Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తొలిచూపులోనే..
చిత్రం: తొలిచూపులోనే
నటీనటులు: కళ్యాణ్ రామ్, ఆకాంక్ష, శారద,
సుమన్, చరణ్ రాజ్, బ్రహ్మనందం, సునీల్ తదితరులు
సంగీతం: చక్రి
నిర్మాత: రామోజీరావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కాశీ విశ్వనాథ్
నందమూరి హరికృష్ణ రెండో కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రం కూడా 'లాంఛింగ్' చిత్రాల బాటలోనే నడిచింది. షరామామూలే, పేలవమైన ప్రేమకథా చిత్రం ఇది. కళ్యాణ్ రామ్ ఫర్వాలేదనిపించినా, సినిమాలో వైవిధ్యం, కొత్తదనం లేదు. దర్శకుడు కాశీ విశ్వనాథ్ తన తొలి చిత్రం 'నువ్వు లేక నేను లేను' వంటి హిట్ తర్వాత రూపొందించిన చిత్రం ఇది.
సురేష్ ప్రోడక్షన్స్ లో పనిచేసి వచ్చిన దర్శకులకు పెద్దగా 'డిమాండ్' ఎందుకు ఉండదో మరోసారి కాశీ తెలియచేసినట్లైంది. ఆ సినిమాలో చూపిన 'ప్రతిభ' ఏ కోశానా కన్పించలేదు. ప్రథమార్థం ఎక్కువ సేపు బోరు కొట్టిస్తుంది. సెకాండాఫ్ కాస్తా ఫర్వాలేదు.
సింహాచలంలో ఉండే యువకుడు రాజు (కళ్యాణ్ రామ్) దేవాలయానికి వచ్చిన హీరోయిన్ భాను (ఆకాంక్ష)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, రాజు చేసే కొన్ని చేష్టల వల్ల భాను అందరి హీరోయిన్ ల మాదిరిగానే రాజును మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటుంది. తర్వాత హీరోగారి సుగుణాలు తెల్సుకొని ప్రేమిస్తుంది. కానీ, హీరోయిన్ తండ్రి (సుమన్) ఇంతకుముందే తన స్నేహితుడికి తన కూతరును ఆ ఇంటి కోడలిని చేస్తానని ప్రామిస్ చేస్తాడు. సునీల్ కామెడీతో..ఇక సినిమా ద్వితీయార్థం అంతా హీరో - హీరోయిన్ తండ్రిని ఒప్పించడమే.
కళ్యాణ్ రామ్, ఆకాంక్షలిద్దరూ ఫర్వాలేదనే చెప్పాలి. నానమ్మ పాత్రధారి శారదకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. నీకు నువ్వు-నాకు నేను తర్వాత సుమన్ మరోసారి హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాడు. కామెడీ, చక్రి పాటలు ఈ సినిమాలో కొంచెం రిలీఫ్.