Tribanadhari Barbarik Movie Review: త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: సత్యరాజ్, వశిష్ట సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన, రాజేంద్రన్ తదితరులు
దర్శకత్వం: మోహన్ శ్రీవత్స
నిర్మాత: విజయ్ పాల్ రెడ్డి
సమర్పణ: మారుతి
మ్యూజిక్: ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్
సినిమాటోగ్రఫి: కుషేందర్ రమేష్ రెడ్డి
ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్
ఆర్ట్: శ్రీనివాస్ పున్నా
స్టంట్స్: రామ్ సుంకర
బ్యానర్: వానర సెల్యూలాయిడ్
రిలీజ్ డేట్: 2025-08-29

శ్యామ్ కతు అలియాస్ బార్బరిక్ (సత్యరాజ్) సైక్రియాటిస్ట్. హైదరాబాద్‌లో మాఫియా మాఫియా దందాను వాకిలి పద్మ (ఉదయభాను) నిర్వహిస్తుంటుంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రామ్ (వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం 30 లక్షలు సంపాదించాలనే వేటలో ఉంటాడు. వాకిలి పద్మ అల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్)తో కలిసి చిల్లర మల్లర దొంగతనాలు, కిడ్నాప్‌లకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో శ్యామ్ మనవరాలు నిధి కిడ్నాప్ గురి అవుతుంది. తన మనవరాలు మిస్పింగ్ అంటూ శ్యామ్ ఫిర్యాదు చేస్తే.. చంద్ర (సత్యం రాజేశ్) అనే కానిస్టేబుల్ దర్యాప్తు మొదలుపెడుతాడు. ఇదే సమయంలో మంత్రి గారి పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసి దేవ్, రామ్ 50 లక్షలు డిమాండ్ చేస్తారు.

Tribanadhari Barbarik Movie Review

నిధిని ఎవరు కిడ్నాప్ చేశారు? నిధి ఆచూకీ గురించి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మంత్రిగారి కుక్క పిల్లను ఎత్తుకొన్న రామ్,దేవ్ 50 లక్షలు సంపాదించారా? రామ్, దేవ్‌కు డ్రగ్ దందాలో ఎలా భాగమయ్యారు? తన మనవరాలి ఆచూకీ కోసం శ్యామ్ ఎలాంటి వ్యూహాలు పన్నారు? చివరకు డబ్బు సంపాదించి రామ్ విదేశానికి వెళ్లాడా? దేవ్ జూదపు అలవాట్లు ఆయనకు ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టింది. నిధి కిడ్నాప్ వ్యవహారానికి ఎలాంటి ముగింపు లభించింది? శ్యామ్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలకు ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్‌కు లింక్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే త్రిబాణధారి బార్బరిక్ సినిమా కథ.

త్రిబాణధారి బార్బరిక్ కథ విషయానికి వస్తే.. పలు రకాల లేయర్లు ఉన్న ఎమోషనల్ జర్నీగా కనిపిస్తుంది. అయితే కథలో సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణ విషయంలో ఇంకా బెటర్‌గా వర్క్ చేయాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్‌ను కథగా విస్తరించడంలోను, సన్నివేశాలను బలంగా చెప్పే విషయం ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందనిపిస్తుంది. అయితే పాత్రలకు ఎంచుకొన్న నటీనటుల విషయంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. సీనియర్ నటుల చేత పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న తీరు చూస్తే ఆయన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. కిడ్నాప్ డ్రామాతో మొదలుపెట్టి.. కథను విస్తరించిన తీరు సినిమాపై ఉన్న ఆయన అభిరుచిని తెలియజెబుతుంది.

ఇక శ్యామ్ పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్‌ను కొత్తగా కనిపించారు. హుందాగా తన పాత్రలో ఒదిగిపోయారు. కీలకమైన, ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన అనుభవాన్ని చూపించి మెప్పించారు. ఇక వాకిలి పద్మ క్యారెక్టర్‌లో ఉదయభాను సర్‌ప్రైజ్, మాస్, టపోరి క్యారెక్టర్‌లో ఎమోషన్స్‌ మాత్రమే కాకుండా యాక్షన్ సీన్లలో మెప్పించింది. ఇప్పటి వరకు విలన్ ఇమేజ్ ఉన్న వశిష్ట ఈ సినిమాలో ఎక్కువ భాగం కథను తన భుజాలపై మోశాడని చెప్పాలి. క్రాంతి కిరణ్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. సత్యం రాజేశ్, డ్రగ్ మాఫియా డాన్‌‌గా మొట్ట రాజేంద్రన్, ఇతరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ అందించిన మ్యూజిక్, కుషేందర్ రమేష్ రెడ్డి చిత్రీకరించిన సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ బాగా వర్కవుట్ అయింది. ఎడిటర్‌గా మార్తాండ్ వెంకటేష్ అనుభవం ఈ సినిమాకు బాగా పనికి వచ్చిందనే విషయం తెర మీద స్పష్టంగా కనిపించింది. ఇంకాస్త నిడివి తగ్గించి ఉంటే.. బెటర్ ఫీల్ ఉండేది. విజయ్ పాల్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి అనుభూతిని కలిగించాలనే ఓ ప్యాషన్‌తో ఈ సినిమాను వానర సెల్యూలాయిడ్ అందించిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

చిన్నారిపై లైంగిక దాడి నేపథ్యంగా సాగే ఎమోషనల్ డ్రామా. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఇంటెన్స్ యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ, స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ.. ఇంకాస్త బెటర్‌గా వర్క్ చేయాల్సి ఉండాల్సిదనిపిస్తుంది. మహాభారతంలోని బార్బరిక్ పాత్ర చుట్టూ అల్లుకొన్న కథను ఎంజాయ్ చేయాలంటే.. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X