Don't Miss!
- News
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎన్నీ, ఆ ఖర్చెంతంటే?
- Sports
పోలీస్ ఆఫీసర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Top gear review: ఆది సాయి కుమార్ టాప్ గేర్ వేశాడా? డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో..!
Rating: 2.75/5
నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, మైమ్ మధు, శత్రు, రవి, చమ్మక్ చంద్ర, బ్రహ్మాజీ, టెంపర్ రవి, సత్యం రాజేష్ తదితరులు
దర్శకత్వం: శశికాంత్
నిర్మాత: కేవీ శ్రీధర్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫి: సాయి శ్రీరాం
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రిలీజ్ డేట్: 2022-12-30

టాప్ గేర్ సినిమా కథ
మిడిల్ క్లాస్‌కు చెందిన అర్జున్ (ఆది సాయికుమార్) క్యాబ్ నడుపుకొంటూ జీవితాన్ని కొనసాగించే డ్రైవర్. కొత్తగా పెళ్లి చేసుకొని భార్య ఆద్య (రియా సుమన్)తో సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకొంటాడు. అలాంటి క్యాబ్ డ్రైవర్ జీవితం డ్రగ్స్ మాఫియా ఉచ్చులో చిక్కుకుంటుంది. ముంబైలో కరడుగట్టిన డ్రగ్స్ డీలర్ సిద్దార్థ్.. అర్జున్ భార్యను అడ్డుపెట్టుకొని అతడిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.

టాప్ గేర్‌లో ట్విస్టులు
మాఫియా డాన్ సిద్దార్థ్ ముంబై నుంచి ఎందుకు హైదరాబాద్ వచ్చాడు? కోట్ల విలువైన డ్రగ్స్‌ను కాపాడుకోవడానికి అర్జున్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? అర్జున్ భార్య ఆద్యను సిద్దార్థ్ ఎలా టార్గెట్ చేశాడు? సిద్దార్థ్ బారిన పడిన ఆద్యను అర్జున్ ఎలా కాపాడుకొంటాడు? సిద్దార్థ్ ఇచ్చిన టాస్క్‌ను అర్జున్ పూర్తి చేశాడా? సిద్దార్థ్ సృష్టించిన సమస్య నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడు? సిద్దార్థ్‌ను వెంటాడే ఏసీపీ విక్రమ్ (శత్రు) తన ఆపరేషన్‌ను పూర్తి చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే టాప్ గేర్ సినిమా కథ.

టాప్ గేర్ సినిమా ఎలా ఉందంటే
దర్శకుడు శశికాంత్ ఎంచుకొన్న పాయింట్ సింపుల్‌గా అనిపించినప్పటికీ.. ఆ పాయింట్‌ను ఆది సాయి కుమార్, మైమ్ మధు బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా మలిచిన విధానం బాగుంది. అయితే కథ, కథనాల విషయంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో ఎక్కడో టార్గెట్ మిస్ అయ్యాడా? టాప్ గేర్ సరిగా పడలేదా అనే అసంతృప్తి కలిగించినా.. క్లైమాక్స్‌తో సంతృప్తిపరచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. స్క్రిప్టుపరంగా ఉన్న లోపాలను మైమ్ మధు, ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్ కనపడనియకుండా చేసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఆది సాయి కుమార్.. ఇతర నటీనటుల గురించి
ఆది సాయి కుమార్ ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే... అర్జున్ పాత్రలో మిడిల్ క్లాస్ యువకుడిగా చక్కగా ఒదిగిపోయాడు. ప్రతీ సినిమాకు నటుడిగా పరిణితిని సాధిస్తూ.. తన టైమింగ్‌ను మెరుగుపరుచుకొనే ప్రయత్నం చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగించాడు. ఎమోషనల్ సీన్లలో ఆది మరోసారి తన ప్రతిభను చాటుకొన్నాడు. కథ, కథనాలపై ఆది దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మంచి కథలతో ప్లాన్ చేసుకొంటే.. మంచి రేంజ్‌లో కెళ్లే హీరో అయ్యే అవకాశం ఉంటుంది. ఆద్యగా రియా సుమన్ తన పాత్రకు తగినట్టుగా నటించింది. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మైమ్ గోపి యాక్టింగ్. మంచి ఎలివేషన్స్‌తో తన పాత్రను రక్తి కట్టించాడు. ఏసీపీగా శత్రు పాత్ర బోనస్. రవి, చమ్మక్ చంద్ర, బ్రహ్మాజీ, టెంపర్ రవి, సత్యం రాజేష్ తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
టాప్ గేర్ సినిమా సాంకేతిక విభాగాల విషయంలోకి వెళితే. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పలు సీన్లను తన బీజీఎంతో మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రవీణ్ పూడి సినిమాను, సన్నివేశాలను చకచకా పరుగులు పెట్టించాడు. శ్రీధర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఒక్క రాత్రి ఆసక్తికరమైన అంశాలతో జరిగే కథ టాప్ గేర్. డ్రగ్స్ నేపథ్యంతో సాగే సినిమాల ప్రభావం ఈ సినిమాపై కొంత ఉందనిపిస్తుంది. ఆది సాయికుమార్ చేసిన మరో మంచి ప్రయత్నం. నటీనటుల ఫెర్పార్మెన్స్ పాజిటివ్ అంశంగా మారిందని చెప్పవచ్చు. సీన్ సీన్‌కు పెంచాల్సిన క్యూరియాసిటీ మిస్ అవుతుంది. లాజిక్స్ వెతకకుండా చూస్తే.. మంచి ఫన్, ఎమోషనల్ రైడ్ ఉంటుంది. అంచనాలు లేకుండా వెళితే.. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.