Thurum Khanlu Review తెలంగాణ నేటివిటితో స్వచ్ఛమైన ప్రేమ కథలు.. తురుము ఖానులు రివ్యూ

Rating:
2.5/5

నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు

రచన, దర్శకత్వం: ఎన్ శివ కల్యాణ్
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
సహా నిర్మాత: కే కళ్యాణ్ రావు
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
సినిమాటోగ్రాఫర్: అంబటి చరణ్,
మ్యూజిక్: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్
ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్
మిక్సింగ్: సంతోష్ కుమార్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
రిలీజ్ డేట్: 2023-09-07

తుపాకులగూడెం అనే గ్రామంలో శంకర్ (శ్రీరామ్ నిమ్మల) చిన్నపాటి పొలిటికల్ యూత్ లీడర్. కరోనా సమయంలో తన మేన మరదలు లలిత (ఐశ్వర్య ఉల్లింగాల)ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. అదే ఊరికి చెందిన యువకుడు పట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విరాజ్ బ్రహ్మ (దేవరాజ్ పాలమూర్)కు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. భారతీ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విధవరాలితో ప్రేమలో పడుతాడు. ఇక అదే గ్రామానికి చెందిన విష్ణు (అవినాష్ చౌదరీ) పక్క ఊరుకు చెందిన సహ విద్యార్థి పద్మతో ప్రేమలో ఉంటాడు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు శంకర్ వివాహాన్ని పీటల మీద ఎత్తిపోయేలా విరాజ్ బ్రహ్మ చేస్తాడు. పద్మను ప్రేమను కించపరిచేలా విష్ణు ప్రవర్తించడంతో వారిద్దరూ విడిపోతారు.

Thurum Khanlu review

విరాజ్ బ్రహ్మకు వయసు మీద పడినా ఏ సమస్య కారణంగా పెళ్లి కాలేదు? స్నేహితులు పెళ్లి చేసుకొంటే విరాజ్ ఎందుకు ఈర్షకు గురవుతాడు? శంకర్ పెళ్లిని పీటల మీద నుంచి విరాజ్ బ్రహ్మ ఎందుకు డిస్ట్రబ్ చేస్తాడు? పద్మ, విష్ణు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి. పీటల మీద పెళ్లి ఎత్తిపోయిన తర్వాత విష్ణు పరిస్థితి ఏమిటి? తన పెళ్లిని చెడగొట్టిన బ్రహ్మను శంకర్ ఎలా టార్గెట్ చేశాడు? భారతీతో బ్రహ్మ అఫైర్ ఎలా సాగింది? చివరకు బ్రహ్మ, విష్ణు, శంకర్ పెళ్లిళ్లు జరిగాయా? వారి పెళ్లిళ్లకు ఎదురైన అడ్డంకులు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే తురుము ఖానులు సినిమా కథ.

శంకర్ పెళ్లి ఏర్పాట్లు, బ్రహ్మ ఊరిలోకి ఎంట్రీ ఇవ్వడమనే అంశాలతో తురుము ఖానులు సినిమా చాలా ఫన్నీ నోట్‌లో కొనసాగుతుంది. సినిమాలోని పాత్రలు, వాటి స్వభావాన్ని సున్నితమైన హాస్యంతో పక్కా తెలంగాణ యాస, భాష, వాతావరణంతో ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. విరాజ్ బ్రహ్మ పాత్ర చుట్టు అలుకొన్న హాస్యపు సన్నివేశాలు పండటం వల్ల కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేస్తాయి. మధ్య తరగతి కుటుంబాలు, పేదరికంతో బాధపడే రైతుల ఇబ్బందులను టచ్ చేస్తూ గ్రామీణ ప్రాంతంలో వ్యక్తుల మధ్య ఉండే ఈర్ష్య తదితర అంశాలతో కథను నడిపించిన విధానం దర్శకుడు శివ కల్యాణ్ ప్రతిభకు అద్దం పట్టింది. శంకర్, బ్రహ్మల మధ్య సన్నివేశాలు పిల్లితో చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే విధంగా సన్నివేశాలను దర్శకుడు రాసుకోవడం కథకు ప్లస్ పాయింట్‌గా మారింది. సరదా సరదాగా ఫస్టాఫ్‌ ముగిసిపోతుంది.

తురుము ఖాన్ సినిమా సెకండాఫ్‌ను ఎమోషన్స్, ఫీల్ గుడ్ అంశాలు, చక్కటి డైలాగ్స్‌తో కథను భావోద్వేగంగా చెప్పే ప్రయత్నం చేసిన తీరుకు దర్శకుడిని అభినందించాల్సిందే. పరిమితమైన బడ్జెట్, కనీసం పేరు లేని ఆర్టిస్టులతో ప్రతిభను రాబట్టుకొన్న విధానం సినిమాకు బలంగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు కథను నడిపించి.. ముగించిన తీరు ఫీల్‌గుడ్‌గా మార్చడం సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. ఎక్కడా బోర్ కొట్టుకుండా దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంది.

శంకర్‌గా శ్రీరామ్, బ్రహ్మగా దేవరాజ్ పాలమూర్, విష్ణుగా అవినాష్ తమ పాత్రలో ఒదిగిపోయారు. యంగ్ పొలిటికల్ లీడర్‌గా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్, స్టైల్‌తో శ్రీరామ్ ఆకట్టుకొంటే.. సహజసిద్దమైన గ్రామీణ యువకుడి వ్యవహర తీరుతో దేవరాజ్ కామెడీని తనదైన శైలిలో పండిచాడు. ఇక విష్ణుగా అవినాష్ ఎమోషనల్ పాత్రను తన భుజాలపై మోశాడు. ఐశ్వర్య అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమా వరకు రైటింగ్ బలమైన అంశంగా మారింది. స్క్రీన్ ప్లే, పాత్రలను మలిచిన విధానం దర్శకుడు విజన్‌ ఏంటో చెప్పింది. ఇక డైలాగ్స్, మ్యూజిక్ ఈ మూవీకి మరో స్పెషల్ ఎట్రాక్ష్న్. తెలంగాణ వాతావరణాన్ని చిత్రీకరించిన తీరు బాగుంది. అంబటి చరణ్ ఈ సినిమాకు ఓ డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొచ్చాడని చెప్పవచ్చు. నిర్మాత ఆసిఫ్ జానీ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పరిమితమైన బడ్జెట్‌తో సినిమాను చాలా రిచ్‌గా ప్రజెంట్ చేశారు. ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా హాస్యంతో నింపారు.

తెలంగాణ యాస, భాష, వ్యహారిక పదాలతో వినోద భరితమైన, ఎమోషనల్ ప్రేమ కథ తురుము ఖానులు. గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తుల తీరు తెన్నులు, భావోద్వేగాలను చక్కగా చూపించారు. ఈ సినిమాలో లోపాలు చాలానే ఉన్నాయి. కానీ అత్యంత నిజాయితీతో చేసిన సినిమాగా అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో దాదాపు అంతా కొత్తవారితో అద్బుతంగా ఫెర్ఫార్మెన్స్ చూడటానికి స్కోప్ ఉన్న చిత్రం. చిన్న సినిమాలో లోపాలు వెతక్కుండా చూస్తే.. తెలంగాణ ఫ్లేవర్‌తో ఉన్న మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విలేజ్ నేటివిటితో సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X