Tiger 3 Review నిరాశపరిచిన సల్మాన్.. ఆకట్టుకొన్న షారుక్.. టైగర్ 3 మూవీ ఎలా ఉందంటే?

Rating:
2.0/5

నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, అశుతోష్ రానా, వీరేందర్ సింగ్ గుమన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ తదితరులు
దర్శకత్వం: మనీష్ శర్మ
స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
డైలాగ్స్: అంకుర్ చౌదరీ
కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా
సినిమాటోగ్రఫి: అనయ్ గోస్వామి
ఎడిటింగ్: రామేశ్వర్, భగత్
మ్యూజిక్: ప్రీతమ్ (పాటలు), తనూజ్ టిక్ (బీజీఎం)
బ్యానర్: యష్ రాజ్ ఫిల్మ్స్‌
నిడివి: 156 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-11-12

టైమ్ పాస్ పేరుతో ఆపరేషన్ చేపట్టిన టైగర్ అఫ్ఘనిస్థాన్‌లో భారత అధికారిని రక్షించే క్రమంలో పాకిస్థాన్‌లో డబుల్ ఏజెంట్ పనిచేస్తున్నాడనే విషయం తెలుస్తుంది. టైగర్ భార్య, పాకిస్థాన్‌కు చెందిన జోయా (కత్రినా కైఫ్) తన దేశంలో జరుగుతున్న కుట్రను ఛేధించేందుకు అక్కడికి వెళ్లి టైగర్‌కు షాకిస్తుంది. పాకిస్థాన్ ప్రధాని ఇరానీ (సిమ్రాన్)‌ను గద్దె దించేందుకు కుట్ర పన్నిన ఆతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మీ)తో చేతులు కలుపుతుంది. అయితే జోయా, అతీష్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన టైగర్ ఆ దేశపు సైన్యానికి చిక్కుతాడు.

Tiger 3 Movie Review and Rating: Salman Khan utterly failed.. Shah Rukh Khan Impressive

పాకిస్థాన్ ఆర్మీకి టైగర్ చిక్కిన తర్వాత ఏం జరిగింది? పాక్ ఆర్మీ చెర నుంచి టైగర్ ఎలా తప్పించుకొన్నాడు? టైగర్‌ను రక్షించడానికి పఠాన్ (షారుక్ ఖాన్) ఎలా రంగంలో దిగాడు? టైగర్, పఠాన్ కలిసి పాకిస్థాన్ ఆర్మీపై చేసిన విధ్వంసం ఎలా సాగింది? ఆతీష్ రెహ్మన్ కుట్రలను టైగర్, జోయా ఎలా అడ్డుకొన్నారు? పాకిస్థాన్ ప్రధానిని రక్షించడానికి, పాక్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా టైగర్ ఎలాంటి సాహసానికి పాల్పడ్డారనే ప్రశ్నలకు యాక్షన్ రూపంలో దొరికిన సమాధానాలే టైగర్ 3 సినిమా కథ.

జోయా ఎందుకు గూఢచారిగా మారిందనే చిన్న ఎపిపోడ్‌తో సినిమాను ఎమోషనల్‌గా ప్రారంభించడంతో ఏదో కొత్తగా అనుభూతిని పొందబోతున్నామనే ఫీల్ కలుగుతుంది. ఆ తర్వాత అఫ్ఘనిస్థాన్‌లో యాక్షన్ సీక్వెన్స్‌‌తో ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం బాగుంది. కానీ తదనంతరం రాసుకొన్న సన్నివేశాలు, కథలేకుండా ఫస్టాఫ్‌లో చేసిన ప్రయత్నం బెడిసి కొట్టాయి. నాసిరకమైన స్టంట్స్,పేలవమైన సీన్లు సినిమాను పేలవంగా మార్చాయి. ఫస్టాఫ్‌ అనేక గందరగోళాల మధ్య ముగుస్తుంది.

Tiger 3 Movie Review and Rating: Salman Khan utterly failed.. Shah Rukh Khan Impressive

ఫస్టాఫ్‌లో చేదు అనుభవాన్ని పొందిన ప్రేక్షకుడికి సెకండాఫ్‌లో ఏదైనా బెటర్‌గా ఉంటుందనే ఫీల్‌తో వారికి షారుక్ ఖాన్ (పఠాన్) వచ్చి సినిమాకు జోష్‌ పెంచాడు. సల్మాన్, షారుక్ ఖాన్ కలిసి చేసిన కామెడీ టచ్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయనిపిస్తాయి. కానీ వారిద్దరి ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లేంత దమ్ము కనిపించదు. చివరగా పాకిస్థాన్ ప్రధానిని రక్షించే ఎపిసోడ్‌‌తో కొంత భావోద్వేగాలకు దర్శకుడు స్కోప్ ఇవ్వడం ఊరటగా కనిపిస్తుంది. చివర్లో టైగర్ 4 మూవీకి సంబంధించిన వార్ మూవీకి సంబంధించిన హృతిక్ పాత్రను పరిచయం చేస్తూ చూపించిన గ్లింప్స్ ప్రేక్షకులను థ్రిల్లింగ్‌గా మిగిలించే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.

గతంలో వచ్చిన రెండు టైగర్ సిరీస్‌లో సల్మాన్ ఖాన్ బలంగా కనిపిస్తాడు. కానీ టైగర్ 3 సినిమా విషయానికి వస్తే.. క్యారెక్టర్ పరంగా, లుక్ పరంగా పేలవంగా కనిపించాడు. బాడీ లాంగ్వేజ్‌లో జోష్ ఉండకపోవడంతో నీరసంగా తెరమీద కనిపిస్తాడు. సల్మాన్ ఖాన్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్ ఆశించిన వారికి నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌కు పూర్తిగా నిరాశ పరిచాడనే చెప్పాలి. ఇక కత్రినా విషయానికి వస్తే.. ఈ మూవీలో డామినేషన్ కని‌పించింది. యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నది. ఆతీష్ రెహ్మాన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. రేవతి, సిమ్రాన్ పాత్రలు అతిధులుగానే కనిపించడం వల్ల వారు పెర్ఫార్మ్ చేయడానికి వీలు కలుగలేదనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నించిన వారి ఒకే అనిపించారు.

Tiger 3 Movie Review and Rating: Salman Khan utterly failed.. Shah Rukh Khan Impressive

టైగర్ 3 సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు పనితీరు నాసిరకంగా ఉంది. మ్యూజిక్ ఈ సినిమాకు భారీ డ్రాబ్యాక్. పాటలు, బీజీఎం కూడా సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేయలేకపోయాయి. గ్రాఫికవిషయానికి వస్తే.. కార్టూన్ నెట్‌వర్క్ కంటే దారుణంగా ఉన్నాయి. కొంతలో యాక్షన్ పార్ట్ బాగుంది. డైలాగ్స్, సీన్లు రాసుకొన్న విధానం ఆకట్టుకోలేకపోయింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల సినిమాను చుట్టేసినట్టు అనిపిస్తాయి.

భారత దేశ అంతర్గత భద్రతకు పాటుపడే టైగర్ 3.. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఏర్పడబోయే సంక్షోభాన్ని కాపాడే పాయింట్‌గా టైగర్ 3 సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఏ ఒక్క పాత్ర కూడా జస్టిఫై చేసే విధంగా, పవర్ ఫుల్‌గా లేకపోవడం వల్ల స్పై థ్రిల్లర్ ఆకట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది. షారుక్ ఖాన్ ఎపిసోడ్ బాగుంది. హై మూమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల సినిమా చప్పగా సాగిందనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్, టైగర్ సిరీస్ అభిమానులు ఓసారి చూడొచ్చు. వీకెండ్‌లో ఏమీ తోచకపోతే.. సల్మాన్, షారుక్‌లను చూడాలనుకొనే వారు ఓసారి లుక్కేయండి. అంచనాలు పెట్టుకొని వెళితే పూర్తిగా నిరాశపడే ప్రమాదం ఉంది. కాబట్టి అంచనాలు లేకుండా వెళితే.. నచ్చడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్‌గా తొలివారం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X