twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Top Gun: Maverick movie review టామ్ క్రూయిజ్ వన్ మ్యాన్ షో.. థ్రిల్లింగ్‌గా ఏరియల్ స్టంట్స్

    |

    Rating: 3/5

    హాలీవుడ్‌లో టీజర్లు, ట్రైలర్లతో విడుదలకు ముందే సంచలనం రేపిన చిత్రం టాప్ గన్: మావెరిక్. 1986లో వచచ్చిన టాప్ గన్ చిత్రానికి ఇది సీక్వెల్. పీట్ మావెరిక్ మిచెల్‌ పాత్రతో ఆకట్టుకొన్న టామ్ క్రూయిజ్ హీరోగా మరోసారి ఐకానిక్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 36 ఏళ్ల తర్వాత వచ్చిన టాప్ గన్: మావెరిక్ సినిమా ఎలా ఉంది? టామ్ క్రూయిజ్ యాక్షన్ డ్రామా ఎలాంటి అనుభూతికి గురిచేసింది?

    పీట్ మావెరిక్ మిచెల్ (టాప్ క్రూయిజ్) అమెరికా ఆర్మీలో ఫైటర్ పైలెట్. లెఫ్టినెంట్ బ్రాడ్లీ బ్రాడ్‌షా (మైల్స్ టెల్లర్)తోపాటు టాప్ పైలెట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి పిలుస్తారు. ఈ నేపథ్యంలో పీట్ మావెరిక్ మిచెల్‌ను తన స్నేహితుడు, కొన్ని కారణాల వల్ల చనిపోయిన పైలెట్ గూస్ కుమారుడు రూస్టర్ వ్యతిరేకిస్తాడు.

    Top Gun: Maverick movie review and Rating:  Tom Cruise steal the show again after 36 years

    30 ఏళ్ల తర్వాత పీట్ మావెరిక్ మిచెల్‌ను ట్రైనర్‌గా ఎందుకు పెట్టుకొన్నారు. తన స్నేహితుడు గూస్ ఎలా చనిపోయాడు? తనపై గూస్ కుమారుడు రూస్టర్ (మైల్స్ టెల్లర్) ఎందుకు కోపం పెంచుకొన్నాడు? మావెరిక్ మిచెల్ ప్రియురాలి విషయమేమిటి? ట్రైనింగ్ తర్వాత మావెరిక్ మిచెల్ ఎలాంటి సాహసానికి పూనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే టాప్ గన్ మావెరిక్ సినిమా కథ.

    1986లో వచ్చిన టాప్ గన్ సినిమా సమయంలో టామ్ క్రూయిజ్ 24 ఏళ్ల వయసు. ప్రస్తుతం సీక్వెల్ సమయానికి 59 సంవత్సరాలు. త్వరలోనే 60 సంవత్సరాల వయసులోకి ప్రవేశించే టామ్ క్రూయిజ్‌‌లో యాక్షన్, ఫైట్స్, రొమాన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గుదల కనిపించలేదు. అదే జోష్, అదే బాడీ లాంగ్వేజ్, అప్పటి మాదిరిగానే సిక్స్ ప్యాక్ బాడీ, యాక్షన్ సీన్లలో అదే తెగింపు టాప్ గన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

    కథలో తన స్నేహితుడు మరణం కారణంగా తనపై అనుమానాలు తలెత్తడం, వాటన్నింటిని దాటుకొని తిరిగి విధుల్లోకి రావడం అనే విషయాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. గూస్ కుమారుడు రూస్టర్‌తో పోటాపోటీ సీన్లు రసవత్తరంగా కనిపిస్తాయి.

    ఇక టాప్ గన్: మావెరిక్ సినిమాను రూపొందించిన విధానానికి దర్శకుడు జోసెఫ్ కొసింన్క్సీ అభినందించాల్సిందే. ఆకాశంలో సాహోసోపేతమైన విన్యాసాలు, ఏరియల్ స్టంట్స్ సినిమాను ఆహ్వాదకరంగా మారుస్తాయి. హై టెక్నికల్ వ్యాల్యూస్ ఆద్యంతం తెర మీద సన్నివేశాలను ఆసక్తికరంగా మార్చాయి. ఐస్ మ్యాన్ పాత్రలో వాల్ కిల్మర్ మరోసారి గతంలోకి తీసుకెళ్తారు. మావెరిక్ ప్రియురాలు పెన్నీగా జెన్నిఫర్ కొన్నెల్లే‌తో రొమాంటిక్ సీన్లు ఫన్నీగా ఉన్నాయి.

    టాప్ గన్ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. టామ్ క్రూయిజ్ పాత్ర పరంగా హీరోయిజం, హృదయాన్ని తట్టిలేపే ఫ్రెండ్‌షిప్, హాట్ రొమాన్స్, శిక్షణ శిబిరంలో అభ్యంతరాలు, వ్యతిరేకత అంశాలు సినిమాను ఎమోషనల్‌గా మార్చాయి. ఏరియల్ యాక్షన్ సీన్లు థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. ఫైటర్ విమానాన్ని బైక్‌తో టామ్ క్రూయిజ్ ఛేజ్ చేయడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తాయి. మంచు కొండల్లో యాక్షన్ సీన్లు మరింత థ్రిల్లింగ్‌గా ఉంటాయి. యాక్షన్ సినిమాలను, టామ్ క్రూయిజ్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది.

    English summary
    Hollywood super stat Tom Cruise's latest movie Top Gun: Maverick hits the theatres. Here is the exclusive review of the movie by telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X