twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thupakula Gudem Review and Rating పోలీస్, నక్సల్స్ డ్రామా.. మణిశర్మ మ్యూజిక్‌తో..!

    |

    Rating:
    2.5/5

    నటీనటులు: ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, శివరాం, జయేత్రి, సురంజిత్, శరత్ బరిగెల, వంశీ వుట్కూరు, వినీత్, విజయ్ తదితరులు
    దర్శకత్వం, ఎడిటింగ్: జైదీప్ విష్ణు
    రచన, సహ దర్శకత్వం: సంతోష్ మురాకర్
    సినిమాటోగ్రఫి: శ్రీకాంత్ అర్పుల
    సంగీతం: మణిశర్మ
    పాటలు: కాసర్ల శ్యామ్
    రిలీజ్ డేట్: 2023-02-03

    నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన తెలంగాణ ప్రాంతంలోని తుపాకులగూడెంలో కుమార్ (శ్రీకాంత్ రాథోడ్), మమత (జయేత్రి) ఒకర్నొకరు ప్రేమించుకొంటారు. అయితే ఉద్యోగం లేకపోవడంతో మమత తల్లి వారి పెళ్లికి అభ్యంతరం చెబుతుంది. నక్సలైట్లుగా మారి లొంగిపోతే పోలీసు ఉద్యోగం వస్తుందని ఓ బ్రోకర్ మాయమాటలు చెప్పడంతో కుమార్‌తోపాటు తుపాకులగూడెం గ్రామానికి చెందిన 100 మంది నక్సలైట్లలో చేరుతారు. ఈ క్రమంలో పోలీసు దళాలను నక్సలైట్ నాయకుడు శివన్న (శివరామ్ రెడ్డి) చంపడంతో ప్రభుత్వం లొంగుబాటు కార్యక్రమాన్ని ఉపసంహరించుకొంటుంది.

    మమతను పెళ్లి చేసుకోవడానికి కుమార్ ఆడిన అబద్దం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? ఏజెన్సీలో దొరగా చెలామణి అయ్యే రాజన్న వేసిన ప్లాన్ ఏమిటి? పోలీసులు, నక్సలైట్లకు మధ్య నకిలీ నక్సలైట్ల పరిస్థితి ఎలా మారింది? పోలీసు ఉద్యోగం కోసం బ్రోకర్ మాటలు నమ్మి నకిలీ నక్సలైట్లుగా మారిన 100 జీవితాలు ఏమయ్యాయి? కుమార్, మమత పెళ్లి జరిగిందా? 100 మంది నకిలీ నక్సలైట్లను రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం అని ఎందుకు అన్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా కథ.

    Thupakula Gudem Review and Rating: Mani Sharma BGM Music, Kasarla Shyam songs makes crazy

    80, 90వ దశకంలో తెలంగాణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్, పోలీసుల మధ్య పోరాటంలో సామాన్య ప్రజలు రకరకాలుగా సమస్యను ఎదుర్కోవడం తెలిసిందే. జీవన ఉపాధి కోసం ప్రజలు నక్సల్స్‌గా మారి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అయితే నక్స్సల్స్ లొంగుబాటు వ్యవహారంలో బ్రోకర్లు, మధ్యవర్తుల ఆడే నాటకం వల్ల చాలా మంది ఇబ్బందులకు లోనయ్యారు. ఇక తుపాకుల గూడెం సినిమాలో అలాంటి ఇతివృత్తాన్ని తీసుకొని.. కొత్తవారితో ఎక్కడా రాజీ లేకుండా కంటెంట్‌ను నమ్ముకొని దర్శకులు సంతోష్, జైదీప్ ఓ మంచి ప్రయత్నం చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో మూడు గ్రూపుల మధ్య జరిగే డ్రామా ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేయడం బాగుంది. లక్ష రూపాయల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే అమాయకుల మానవీయ కోణాన్ని దర్శకులు రాసుకొన్న తీరు బాగుంది. పేరున్న నటీనటులు ఉండి ఉంటే.. సినిమాకు మరింత అటెన్షన్ కచ్చితంగా పెరిగి ఉండేదనిపిస్తుంది.

    నటీనటులు అంతా కొత్తవారైనా బాగా తమ పాత్రలను పండించారు. ఎక్కడ అనుభవ లేమి కనిపించదు. ఇక ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు అత్యంత బలంగా కనిపిస్తారు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేశారు. అటవీ ప్రాంతాన్ని సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ అర్చుల అద్బుతంగా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను సహజసిద్దంగా చిత్రీకరించారు.

    Thupakula Gudem Review and Rating: Mani Sharma BGM Music, Kasarla Shyam songs makes crazy

    పోలీసులు, నక్సల్స్‌కు మధ్య మూడో వర్గం (ప్రజలు) నలిగిపోయే మానవీయ కోణంతో తుపాకులగూడెం తెరకెక్కింది. నిరుద్యోగంతో బాధపడే ప్రజలు బ్రోకర్ల మాయ మాటలకు ఎలా బలయ్యారనే పాయింట్ ఆకట్టుకొనేలా ఉంటుంది. విప్లవాత్మక సినిమాలు, గ్రామీణ నేపథ్యం ఉండే చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

    English summary
    Naxals and Police based rural drama is Thupakula Gudem. Directed by Jaideep, Santhosh. This movie hits the theatres on February 3rd. Here is the telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X