For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tegimpu Review మనీ హీస్ట్ తరహాలో యాక్షన్, డ్రామా.. అజిత్‌‌ సంక్రాంతి హిట్టు కొట్టాడా?

  |

  Rating:
  2.5/5

  నటీనటులు: అజిత్ కుమార్, మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొక్కెన్, వీరా, బక్స్, పావని రెడ్డి తదితరులు
  కథ, దర్శకత్వం: హెచ్ వినోద్
  నిర్మాతలు: జీ స్టూడియోస్, బోనికపూర్
  మ్యూజిక్: జిబ్రాన్
  సినిమాటోగ్రఫి: నీరవ్ షా
  ఎడిటర్: విజయ్ వెలికుట్టి
  బ్యానర్: రెడ్ జెయింట్ మూవీస్
  రిలీజ్ డేట్: 2023-01-11

  తెగింపు మూవీ కథ ఏమిటంటే?

  తెగింపు మూవీ కథ ఏమిటంటే?


  విశాఖపట్నంలోని యువర్ బ్యాంక్‌ దోపిడికి పోలీస్ ఆఫీసర్‌ (అజయ్)తో కలిసి కొంత మంది గ్యాంగ్‌స్టర్స్ భారీ ప్లాన్ చేస్తారు. అయితే తమ ప్లాన్ ప్రకారం సక్సెస్‌ఫుల్‌గా బ్యాంక్‌లోకి ప్రవేశించిన మాఫియా సభ్యులకు డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) షాకిస్తారు. తాను డబ్బు దోచుకొనేందుకు వచ్చానని తన ప్లాన్ చెప్పి మాఫియాకు, బ్యాంక్ అధికారుల, బందీలుగా ఉన్న కస్టమర్లకు డార్క్ డెవిల్ షాకిస్తాడు.

  తెగింపు మూవీలో ట్విస్టులు

  తెగింపు మూవీలో ట్విస్టులు

  గ్యాంగస్టర్లకే షాకిచ్చిన డార్క్ డెవిల్ ఎవరు? వేల కోట్ల రూపాయలను ఎందుకు దోచుకోవాలని ప్లాన్ చేశాడు? బ్యాంక్‌లో ఉన్న డార్క్ డెవిల్ పోలీసులతో ఎలా పోరాడాడు? తన వ్యూహాలతో పోలీసులను ఎలా ఆటపట్టించాడు? బ్యాంక్‌లో ఉన్న డార్క్ డెవిల్‌కు ఎవరు సహాయం చేశారు? డబ్బు దోచుకొనే విషయంలో డార్క్ డెవిల్ అంతిమ లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే తెగింపు చిత్ర కథ.

  ఫస్టాఫ్ ఎలా సాగిందంటే?

  ఫస్టాఫ్ ఎలా సాగిందంటే?

  స్టాక్ మార్కెట్‌‌లో షేర్ల పతనం, వాటి ప్రభావం, ఆ పతనానికి కారణం ఎవరు అనే విషయాలను డాక్యుమెంటరీ స్టైల్‌లో చెప్పే ప్రయత్నం కాస్త నాసిరకంగానే అనిపిస్తుంది. అయితే బ్యాంక్ చెస్ట్ (లాకర్)లో 1000 కోట్ల పరిమితి ఉంటే.. 500 కోట్లు అధనంగా పెట్టడమనే అధికారుల అత్యుత్సాహాన్ని ఓ పాయింట్‌గా చేసుకొని తెగింపు సినిమా ప్రారంభమవుతుంది. అయితే బ్యాంక్ దోపిడి ఎపిసోడ్, ఆ తర్వాత బ్యాంక్‌లో కంటిన్యూ అయ్యే ఎపిసోడ్స్ చిన్న పిల్లల కంప్యూటర్స్ గేమ్స్‌ మాదిరిగా కొనసాగుతాయి. చాలా సీన్లకు సంబంధించిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా నాసిరకంగా ఉండటంతో ఏదో పాత సినిమా చూసినట్టు ఉంటుంది.

  సెకండాఫ్‌ ఎమోషనల్‌గా

  సెకండాఫ్‌ ఎమోషనల్‌గా

  తెగింపు సినిమా సెకండాఫ్‌ విషయానికి వస్తే.. తొలి భాగంలో అనుభవించిన నసకు ఉపశమనం కలిగించేలా కథ, కథనాలు ఉంటాయి. అజిత్ మార్క్ ఫెర్ఫార్మెన్స్, ఎమోషనల్ పాయింట్స్ సినిమాను పాజిటివ్ ట్రాక్‌పైకి తెచ్చేలా ఉంటాయి. డార్క్ డెవిల్ ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాను నిలబెట్టేలా ఉండటం అభిమానులకు ఊరడింపే అని చెప్పాలి. సెకండాఫ్ కంటెంట్ సినిమాకు మంచి బలంగా మారిందని చెప్పవచ్చు.

  దర్శకుడు వినోద్ ప్రతిభ గురించి

  దర్శకుడు వినోద్ ప్రతిభ గురించి

  దర్శకుడు వినోద్ రాసుకొన్న రొటీన్ కథను మరో లెవెల్‌కు చేర్చడంలో తడబాటు కనిపించింది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ప్రభావం తెగింపు సినిమాపై ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో పట్టుకోల్పోయిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఆ లోపాన్ని సవరించుకొనే ప్రయత్నం చేయడం సినిమాకు పాజిటివ్ అంశంగా మారిందని చెప్పవచ్చు.

  అజిత్ స్టైల్ అండ్ స్వాగ్ గురించి

  అజిత్ స్టైల్ అండ్ స్వాగ్ గురించి

  ఇక అజిత్ కుమార్ విషయానికి వస్తే.. కెరీర్‌లో తనకు గ్రేట్ సినిమా కాకపోవచ్చు. అక్కడక్కడ తన మార్క్ మేనరిజం, స్టైల్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తన పాత్రకు తగినట్టుగా ఆయన లుక్, మేకోవర్ సినిమాకు ప్లస్‌గా మారింది. అభిమానులకు ఎప్పటిలానే పండుగ వాతావరణం కల్పించాడు. ఎలివేషన్ షాట్స్‌లో గ్రేస్ బాగుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్ మంచి హ్యుమర్‌ను పండించాడు. మంజు వారియర్, సముద్రఖని, ఇతరులు తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

  తెగింపు టెక్నికల్ అంశాల గురించి

  తెగింపు టెక్నికల్ అంశాల గురించి

  తెగింపు సినిమా సాంకేతిక విభాగల పనితీరు విషయానికి వస్తే.. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను తన మ్యూజిక్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. సముద్రంలో చేజింగ్, బ్యాంక్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌ నీరవ్ షా చక్కగా తెరకెక్కించారు. కథ, కథనాల్లో బలం లేకపోవడం వల్ల సాంకేతిక నిపుణులు సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నాలు చేయలేకపోయారనిపిస్తుంది. బోని కపూర్, జీ సంస్థ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ కూడా యావరేజ్‌గాను ఉన్నాయి.

  ఫైనల్‌గా తెగింపు మూవీ ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా తెగింపు మూవీ ఎలా ఉందంటే?

  యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్, బ్యాంక్ దివాళా తీస్తే సగటు జీవుల పరిస్థితి ఎలా ఉంటుందనే కోణంలో తెరకెక్కించిన చిత్రం తెగింపు. సూపర్ స్టార్ అజిత్ ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్ సినిమాకు పాజిటివ్‌గా మారింది. ఆర్థిక సంస్థల దోపిడిలు, దివాళా నేపథ్యంలో వచ్చిన చిత్రాలతో పోల్చితే.. తెగింపు యావరేజ్ సినిమాగానే చెప్పుకోవాలి. అజిత్ అభిమానించే ఫ్యాన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. లాంగ్ వీకెండ్‌లో సినిమాలను ఆస్వాదించాలనుకొనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్.

  English summary
  Tamil Super Star Ajith Kumar's latest movie is Thunivu. Samudrakhani, Manju Warrior are in lead pair. This movie hits the screens on January 13th. Here is Telugu filmibeat's Exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X