Thug Life Twitter Review: థగ్ లైఫ్ తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ

లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.

ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజైంది. ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్‌లో బుధవారం అర్ధరాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

Thug Life Twitter Review

థగ్ లైఫ్ ఫస్టాఫ్ గురించి ఓ నెటిజన్ తన కామెంట్స్ వెల్లడించాడు. కథ అంతా ఊహించినట్టుగానే ఉంటుంది. పవర్ కోసం కొట్లాడుకొనే ఇద్దరు వ్యక్తుల కథ. చాలా ల్యాగ్‌గా ఉంది. పెద్దగా ఇంప్రెసివ్ కంటెంట్ కనిపించలేదు. పాత కథే.. పాత స్క్రీన్ ప్లే. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంతగా గొప్పగా లేదు. సినిమాకు హెల్ప్ కాలేదు. సెకండాఫ్ ఎలా ఉంటుందో తెలియదు. చెక్క చివాంత వానమ్ (నవాబ్) 2 మాదిరిగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

థగ్ లైఫ్ తెలుగు వెర్షన్ చూశాను. ఫస్టాఫ్ చాలా బాగుంది. కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ టాప్ క్లాస్. శింబు యాక్టింగ్ టాప్ లెవెల్‌లో ఉంది. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, బీజీఎం అదిరిపోయింది. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

థగ్ లైఫ్ గురించి ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఫస్టాఫ్‌లో హైలెట్స్ ఏమిటంటే? కమల్ వన్ మ్యాన్ షో. కమల్, శింబు పోటాపోటీగా నటించిన సన్నివేశాలు బాగున్నాయి. కథ ఎంగేజింగ్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో శింబు చెలరేగిపోయి అందరి దృష్టిని తనపైకి తిప్పుకొనేలా నటించాడు. కమల్, శింబు మధ్య ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. క్లైమాక్స్‌తో సినిమా థియేటర్ బ్లాస్ట్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

థగ్ లైఫ్ సినిమాలో శింబు కనిపించిన ప్రతీ ఫ్రేమ్‌లో స్టన్నింగ్‌గా ఉన్నాడు. అతడు ఏ సీన్‌లో కూడా నటించలేదు. క్యారెక్టర్‌లో లీనమై కనిపించాడు. ఇంటర్వెల్ సీన్.. పక్కాగా రోమాలు నిక్కబొడిచేలా ఉంది. ఈ సీన్‌లో ఉన్న కంటెంట్ పిచ్చెక్కిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

థగ్ లైప్ సినిమా గురించి ఓ నెటిజన్ తన కామెంట్‌ను ఇలా పోస్టు చేశాడు. కమల్, త్రిషా మధ్య వచ్చే సన్నివేశాలు చాలా డల్‌గా ఉన్నాయి. అభిరామి క్యారెక్టర్ చాలా నీట్‌గా ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఢిల్లీ ల్యాండ్ స్కేప్ విజువల్స్ బాగున్నాయి. కథ బలహీనంగా ఉంటుంది. సినిమాలో ఎమోషన్స్ లేవు. కథలో ట్విస్టులు లేవు. ఎక్సైట్‌మెంట్ లేకుండా సాగదీసినట్టు ఉండే కథనం. నేను పూర్తిగా డిజాపాయింట్‌మెంట్‌కు గురయ్యాను. కమల్ సినిమా, పాలిటిక్స్, ఫ్యామిలీ విషయాల్లో ఫెయిల్ అయ్యాడు అని ఓ నెటిజన్ తన అసంతృప్తిని వెల్లగక్కాడు.

థగ్ లైఫ్ సెకండాఫ్‌లో సినిమాటిక్స్ ఎక్స్‌పీరియెన్స్ పీక్స్‌లో ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ గురించి మాటల్లో చెప్పలేం. రంగరాయ శక్తివేల్ పాత్ర ఎలివేషన్‌తో సాగే ఆ సీన్ మెంటల్ ఎక్కించే విధంగా ఉంటుంది. సినిమా హాల్ మొత్తం అగ్నిపర్వంత పేలితే ఎలా దద్దరిల్లిపోతుందో అలా ఉంటుంది. మణిరత్నం కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమా. శింబు షో రన్నర్. కమల్ హాసన్ నటనను ఎవరూ కూడా మ్యాచ్ చేయలేరు. ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

థగ్ లైఫ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో కమల్, మణిరత్నం కాంబో మ్యాజిక్ చేసింది. రెండేళ్ల తర్వాత వచ్చిన శింబు అదరగొట్టాడు. త్రిష క్యారెక్టర్ బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. కమల్, హాసన్ పోటాపోటిగా నటించే సన్నివేశాలు బాగున్నాయి. సినిమాలోని క్యారెక్టర్లను మణిరత్నం డిజైన్ చేసిన విధంగా, స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్, బీజీఎం సూపర్ అంటూ ఓ నెటిజన్ తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

థగ్ లైఫ్ గురించి ఫస్ట్ రివ్యూ. థ్రిల్లర్, కమల్, శింబు టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో సాగే ఈ సినిమా కల్ట్ క్లాసిక్. పవర్ ప్యాక్డ్ స్టోరీ. యాక్షన్ స్టంట్స్ సూపర్. ఏఆర్ రెహ్మాన్, మణిరత్నం డెడ్లీ కాంబో మరోసారి మ్యాజిక్ చేసింది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లో చూడండి.

థగ్ లైఫ్ సినిమా గురించి ఇన్‌సైడ్ రిపోర్టులు గొప్పగా ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకొంటున్నాను. కమల్ హాసన్, శింబు ఫ్యాన్స్‌కు ఆల్ ది బెస్ట్ అని ఓ నెటిజన్ విషెస్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X