Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కార్, వివేక్ రఘువంశీ, రఘు బాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, గాయత్రి తదతరులు
దర్శకత్వం: కమల్ తేజ నార్ల
నిర్మాత: వడ్డే నవీన్
సమర్పణ: వడ్డే జిష్ణు
మ్యూజిక్: కల్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫి: కార్తీక్ సుజాత సాయికుమార్
ఎడిటర్: విజయ్ ముక్తవరపు
లిరిక్స్: భాస్కరభట్ల రవికుమార్
ఫైట్స్: రాబిన్ బాబు, రామ్ సుంకర
ఆర్ట్: భిక్షపతి కందకట్ల
కొరియోగ్రఫి: విజయ్ పోలంకి, దినేష్
కాస్టూమ్ డిజైనర్: శ్రావ్య రెడ్డి
రిలీజ్ డేట్: 2026-06-19

త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీపరుడైన కానిస్టేబుల్. తప్పులు బయటపెట్టినందుకు ట్రాన్స్‌ఫర్లు బహుమతిగా వస్తుంటాయి. అలా 10 సంవత్సరాల్లో త్రిమూర్తులుకు 55 ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతాయి. ఏకంగా సీఎం పదవికి ఎసరుపెట్టేలా కానిస్టేబుల్ త్రిమూర్తులు డ్యూటీ చేస్తాడు. 25 ఏళ్ల క్రితం నాటి సంఘటన త్రిమూర్తులు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. సీఎం వర్గం త్రిమూర్తులను వేటాడుతుంటాయి.

త్రిమూర్తులు ఎందుకు 55 ట్రాన్స్‌ఫర్లు అయ్యాడు? సీఎంను తీవ్ర అశాంతికి గురి చేసిన సంఘటన ఏమిటి? ఎందుకు సీఎం ఆగ్రహానికి గురయ్యాడు? దానికి త్రిమూర్తులు ఎలాంటి జవాబుదారీగా ఉంటాడు? ఓ గ్రామంలోని పోలీస్ స్టేషన్‌లో దొరికిన కంప్లైంట్ ఏమిటి? ఆ ఫిర్యాదు సీఎం కుమారుడు రాజకీయ భవితవ్యాన్ని ముక్కులు చేసింది? సీఎం కుమారుడిపై త్రిమూర్తులు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొన్నాడు. చివరకు సీఎంకు త్రిమూర్తులు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా కథ.

Transfer Trimurthulu Movie Review

నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ కథ చుట్టూ అల్లుకొన్న కోర్టు రూమ్ డ్రామా. అమ్మాయి మానబంగం కేసు, సీఎం పబ్లిక్ స్టంట్స్ లాంటి అంశాలను మేలవించి విభిన్నమైన కథగా చెప్పేందుకు దర్శకుడు కమల్ తేజ ప్రయత్నం చేశాడు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ప్రస్తావించి ఉంటే.. సమకాలీన పరిస్థితులకు తగినట్టుగా సన్నివేశాలను అల్లుకొని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది.

వడ్డే నవీన్ రీ ఎంట్రీ కావడంతో అతడి బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా మాస్, ఎమోషనల్, సెంటిమెంట్స్ అంశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా పాత్రను డిజైన్ చేశారు. అసలు కథలోకి వెళ్లడానికి ఫస్టాఫ్‌లో ఎక్కువ సమయం తీసుకొన్నాడు.. కానీ సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్, కోర్డు రూమ్ డ్రామా అంశాలతో కథను గ్రిప్పింగ్‌గా చప్పడంలో సఫలమయ్యాడు.

చాలా సంవత్సరాల తర్వాత తన వయసుకు తగిన, తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా పాత్రను ఎంచుకొని రీ ఎంట్రీ ఇవ్వడం సానుకూలమైన అంశంగా మారింది. కానిస్టేబుల్ క్యారెక్టర్‌కు తగినట్టుగా బ్యాలెన్స్‌గా పెర్ఫార్మెన్స్ చూపించాడు. సెకండాఫ్‌లో ఆయన నటన చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా భారాన్నంత తన భుజాలపై మోశాడు. ఇక రాశీ సింగ్, శిల్ప తులస్కార్, వివేక్ రఘువంశీ, రఘు బాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, బాబా భాస్కర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు కల్యాణ్ నాయక్ అందించిన మ్యూజిక్ ఓ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. కార్తీక్ సుజాత సాయికుమార్ సినిమాటోగ్రఫి, రాబిన్ బాబు, రామ్ సుంకర ఫైట్స్ పాజిటివ్ అంశాలు. విజయ్ ముక్తవరపు ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్‌ను తగ్గించి ఉంటే సినిమా వేగం పెరిగి ఉండేది. కథ డిమాండ్ మేరకు నిర్మాతగా వడ్డే నవీన్ ఎక్కడా రాజీ పడలేదనే విషయం అవుట్‌పుట్ స్పష్టమైంది. పోలీస్, కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొన్న సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X