Tourist Family Twitter Review: ఫ్యామిలీ టూరిస్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ

దక్షిణాదిలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన, సినీయర్ యాక్టర్ శశికుమార్, పాపులర్ కమెడియన్ యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. నూతన దర్శకుడు అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా మే 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రీమియర్లు చెన్నైలో ఇటీవల ప్రదర్శించారు. ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

కోవిడ్ పాండమిక్ తర్వాత శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో అక్కడి తమిళ ఫ్యామిలీకి కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆ క్రమంలో మెరుగైన భవిష్యత్ కోసం సొంత దేశం నుంచి వలసపోయి శరణార్థులుగా మారుతారు. ఈ ఫ్యామిలీ కష్టాలను ఎమోషనల్‌గా, కామెడీ టచ్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో దాస్‌గా శశికుమార్, వాసంతి దాస్‌గా సిమ్రాన్, దాస్ స్నేహితుడిగా యోగిబాబు తదితరులు నటించారు.

Tourist Family Tamil Movie Twitter Review

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూశాను. కోవిడ్ తర్వాత శ్రీలంకలోని తమిళ కుటుంబానికి ఎదురైన సమస్యలను తెర మీద సజీవంగా చూపించారు. ఓ ఫ్యామిలీ కథకు భావోద్వేగాన్ని చక్కగా చెప్పారు. సిమ్రాన్, శశికుమార్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఈ సినిమాను ఎమోషనల్‌గా మార్చడమే కాకుండా ఆ భారాన్ని వారిద్దరూ మోశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

చెన్నైలో ప్రదర్శించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రీమియర్‌ను చూసే అవకాశం లభించింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురయ్యాను. నవ్వుల్లో మునిగిపోయాను. ఎమోషనల్‌గా ఊగిసలాటకు గురయ్యాను. ఈ సినిమా అద్బుతంగా ఉంది. నేను చాలా ఇష్టపడ్డాను. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కురిపించాలని సినిమా యూనిట్‌కు నా విషెస్ అందజేస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా గురించి చాలా బజ్ ఏర్పడింది. అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా సింపుల్‌గా బాగా వర్కవుట్ అయింది. స్టోరి, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఆకట్టుకొంటాయి. హాస్యం ఈ సినిమాకు బలంగా మారింది. ప్రతీ పాత్ర కామెడీని పంచిన విధానం బాగుంది. మిడిల్ క్లాస్ ఫాదర్‌గా శశికుమార్, తల్లి పాత్రలో సిమ్రాన్ జీవించింది అని ఓ నెటిజన్ సుదీర్ఘమైన రివ్యూను రాశారు.

ఫ్యామిలీ టూరిస్ట్ సినిమా చూసిన తర్వాత ముగింపులో స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం గ్యారెంటీ. డైరెక్టర్ అభిషాన్ జీవింత్ రాసిన కథ, స్క్రీన్ ప్లేకు ప్రశంసలు కురవడం ఖాయం. శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్ నటించిన తీరు అద్బుతంగా ఉంది. ఈ స్క్రిప్ట్ వర్క్ వండర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమా పైసా వసూలు మూవీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


డైరెక్టర్ రాసిన కథ, స్క్రిప్టును డీల్ చేసిన తీరు చూస్తే చాలా మెచ్యురిటీ కనిపించింది. స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉంది. ఈ సంవత్సరం వచ్చిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఫీల్ గుడ్, మనసును ఆకట్టుకొనే డ్రామాతో రూపొందిన ఈ సినిమాను థియేటర్‌లో మిస్ చేసుకోవద్దు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను చూసిన మీడియా ప్రశంసించడంపై హీరోయిన్ సిమ్రాన్ ఓ వీడియోను రిలీజ్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు. మా సినిమాను చూసి ఫ్యాన్స్, ప్రెస్ నుంచి ప్రేమతో కూడిన ప్రశంస వస్తున్నది. ఈ సినిమా మీ ముందుకు వస్తున్నది. బిగ్ స్క్రీన్‌లో ఈ సినిమాను చూడండి అని సిమ్రాన్ చెప్పారు.

More from Filmibeat

Read more about: simran sasikumar Tourist Family
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X