Toxic Teaser Review: యష్ టాక్సిక్ టీజర్ వచ్చేసింది.. మోస్ట్‌ వైలెంట్‌.. థియేటర్స్ తగలబడతాయేమో

Toxic Teaser Review: కన్నడ స్టార్ యశ్‌ (Yash) హీరోగా, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ (Geethu Mohandas)దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ (Toxic). తాజాగా విడుదలైన టీజర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌' అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, టీజర్ వాటిని మరింత పెంచేసింది. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ముందే భారీ అంచనాలు నెలకొనగా... తాజాగా రిలీజ్ చేసిన టీజర్ వాటిని డబుల్ చేసింది. టీజర్‌లో యశ్ 'రాయా' పాత్రలో మోస్ట్ వయలెంట్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించి షాక్ ఇచ్చారు. 'విరోధం పెట్టుకొని బతకలేవు... పట్టుదల వదిలేయ్', 'నేను నో చెప్పాను అంటే నో అంతే' లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్ సినిమాపై హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.

Toxic Teaser Review  Yash s Most Violent Avatar Shakes Social Media Ahead of March 19 Release

సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ మొత్తం డార్క్ టోన్, భారీ యాక్షన్, రక్తపాతం, స్టైలిష్ విజువల్స్‌తో నిండిపోయింది. స్లో మోషన్ షాట్స్, ఇంటర్నేషనల్ లెవల్ కలర్ గ్రేడింగ్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసి సినిమాకు ఓ ప్రత్యేక ఐడెంటిటీని ఇచ్చాయి. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారనే విషయం ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. యశ్ లుక్ అయితే 'అరాచకం' అనే మాట సరిపోతుంది. రఫ్ గెటప్, స్టైలిష్ అటిట్యూడ్‌తో ఈసారి పూర్తిగా డిఫరెంట్ జోన్‌లోకి వెళ్లిపోయారని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.

ఈ చిత్రంలో యశ్‌తో పాటు ఐదుగురు స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ ఎలిజెబెత్‌గా, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా, మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మల్టీ స్టార్ కాస్టింగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'టాక్సిక్' కథ 1970ల గోవా డ్రగ్ మాఫియా, అండర్‌వర్ల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు గీతూ మోహన్‌దాస్ స్పెషల్ మేకింగ్ స్టైల్ కలిసి కంటెంట్ పరంగా పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇవ్వబోతున్నట్లు యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను యశ్ స్వయంగా వెంకట్ కె. నారాయణతో కలిసి నిర్మిస్తుండటం మరో విశేషం.

టీజర్ రిలీజ్ అయిన వెంటనే #Yash19 హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారీ హైప్ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే సినిమాలో చూపిస్తున్న మితిమీరిన వయలెన్స్, బోల్డ్ సీన్స్ కారణంగా దీనికి A సర్టిఫికెట్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ... టాక్ పాజిటివ్‌గా వస్తే మాత్రం 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: toxic nayanthara yash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X