రఫి: షాజీ కుమార్
ఎడిటింగ్: నిషద్ యూసఫ్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
బ్యానర్: రాజపుత్ర విజువల్ మీడియా
రిలీజ్ డేట్: 2025-04-25

బెంజ్ అలియాస్ షణ్ముగం సినిమాలో ఫైట్ మాస్టర్ పని మానేసి కారు డ్రైవర్‌గా తన భార్య (శోభన) కొడుకు పవన్ (థామస్ మ్యాథ్యూ, ), కూతురు (అమృత వర్షిణి)‌తో జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తుంటాడు. తన అంబాసిడర్ కారు అంటే బెంజ్‌కు ప్రాణం. ఆ కారును ఎవర్ని కూడా ముట్టుకోనివ్వడు. అలాంటి పరిస్థితుల్లో గంజాయి కేసులో కారును పోలీసులు సీజ్ చేస్తారు. ఆ తర్వాత ఓ శవాన్ని పూడ్చేందుకు బెంజ్‌ను ఎస్ఐ బెన్నీ (బిన్ను పప్పు), ఇన్స్‌పెక్టర్‌ జార్జ్ (ప్రకాశ్ వర్మ) తీసుకెళ్తారు.

Thudarum Malayalam Movie Review

స్టంట్ మాస్టర్ పళని (భారతీరాజా) వద్ద ఫైట్ మాస్టర్ ఉద్యోగాన్ని బెంజ్ ఎందుకు మానేశాడు? పాత అంబాసిడర్ కారుతోనే డ్రైవర్‌గా ఎందుకు లైఫ్ లీడ్ చేశాడు? తాను ఇష్టం భావించే కారును గంజాయి కేసులో సీజ్‌ చేసిన తర్వాత బెంజ్ పరిస్థితి ఎలా మారింది? ఎస్ఐ, సీఐ తీసుకెళ్లిన శవం ఎవరిది? అడవిలో పాతేసిన శవం వల్ల బెంజ్ జీవితం ఎలా అతలాకుతలమైంది? తన జీవితాన్ని కుదిపేసిన సంఘటనపై బెంజ్ ఎలా రియాక్ట్ అయ్యాడనే ప్రశ్నలకు సమాధానమే తుడరం సినిమా కథ.

మోహన్‌లాల్ ఇమేజ్‌కు సరిపోయే విధంగా దర్శకుడు తరుణ్ మూర్తి రాసుకొన్న కథ, అందులోని పాత్రలు, ఎమోషనల్, క్రైమ్ ఎలిమింట్స్, ఫ్యామిలీ వాల్యూస్ చక్కగా కుదిరాయి. కథను చాలా హోమ్లీగా స్టార్ట్ చేసి ఓ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. ఫీల్ గుడ్ నుంచి ఎమోషనల్ జోన్‌లోకి మెల్లగా ప్రవేశించి.. ఆ తర్వాత పూర్తిగా క్రైమ్ జోన్‌లోకి స్టోరిని తీసుకెళ్లిన విధానం ఇంకా బాగుంది. అలాగే క్రైమ్ జోన్ నుంచి యాక్షన్ జోన్‌లోకి నెట్టి.. అక్కడ పండించిన భావోద్వేగాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. అయితే కథను చెప్పాల్సిన నిడివి కంటే.. అతిగా సాగదీసి.. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఓ టెస్ట్ పెట్టారనిపిస్తుంది. ఓవరాల్‌గా దృ‌శ్యం 3 మూవీని చూపించే ప్రయత్నం చేశారు.

నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పకోవాల్సిన పనిలేదు. తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. ఎమోషన్స్, యాక్షన్స్, ఫన్ క్రియేట్ చేయడంలో మరోసారి తన అభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించాడు. ఫస్టాఫ్‌లో అమాయకంగా కనిపించిన బెంజ్.. సెకండాఫ్‌లో రౌద్రాన్ని పలికించి తీరు అతడి సూపర్ స్టార్ డమ్‌కు అద్దం పట్టింది. తల్లిగా, భార్యగా శోభన ఫుల్ మార్కులు కొట్టేశారు. మోహన్ లాల్ కూతురు, కొడుకులుగా అమృత, ప్రేమలు ఫేమ్ థామస్ మ్యాథ్యూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక కథను రక్తి కట్టించే విషయంలో ఎస్ఐ బెన్నీగా బిను పప్పు, ఇన్స్‌పెక్టర్ జార్జ్‌గా ప్రకాశ్ వర్మ తన పాత్రల్లో పవర్‌ఫుల్ మార్చి మోహన్‌లాల్‌తో పోటీపడి నటించారు. హీరోయిజాన్ని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయడానికి దర్శకుడు పెట్టుకొన్న విజన్‌ను తగినట్టుగా ఇద్దరు నటించి మెప్పించారు. భారతీరాజా అతిథి పాత్రలో గుర్తుండిపోతారు. ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ అతిథి పాత్రలో కనిపించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు తగినట్టుగా కథను ఎలివేట్ చేసే విధంగా నటించారు.

తుడరం మూవీకి అత్యంత బలంగా నిలిచిన అంశాలు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, లొకేషన్లు, ఆడియోగ్రఫి. కేరళలోని అద్బుతమైన లోకేషన్లు, వాటి వాతావరణాన్ని కథ కోసం ఉపయోగించుకొన్న తీరు బాగుంది. షాజీ చిత్రీకరించిన సీన్లు చూస్తే విజువల్‌ బ్యూటీని గుర్తు చేస్తాయి. ఇక జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్లపై కత్తెర వేసి.. మరొకొన్ని సన్నివేశాల నిడివిని తగ్గిస్తే.. ఇంకా వేగం, ఫీల్ పెరిగి ఉండేదనిపించింది. రాజపుత్ర బ్యానర్‌పై ఎం రంజిత్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తుడరం మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఫుల్లుగా దట్టించిన క్రైమ్, యాక్షన్ సినిమా. మోహన్ లాల్, శోభన, ప్రకాశ్ వర్మ, బిను పప్పు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అదనపు బలం. దర్శకుడు తరుణ్ మూర్తి రాసుకొన్న కథ, స్క్రీన్ ప్లే ఈ మూవీకి మరో బ్యూటీ. ఈ సినిమాకు టెక్నికల్ వాల్యూస్ మరో ప్లస్ పాయింట్. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. వీలైతే తప్పకుండా థియేటర్‌లో చూసేందుకు ప్రయత్నించండి.

More from Filmibeat

Read more about: mohanlal shobana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X