Transfer Trimurthulu First Review: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఫస్ట్ రివ్యూ

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ చిత్రంలో రాశీ సింగ్, శిల్ప తులస్కార్, వివేక్ రఘువంశీ, రఘు బాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, గాయత్రి తదతరులు నటించారు. ఈ సినిమాకు కమల్ తేజ నార్ల రచనా సహకారంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు హీరో వడ్డే నవీన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారుడు వడ్డే జిష్ణు సమర్పకుడిగా వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: కల్యాణ్ నాయక్, సినిమాటోగ్రఫి: కార్తీక్ సుజాత సాయికుమార్, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, లిరిక్స్: భాస్కరభట్ల రవికుమార్, ఫైట్స్: రాబిన్ బాబు, రామ్ సుంకర, ఆర్ట్: భిక్షపతి కందకట్ల, కొరియోగ్రఫి: విజయ్ పోలంకి, దినేష్, కాస్టూమ్ డిజైనర్: శ్రావ్య రెడ్డి తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. వడ్డె క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్, రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Transfer Trimurthulu  Review by Censor Board

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా కథ విషయానికి వస్తే.. త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీపరుడైన కానిస్టేబుల్. తప్పులు బయటపెట్టినందుకు ట్రాన్స్‌ఫర్లు బహుమతిగా వస్తుంటాయి. అలా 10 సంవత్సరాల్లో త్రిమూర్తులుకు 55 ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతాయి. ఏకంగా సీఎం పదవికి ఎసరుపెట్టేలా కానిస్టేబుల్ త్రిమూర్తులు డ్యూటీ చేస్తాడు. 25 ఏళ్ల క్రితం నాటి సంఘటన త్రిమూర్తులు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. సీఎం వర్గం త్రిమూర్తులను వేటాడుతుంటాయి. అయితే సీఎంను తీవ్ర అశాంతికి గురి చేసిన సంఘటన ఏమిటి? దానికి త్రిమూర్తులు ఎలాంటి జవాబుదారీగా ఉంటాడు? చివరకు సీఎంకు త్రిమూర్తులు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా కథ.

కానిస్టేబుల్ ఆన్ డ్యూటీలో ఉంటే.. సీఎం కూడా వణకాల్సిందే అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించారు. కొన్ని సన్నివేశాల్లో స్వల్ప మార్పులు చేయాలని సూచనలకు మూవీ టీమ్ సానుకూలంగా స్పందించడంతో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ క్లియరెన్స్ లభించింది. దాంతో విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది.

యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ బేస్‌తో రూపొందిన సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్లు దాటిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసే అవకాశం లభించింది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకొనే సినిమాగా రూపొందిన ఈ చిత్రం నిడివి 2 గంటల 33 నిమిషాలు అంటే.. 153 నిమిషాల రన్ టైమ్‌తో సినిమాను ముగించారనే విషయం సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ద్వారా తెలిసింది.

గతంలో సక్సెస్‌ఫుల్ హీరోగా ట్రాక్ రికార్డు ఉన్న వడ్డే నవీన్ కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ.. తన బాడీ లాంగ్వేజ్, తన వయసుకు తగిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయనను కొత్తగా చూసే అవకాశం ఉంది. అలాగే ఇతర నటీనటుల బ్యాలెన్స్‌డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా మారుతుంది అనే టాక్ వినిపిస్తున్నది. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి ముందస్తుగా చెప్పాలంటే.. రెగ్యులర్ పాయింట్‌తో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం కనిపిస్తున్నది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎలాంటి స్పందనను చూరగొంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X