Thug Life Critic Review: థగ్ లైఫ్ కల్ట్ క్లాసిక్.. టాప్ రేటింగ్‌తో పాపులర్ క్రిటిక్ రివ్యూ

దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా థగ్ లైఫ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, అభిరామి హీరోయిన్లుగా నటించారు. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.

థగ్ లైఫ్ సినిమా కథను కమల్ హాసన్, మణిరత్నం సంయుక్తంగా రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌లో వెల్లడైన అంశాల ప్రకారం.. మాఫియా సామ్రాజ్యాన్ని తన కన్ను సన్నల్లో పాలించే రంగరాయ శక్తివేల్‌కు మాణిక్యంకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. మాణిక్యం జరిపిన కాల్పుల నుంచి రంగరాయ శక్తివేల్‌ను అమరన్ (శింబు) కాపాడుతాడు. దాంతో యముడి నుంచి ప్రాణాలుకాపాడి తనకు ప్రాణ భిక్షపెట్టిన అమరన్‌ను శక్తివేల్ తన కుమారుడిగా పెంచుతాడు. తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే అమరన్ స్వయంగా శక్తివేల్‌కు ఎదురు తిరుగుతాడు. దాంతో మాఫియా సామ్రాజ్యం ఎలాంటి భారీ కుదుపుకు లోనైంది అనేది సినిమా కథ.

అయితే దుబాయ్‌లో జరిగే సెన్సార్ వద్ద సినిమాలను చూశాను అంటూ తనకు తాను క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లో థగ్ లైఫ్ గురించి సమీక్షను వివరంగా ఇచ్చారు. ఈ సినిమా బాగుంది అంటూ టాప్ రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమాగురించి ఉమేర్ సంధూ కల్ట్ క్లాసిక్.. సూపర్ హిట్ అంటూ కామెంట్ కూడా చేశాడు. ఆయన వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

Thug Life Review by Critic Umair Sandhu

థగ్ లైఫ్ సినిమాను దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఆ సినిమా కల్ట్ క్లాసిక్. థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో కమల్ హాసన్, శింబు పెర్ఫార్మెన్సెస్ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. పవర్ ప్యాక్డ్ స్టోరీ మాత్రమే కాదు.. యాక్షన్, స్టంట్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. గతంలో ఏఆర్ రెహ్మాన్, మణిరత్నం కాంబో ఎన్నో మ్యాజిక్స్ చేసింది. ఈ అరుదైన కాంబో మళ్లీ మరోసారి తమ తడాఖాను చూపించబోతున్నది. ఈ సినిమా తప్పకుండా చూడండి అంటూ ఉమేర్ సంధూ తన రివ్యూను అందించాడు.

అయితే ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు వాస్తవానికి ఆమడదూరంలో ఉంటాయనేది నెటిజన్ల అభిప్రాయం. చాలాసార్లు ఆయన చెప్పిన రివ్యూకు భిన్నంగా ఫలితాలు, సినిమా ఉండటం దిగ్రాంతిని కలిగించాయి. దాంతో ఉమేర్ సంధూ రివ్యూపై చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక థగ్ లైఫ్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ తన రేటింగ్‌ను 5 పాయింట్లకు గాను.. 3.5 పాయింట్లతో రేటింగ్ ఇచ్చారు. ఆయన రివ్యూ, రేటింగ్‌పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఉమేర్ సంధూ రివ్యూ కింద నెటిజన్ల కామెంట్ల విషయానికి వస్తే.. ఓ నెటిజన్.. నీ నిన్న నమ్మడం కష్టం అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. నాకు తెలిసిన రివ్యూ ఏమిటంటే.. ఈ సినిమా చెత్తగా ఉంది. కమల్, శింబు సీన్లు తప్పితే ఈ సినిమా అంతా పేలవంగా ఉంటుందని తెలిసింది అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ.. నీవు చెప్పిన రివ్యూ నిజమైతే అంతకంటే ఆనందం ఏముంటుంది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇలా భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి ఈ సినిమా గురించి ఫిల్మీబీట్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ అందించబోతున్నది. ఈ సినిమా గురించిన అప్‌డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X