Trikala Movie Review: త్రికాల మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, దేవీ ప్రసాద్, రవి వర్మ, సూర్య, రోహిణి, తనికెళ్ల భరణి, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు
కథ, దర్శకత్వం: మణి తెల్లగూటి
నిర్మాతలు: రాధిక-శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
సినిమాటోగ్రఫి: పవన్ చెన్న
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: షాజిత్ హుమాయున్
బ్యానర్: చాగంటి ప్రొడక్షన్ LLP
రిలీజ్ డేట్: 2026-05-28

కొన్ని సంవత్సరాలుగా శాపగ్రస్తులైన రాజ కుటుంబంలో పుట్టిన వైతరణ్ (అజయ్) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. బాల్యంలోనే తల్లి మరణించడంతో సవతి తల్లి (ఆమని) పెంచి పోషిస్తుంటుంది. ఇదిలా ఉండగా, తప్పిపోయిన తన ప్రేయసి నిధి (సాహితి)ని వెతుక్కొంటూ శివ (మాస్టర్ మహేంద్రన్) నగరానికి వచ్చి వైతరణ్‌ గురించి తెలుసుకొంటాడు. వైతరణ్‌ వ్యాధిని నయం చేసేందుకు సైక్రియాటిస్ట్ మాయ (శ్రద్దాదాస్) వస్తుంది. కానీ తన పినతల్లిని హత్య చేసి వైతరణ్ కూడా ఆత్మహత్య చేసుకొంటాడు. కానీ తన పురాతన భవనంలోనే వైతరణ్ ఆత్మ సంచరిస్తుంటుంది.

వైతరణ్‌ను పట్టి పీడిస్తున్న అరుదైన వ్యాధి ఏమిటి? కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన సవతి తల్లిని వైతరణ్ ఎందుకు హత్య చేశాడు? వైతరణ్ కుటుంబానికి ఉన్న శాపం ఏమిటి? తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలు అసురుల చేతిలో పడకుండా ఏం చేశారు? శక్తి ఏథా అనే దైవిక ఆయుధం పవర్ ఏమిటి? సైక్రియాటిస్ట్ మాయకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అదృశ్యమైన నిధి ఆచూకీ శివకు లభించిందా? అసలు త్రికాల వర్మ ఎవరు? అతన్ని మ్లీ ఎందుకు మేల్కోలిపారు? అనే ప్రశ్నలకు సమాధానమే త్రికాల సినిమా కథ.

Trikala Review and Rating

త్రికాల అనే మైథాలాజికల్ డార్క్ థ్రిల్లర్ కోసం దర్శకుడు మణి తెల్లగూటి ఎంచుకొన్న పాయింట్ చాలా క్లిష్టమైనది. అలాంటి పాయింట్‌ను అత్యంత సులభంగా సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా రాసుకొన్న విధానాన్ని అభినందించాలి. ఆయన డిజైన్ చేసుకోన్న పాత్రల కోసం ఎంపిక చేసుకొన్న యాక్టర్లు, వారిని నుంచి పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ను విజువల్‌గా ప్రజెంట్ చేసిన తీరు చూస్తే ఆయన ప్రతిభ, విజన్ ఏమిటో అర్ధమవుతుంది. ఇలాంటి కాంప్లికేటెడ్ స్టోరీని ఓ మనవరాలికి అమ్మమ్మ చెప్పే కథ ద్వారా సినిమాను ప్రారంభించిన తీరు.. ఆ కథలోకి ఆడియెన్స్‌ను బాగా ఎంగేజ్ చేసేందుకు ప్రయత్నించారు. వైతరణ్ చుట్టు కథను నడిపించడం ద్వారా సెకండాఫ్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పే విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గో సంరక్షణ, కాటేరమ్మ ప్రత్యక్షం త్రికాల పరియం ఈ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి.

ఈ సినిమాకు అత్యంత కీలకమైన వైతరణ్ పాత్రలో అజయ్ తన ప్రతిభను అద్బుతంగా చాటుకొన్నారు. ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు. అజయ్, ఆమని పాత్రల మధ్య మానసిక సంఘర్షణ భావోద్వేగా సాగుతుంది. శ్రద్దాదాస్ చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో కనిపించింది. కానీ ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండటం వల్ల పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయింది. మహేంద్రన్, సాహిత తమ పాత్రలకు పూర్తిగాన్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. హర్షవర్దన్ అందించిన పాటలు, హుమాయున్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అంశాలపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. పవన్ చెన్న సినిమాటోగ్రఫి బాగుంది. రాధిక-శ్రీనివాస్, శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చాగంటీ ప్రొడక్షన్ బ్యానర్ ఈ సినిమాను క్వాలిటీతోను కంటెంట్ పరంగాను రిచ్‌గా చూపించింది. 'త్రికాల' రొటీన్ హారర్ సినిమా కాదు. ఇది మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్‌ల మేళవింపు. స్టోరీ, విజువల్స్, BGM, టెక్నికల్ ఎగ్జిక్యూషన్.. ఇవ‌న్నీ క‌లిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కథలో కంటెంట్ పరంగా, సాంకేతికంగా కొన్ని లోపాలు ఉన్నా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మైథాలజీ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

Read more about: shradda das ajay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X