twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టచ్ చేసి చూడు సినిమా రివ్యూ: రవితేజ మార్కు మూవీ

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్
    Director: విక్రమ్ సిరికొండ

    Recommended Video

    టచ్ చేసి చూడు రివ్యూ : Why you Should Watch this Movie

    రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడు. దర్శకుడు విక్రమ్ సిరికొండతో కలిసి, తన ఎనర్జీకి సరిపడే టైటిల్‌‌ను, కథను ఎంచుకొని రవితేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నటించారు. మాస్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలు కలిసి ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్‌కు సిద్ధమైంది. రాజా ది గ్రేట్ మాదిరిగానే రవితేజ్‌కు ఈ చిత్రం సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

     టచ్ చేసి చూడు కథ ఇదే

    టచ్ చేసి చూడు కథ ఇదే

    కార్తికేయ (రవితేజ) నిజాయితీ, బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. డ్యూటీని తప్ప ఫ్యామిలీ పట్టించుకొని మెంటాలిటి. లాలా (ఫ్రెడ్డీ దారువాలా) అనే రాజకీయ నాయకుడితో వైరం ఏర్పడుతుంది. ఆ క్రమంలో కానీ కొన్ని కారణాల వల్ల డ్యూటికి దూరం అవుతాడు. ఏ కారణంగా విధులకు దూరంగా ఉంటాడు. కానీ ఓ లక్ష్యం కోసం మళ్లీ డ్యూటీలో చేరుతాడు.

     క్లైమాక్స్‌కు దారిలా..

    క్లైమాక్స్‌కు దారిలా..

    డ్యూటీలో చేరిన కార్తికేయ తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? కార్తీకేయ జీవితంలో దివ్య (సీరత్ కపూర్), పుష్ఫ (రాశీ ఖాన్నా) పాత్రలేమిటీ? ఏ కారణంగా పోలీస్ వృత్తికి దూరమయ్యాడు? టీచర్ (సుహాసిని) పాత్ర ఏమిటి? లాలా రాజకీయ ఎత్తులకు కార్తీకేయ ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే టచ్ చేసి చూడు సినిమా కథ.

     ఫస్టాఫ్‌లో కథ

    ఫస్టాఫ్‌లో కథ

    వృత్తిని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలనే సింగిల్ లైన్ కథ ఆధారంగా అల్లుకొన్న చిత్రం టచ్ చేసి చూడు సినిమా. తొలి భాగంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. రాశీ ఖన్నాతో సరదాగా రొమాంటిక్ సన్నివేశాలతో కథ సాగుతుంది. ఫస్టాఫ్ చివర్లో ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసి రెండోభాగంపై ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచడం జరుగుతుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో బాధ్యయుతమైన పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ్ ఫెర్ఫార్మెన్స్ పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. డ్యూటీతోపాటు సీరత్ కపూర్‌తో లవ్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ మధ్య ఉండే బంధాలు, అనుబంధాలతో ఆసక్తికరంగా సాగిపోతుంది. ఓ టీచర్ ఇక సినిమా చివరి అర్ధగంటలో రాజకీయనాయకుడు లాలా, పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగిన సన్నివేశాలతో సినిమా చకచకా సాగిపోతుంది. లాలా ఆగడాలకు ముగింపు పలకడం ద్వారా సినిమా రొటీన్‌గా ముగుస్తుంది.

    దర్శకుడు విక్రమ్ పనితీరు

    దర్శకుడు విక్రమ్ పనితీరు

    మాస్ మహారాజా రవితేజ్ బాడీ లాంగ్వేజ్‌ను, ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు విక్రమ్ సిరికొండ రాసిన కథనే టచ్ చేసి చూడు. పోలీస్ ఆఫీసర్ కథకు, ఫ్యామిలీ ఎమోషన్ జోడించే ప్రయత్నంలో తడబాటు కనిపించింది. తొలిభాగంలో బలమైన సన్నివేశాలను దర్శకుడు రాసుకొని ఉంటే సినిమా ఫీల్‌గుడ్‌గా మారి ఉండేది. ఇక రెండోభాగంలో సుహాసిని ఎపిసోడ్‌పై విక్రమ్ మరింత దృష్టిపెట్టి ఉండాల్సిదేమోననిపించింది. అనవసరమైన సీన్లతో సెకండాఫ్‌లో నిడివి పెరిగి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది.

     రవితేజ పెర్ఫార్మెన్స్

    రవితేజ పెర్ఫార్మెన్స్

    కార్తీకేయగా రవితేజ తన నటనతో మెప్పించాడు. మాస్ ఎలిమెంట్స్ కలిసి ఉన్న పాత్రకు తన ఎనర్జీని జోడించి ఆకట్టుకొన్నాడు. ఇలాంటి పాత్రలు రవితేజకు కొట్టిన పిండే అనేది వాస్తవం. కుటుంబ పరమైన సన్నివేశాల్లోను తన మార్క్ చూపించాడు. ఇద్దరు హీరోయన్లతో రొమాన్స్‌ను తెరమీద పండించాడు. ఓవరాల్‌గా తన మార్క్ సినిమాను ప్రేక్షకులకు రుచి చూపించడంలో సఫలమైనారని చెప్పవచ్చు.

     గ్లామర్‌గా రాశీఖన్నా

    గ్లామర్‌గా రాశీఖన్నా

    ఇక గ్లామర్ హీరోయిన్లుగా రాశీ ఖన్నా, సీరత్ కపూర్ ఆకట్టుకొన్నారు. ప్రథమార్థంలో రాశీఖాన్నా, సెకండాఫ్‌లో సీరత్ కపూర్ తమ అందచందాలతో ఆకట్టుకొన్నారు. రాశీఖన్నా విషయానికి వస్తే అందం, అభినయం విషయంలో మరింత రాటుదేలిందనే చెప్పాలి.

     మెప్పించిన సీరత్

    మెప్పించిన సీరత్

    రాజుగారి గది2, ఒక్క క్షణం లాంటి చిత్రాలతో ఆకట్టుకొన్న సీరత్ కపూర్‌ తాజాగా మరో విభిన్నమైన పాత్రలో కనిపించింది. గ్లామర్‌తోనే కాదు అభినయంతో మెప్పించింది. కీలక సన్నివేశాల్లో మెరుగైన నటనను ప్రదర్శించింది. నటనపై మరింత దృష్టిపెడితే టాప్ హీరోయిన్‌గా మారే అవకాశం సీరత్‌కు ఉంది.

     కీలకపాత్రలో సుహాసిని

    కీలకపాత్రలో సుహాసిని

    కథను కీలక మలుపు తిప్పే ఎపిసోడ్స్ ద్వారా సుహాసిని ఓ మంచి పాత్రలో కనిపించారు. సుహాసిని పోషించిన టీచర్ పాత్రను కాస్తా పొడిగించి ఉండే సెంటిమెంట్ బలంగా పండి ఉండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతిభావంతురాలైన సుహాసిని పాత్రను సద్వినియోగం చేసుకోలేదనే అభిప్రాయం కలుగడం సహజం.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    టచ్ చేసి చూడు చిత్రంలో మిగితా పాత్రల్లో పోలీస్ ఆఫీసర్‌గా మురళీశర్మ, సహ ఉద్యోగులు వెన్నెల కిషోర్ నటించారు. మురళీ శర్మ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. సీరియస్ సన్నివేశాల్లోనూ, కామెడీ సన్నివేశాల్లోనూ మురళీ శర్మ తనదైన శైలిని ప్రదర్శించాడు. , రవితేజ తండ్రిగా జయప్రకాశ్ పాత్ర పరిమితమైనప్పటికీ ఓకే అనిపించాడు.

     పాత చింతకాయపచ్చడితో వక్కంతం

    పాత చింతకాయపచ్చడితో వక్కంతం

    సాంకేతిక విభాగంలో తొలుత కథ విషయానికి వస్తే.. పాత చింతకాయ పచ్చడి లాంటి కథను వక్కంతం వంశీ మళ్లీ తిరేగేశాడేంటీ అనిపిస్తుంది. ఈ జనరేషన్ సరిపడని ముతక కథను ప్రేక్షకులపై బలంగా రుద్దే ప్రయత్నం చేశాడు వక్కంతం. నాసిరకమైన కథ, కథనాలు సినిమాకు అడ్డంకిగా మారాయని చెప్పవచ్చు. డైలాగ్స్ కూడా సో.. సో..గా అనిపిస్తాయి.

     స్పెషల్‌గా సినిమాటోగ్రఫీ

    స్పెషల్‌గా సినిమాటోగ్రఫీ

    టచ్ చేసి చూడు సినిమాకు ఒకట్రెండు పాటలు తప్ప పెద్దగా ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు కొత్తగా ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఇంకా చేతినిండా పని ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వెండితెరపైనా పోలీస్ కథలు ఎన్ని వచ్చినా.. పాయింట్, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటే ఆదరణ బాగా ఉంటుందని ప్రేక్షకులు పలుమార్లు నిరూపించారు. టచ్ చేసిన చూడు కథలో కొత్తదనం కనిపించకపోగా రొటీన్ సీన్లతో హోరెత్తించారు. రవితేజ్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను పూర్తిస్థాయిలో నిలబెట్టగలిగారు. బీ, సీ సెంటర్లలో మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా చేరగలిగితే రవితేజ ఖాతాలో మరో సక్సెస్ చేరడం ఖాయం.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్:

    • రవితేజ ఎనర్జీ, యాక్టింగ్
    • రాశీఖన్నా, సీరత్ కపూర్ గ్లామర్
    • సినిమాటోగ్రఫీ
    • మ్యూజిక్
    • మైనస్ పాయింట్స్

      • కథ, కథనం
      • ఎడిటింగ్
      • డైరెక్టర్ టేకింగ్
      •  తెర వెనుక, తెర ముందు

        తెర వెనుక, తెర ముందు

        రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దారువాలా, మురళీశర్మ, సత్యం రాజేశ్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, సుహాసిని మణిరత్నం తదితరులు
        స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
        నిర్మాత: నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీమోహన్
        కథ: వక్కంతం వంశీ
        డైలాగ్స్: కేశవ్
        మ్యూజిక్: జామ్8 (ప్రీతమ్ క్రియేటివ్ గ్రూప్)
        సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, చోటా కే నాయుడు
        ఎడిటింగ్: గౌతమ్‌రాజు
        బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
        రిలీజ్ డేట్: ఫిబ్రవరి 2, 2018

    English summary
    Touch Chesi Chudu is a film written by Vakkantham Vamsi and directed by Vikram Sirikonda which marks the latter’s directorial debut in Telugu cinema.It features Ravi Teja, Raashi Khanna and Seerat Kapoor in the lead roles while Freddy Daruwala plays the main antogonist which marks his debut in Telugu cinema. This movie set to release on February 2. In this occassion, Telugu Filmibeat brings exclusive review for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X