Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. యష్ మాస్ విశ్వరూపం..

Toxic Teaser Review: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యశ్.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే అభిమానుల దృష్టంతా ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచగా.. తాజాగా విడుదలైన టాక్సిక్ టీజర్ (Toxic Teaser) (లేడీస్ ..లేడీస్) వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రమోషన్లు హీరో చుట్టూనే తిరుగుతాయి. కానీ 'టాక్సిక్' టీమ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. సినిమాలో నటిస్తున్న మహిళా పాత్రలను మాత్రమే హైలైట్ చేస్తూ లేడీస్ అండ్ లేడీస్ అంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ ఒక్క వీడియోతోనే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సినిమాలో మహిళా పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతోంది.

Toxic Teaser Review  Yash Unleashes Mass Avatar  Ladies  amp amp  Ladies Glimpse Goes Viral

వార్నింగ్‌తో వీడియో ప్రారంభం..
వీడియో ప్రారంభంలోనే డిస్‌క్లెయిమర్ అందరినీ షాక్ కు గురిచేసింది."పిల్లలు దూరంగా ఉండండి.. తల్లిదండ్రులు మీ పిల్లలను దూరంగా ఉంచండి.. తాతలు, ముత్తాతలు మీ సొంత రిస్క్‌పై మాత్రమే చూడండి"అనే డిస్ క్లైమర్ తో వీడియో ప్రారంభమైంది. ఆ వెంటనే సినిమా డార్క్, బోల్డ్ ప్రపంచాన్ని మేకర్స్ పరిచయం చేశారు.ఇక బ్యాక్ రౌండ్ లో వినిపించే ఓ మహిళ వాయిస్ ఓవర్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. 'ప్రేమ మహిళలను రాక్షసులుగా మారుస్తుంది.. ఆ ప్రేమ వెనుక ఉన్న మోసాన్ని తెలుసుకోవడమంటే.. అది అందమైన భ్రమ" అనే అంటూ కథను పరిచయం చేసినట్టు తెలుస్తోంది.

ఈ వీడియోలో కనిపించిన ప్రతి హీరోయిన్ ప్రత్యేకంగా కనిపించారు. నయనతార బైక్‌పై పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపించగా, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్‌తో పాటు మిస్టీరియస్ లుక్‌లో ఆకట్టుకుంది.ఇక తారా సుతారియా స్టైలిష్, బోల్డ్ అవతార్‌లో కనిపించింది.ఇక కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ మరింత వైలెంట్ గా చేతిలో గన్ పట్టుకుని పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించింది. అలాగే.. హ్యూమా ఖురేషి గ్యాంగ్ లీడర్ తరహా లుక్‌తో అట్రాక్ట్ చేసింది. అయితే వీరిలో అసలు హీరోయిన్ ఎవరు? ఎవరి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? అనేది మాత్రం మేకర్స్ ఇంకా రహస్యంగానే ఉంచారు.

ఇక వీడియో చివర్లో మాత్రమే హీరో యశ్ ఎంట్రీ ఉంది. బార్‌లో ప్రశాంతంగా నిలబడి చేతులు మడుస్తూ "మీరు ఒక్కొక్కరుగా వస్తారా.. లేక అందరూ కలిసే వస్తారా?" అని పవర్ పుల్ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంటనే వచ్చే యాక్షన్ సీన్స్, గ్లాస్‌లు పగిలే విజువల్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ గ్లింప్స్‌లో చాలా బోల్డ్ విజువల్స్ కనిపించాయి. అందుకే వయస్సు పరిమితిపై హెచ్చరిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గీతూ మోహన్ దాస్ తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా డార్క్, రియలిస్టిక్ టోన్‌లో తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

టాక్సిక్' విజువల్స్‌ను చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు దీనిని హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లతో పోలుస్తున్నారు. హై హోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టైలిష్ ఫ్రేమ్స్, లేడీ ఓరియంట్ సీన్స్ కు ప్రాధానత ఇవ్వడం చూస్తుంటే.. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు పూర్తిగా భిన్నంగా ఉన్నట్టు అర్థమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X