Thug Life First Review: థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ రివ్యూ
దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా థగ్ లైఫ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, అభిరామి హీరోయిన్లుగా నటించారు. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. జూన్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి సెన్సార్ బోర్డు అధికారుల రివ్యూ వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ సినిమా కథను కమల్ హాసన్, మణిరత్నం సంయుక్తంగా రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌లో వెల్లడైన అంశాల ప్రకారం.. మాఫియా సామ్రాజ్యాన్ని తన కన్ను సన్నల్లో పాలించే రంగరాయ శక్తివేల్‌కు మాణిక్యంకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. మాణిక్యం జరిపిన కాల్పుల నుంచి రంగరాయ శక్తివేల్‌ను అమరన్ (శింబు) కాపాడుతాడు. దాంతో యముడి నుంచి ప్రాణాలుకాపాడి తనకు ప్రాణ భిక్షపెట్టిన అమరన్‌ను శక్తివేల్ తన కుమారుడిగా పెంచుతాడు. తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే అమరన్ స్వయంగా శక్తివేల్‌కు ఎదురు తిరుగుతాడు. దాంతో మాఫియా సామ్రాజ్యం ఎలాంటి భారీ కుదుపుకు లోనైంది అనేది సినిమా కథ.

థగ్ లైఫ్ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు వీక్షించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ప్రశంసలు గుప్పించగా, మరికొన్ని సన్నివేశాలపై కఠినంగా వ్యవహరించారు. అభ్యంతరకరమైన సన్నివేశాలకు సంబంధించిన సంభాషణలను మ్యూట్ చేశారు. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలకు ఎలాంటి కట్స్ లేకుండా సినిమాను ఆమోదించి దానికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
37 ఏళ్ల తర్వాత నాయకన్ సినిమా అనంతరం మణిరత్నం, కమల్ హాసన్ ఇద్దరు థగ్ లైఫ్ కోసం జత కలిశారు. ఈ సినిమాలోని త్రిష, అభిరామి, నాజర్, పంకజ్ త్రిపాఠి, జోజు జార్జ్ తదితర పాత్రలను ఎమోషనల్‌గా, ఇంటెన్సివ్‌గా మలిచారు. వారి పాత్రల నటనపై, అలాగే కమల్ హాసన్, శింబు హోరాహోరీగా కలిసి పెర్ఫార్మ్ చేసిన సన్నివేశాలను సీబీఎఫ్‌సీ అధికారులు మెచ్చుకొన్నారు అనే విషయం బయటకు తెలిసింది.
యాక్షన్, ఎమోషనల్, లవ్, సస్సెన్స్, థ్రిల్లర్ లాంటి అంశాలను జోడించి రూపొందించిన థగ్ లైఫ్ సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాలు, వయోలెన్స్, మాఫియా నేపథ్యంలో సాగే క్రైమ్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి యూఏ (UA) 16+ సర్టిఫికెట్ ఇచ్చారు. 16 ఏళ్లు నిండిన వారికి థియేటర్లలో ఈ సినిమా చూసే అర్హతను కల్పించారు అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
ఇక ఈ సినిమాకు రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్‌తో లాంటి దిగ్గజాలు సాంకేతిక విభాగాలను నడించారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల పనితీరుపై సెన్సార్ అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసింది. రన్ టైమ్ విషయానికి వస్తే.. 165 నిమిషాలు అంటే.. 2 గంటల 45 నిమిషాల నిడివితో ఈ సినిమాను కట్ చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ కోసం ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











