True Lover Review ఈ జనరేషన్ లవ్ స్టోరి.. మీకూ బ్రేకప్ జరిగిందా? ట్రూ లవర్ రివ్యూ!

Rating: 2.75/5

నటీనటులు: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్న రవి, హరీష్ కుమర్, నిఖిల శంకర్ తదితరులు
రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్
నిర్మాతలు: హరీష్, యువరాజ్
మ్యూజిక్: సీన్ రోల్డన్
సినిమాటోగ్రఫి: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: భరత్ విక్రమన్
ప్రొడక్షన్ డిజైన్: రాజ్ కమల్
ఎడిటింగ్: సురేష్ రవి
రిలీజ్ డేట్: 2024-02-10

మిమిక్రీ చేయడంలో టాలెంట్ ప్రదర్శించే అరుణ్ (మణికందన్)ను తొలి చూపులోనే దివ్య (శ్రీ గౌరి ప్రియ) ప్రేమిస్తుంది. ఒకే కాలేజీ విద్యార్థులు కావడంతో కళ్లతో మొదలైన పరిచయం విడదీయలేనంత ప్రేమగా మారుతుంది. కానీ అరుణ్‌లోని కొన్ని లోపాలు, మితిమీరిన ఇష్టాలు దివ్యను తీవ్రంగా ఇబ్బంది గురిచేస్తుంటాయి. ఆరేళ్లుగా సాగిన వారి ప్రేమలో ఎన్నో విరహాలు, ఒడిదుడుకులు, విభేదాలు ఉంటాయి. కానీ ఓ సంఘటన వారిద్దరి లవ్‌ను బ్రేక్ చేస్తుంది.

True Lover Movie Review in Telugu and Rating: Sri Gouri Priya and Manikandans Feel good Love Story

అరుణ్, దివ్య మధ్య ప్రేమ ఎలా మొదలైంది? వారిద్దరి మధ్య రొమాన్స్, విరహం ఎలా కొనసాగింది. అరుణ్ పొసెసివ్‌నెస్ దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది. అరుణ్ అలవాట్లు దివ్యకు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురి చేశాయి? అరుణ్‌కు దివ్యకు మధ్య జరిగిన చిలిపి తగాదాలకు కారణాలు ఏంటి? అరుణ్‌కు దివ్య ఎందుకు బ్రేకప్ చెప్పాలనుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రూ లవర్ (True Lover Review)
సినిమా కథ.

అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ స్టోరీలో సంఘటనలు చాలా కామన్‌గా ఉంటాయి. కానీ నేటితరం లవర్స్‌ మనస్తత్వాలు, రొమాన్స్‌కు అద్దం పట్టేలా దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కట్టిపడేసేలా చేస్తుంది. సీన్లలో ఎమోషన్స్, ఫన్, ఇంటెన్సిటీని దట్టించడం వల్ల కథ, సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. కేవలం ఇద్దరి ప్రేమ కథనే కాకుండా అరుణ్ ఫ్యామిలీ విషయాలు కథకు జెల్ చేసిన విధానం మరింత ఎమోషనల్‌గా మార్చింది. ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్ సాగేలా దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు.

True Lover Movie Review in Telugu and Rating: Sri Gouri Priya and Manikandans Feel good Love Story

ఇక ట్రూ లవర్ సెకండాఫ్ విషయానికి వస్తే.. ఎమోషన్స్, లవ్‌లో ఇద్దరి మధ్య ఉండే పెయిన్‌పై డైరెక్టర్ దృష్టిపెట్టడం మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ ఓ ఎపిసోడ్‌ను మరీ సాగదీయడం, సింగిల్ పాయింట్‌ ఎజెండాతో కథను నడిపించడం వల్ల ఫస్టాఫ్‌లో కనిపించిన జోష్.. కొంత సెకండాఫ్‌లో తగ్గినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో లవ్ స్టోరికి అరుణ్ తల్లిదండ్రుల మధ్య నడిచే కాన్‌ఫ్లిక్ట్‌ను జోడించడం సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.

ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. శ్రీ గౌరి ప్రియ మెచ్యురిటీతో కూడిన ఫెర్ఫార్మెన్స్ చూపించింది. రెండు, మూడు సినిమాల అనుభవం ఉన్న యువ హీరోయిన్ ట్రూ లవర్ సినిమాలో చూపించిన టాలెంట్‌తో ఫుల్లుగా మార్కులు కొట్టేసింది. కళ్లతో చూపించిన అభినయం, రొమాంటిక్ సీన్లలో హవభావాలు, పెయిన్‌పుల్ సీన్లలో క్యారెక్టర్ యాటిట్యూడ్‌ను పక్కాగా డెలీవర్ చేసిందని చెప్పవచ్చు. ఇక మణికందన్ అరుణ్ పాత్రలో నటించాడా? అనే కంటే చాలా నేచురల్‌గా బిహేవ్ చేశాడు. బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక ఈ సినిమాలో మదన్ (కన్న రవి), సుహైల్ (హరీష్), ఇతర అమ్మాయిలు తమ పాత్రలకు న్యాయం చేశారు.

True Lover Movie Review in Telugu and Rating: Sri Gouri Priya and Manikandans Feel good Love Story

ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, డైలాగ్స్ యాడ్ ఆన్ అసెట్‌గా నిలిచాయి. సీన్ రోల్డాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యూత్‌ను టార్గెట్ చేస్తూ రాసిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. తమిళ డబ్బింగ్ సినిమా మాదిరిగా కాకుండా ప్రాపర్ తెలుగు సినిమా ఫీల్‌ను కల్పించేలా ఉండటం మరో ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

ట్రూ లవర్ సినిమా విషయానికి వస్తే.. ఓ యువతి, యువకుడి ప్రేమ కథ మాత్రమే కానేకాదు.. పెయిన్‌ఫుల్ ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్ సినిమాను మరింత భావోద్వేగం మార్చింది. చివర్లో హీరోయిన్‌తో చెప్పించిన డైలాగ్స్‌తో బ్రేకప్‌కు జస్టిఫికేషన్‌ను దర్శకుడు ఇచ్చిన తీరు సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు ఉండటం మైనస్. పక్కా యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. ప్రజెంట్ జనరేషన్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. యూత్‌ తమకు తాము కనెక్ట్ అయ్యే అంశాలు బాగానే ఉన్నాయి. సో.. లెట్స్ వాచ్ ఇన్ థియేటర్. డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X