For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tuck Jagadish Review: కథ రొటీన్ కానీ... నాని ఫెర్ఫార్మెన్స్‌తో ఫీల్‌గుడ్‌గా

  |

  Rating: 2.75/5

  నేచురల్ స్టార్ నాని అంటే ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌కు మినిమమ్ గ్యారెంటి. ఇక దర్శకుడు శివ నిర్వాణ తోడైతే.. పక్కాగా ఎలాంటి సందేహం లేకుండా కుటుంబ కథా చిత్రమే. టీజర్లు, ట్రైలర్లు టక్ జగదీష్‌ను కుటుంబ కథా చిత్రమనే ఫీలింగ్‌ను క్రియేట్ చేశాయి. అయితే థియేటర్లలో వెసులుబాటు లేకపోవడంతో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టక్ జగదీష్‌గా నాని నిరాశ పరిచారా? లేదా ఎలా మెప్పించాడనే విషయంలోకి వెళితే...

  టక్ జగదీష్ కథేంటంటే..

  టక్ జగదీష్ కథేంటంటే..

  భూదేవీపురం అనే గ్రామంలో ఎలాంటి భూ తగాదాలు లేని ఊరుగా చూడాలని కలలు కనే ఆదిశేష్ నాయుడు (నాజర్)కు బోసు బాబు (జగపతి బాబు), జగదీష్ నాయుడు అలియాస్ జగదీ అలియాస్ టక్ జగదీష్ (నాని) అనే కుమారులు ఉంటారు. ఆస్తి, డబ్బు పిచ్చితో బోసుబాబు ఉంటే.. ఉత్తమ విలువలతో నలుగురితో మంచి అనిపించుకొనాలనే లక్ష్యంతో టక్ జగదీష్ ఉంటాడు. ఆదిశేష్ నాయుడు చనిపోతూ ఇద్దరు భార్యల పిల్లలకు సమానంగా
  ఆస్థిలో వాటాలు పంచాలని బోసుబాబుకు చెబుతాడు. కానీ స్వార్ధంతో ఆస్తిని కాజేయాలని బోసుబాబు కుట్ర పన్నుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో టక్ జగదీష్ తన సొంతూరుకు ఎమ్మార్వోగా వస్తాడు.

  టక్ జగదీష్ మూవీలో ట్విస్టులు

  టక్ జగదీష్ మూవీలో ట్విస్టులు

  అయితే టక్ జగదీష్ అని జగదీష్ నాయుడుకి ఎందుకు ఆ పేరు వచ్చింది? తన సొంతూరు భూదేవీపురానికే ఎందుకు ఎమ్మార్వోగా టక్ జగదీష్ వచ్చాడు? స్వార్దపరుడైన తన అన్న బోసుబాబుకు కళ్లు ఎలా తెరిపించాడు. భర్త (తిరువీర్) పెట్టే గృహహింసను భరించలేని తన మేన కోడలు చంద్రమ్మ (ఐశ్వర్యరాజేశ్)ను ఎలా కాపాడాడు? తన ఇద్దరు అక్కలు కుమారక్క (రోహిణి), గంగ భవానీ (దేవదర్శిని)కి ఆస్తిని బోసుబాబు పంచేలా చేశాడు. భూ తగాదాలు లేని ఊరుగా భూదేవీపురాన్ని ఎలా మార్చాడు? గుమ్మడి వరలక్ష్మి (రితూ వర్మ) ఎలా పెళ్లి చేసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే టక్ జగదీష్ సినిమా కథ.

  టక్ జగదీష్ ఎలా సాగిందంటే..

  టక్ జగదీష్ ఎలా సాగిందంటే..

  గ్రామీణ నేపథ్యంతో కూడిన వాతావరణంతో 80వ దశకంలో ఏదో పాత సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్‌తో టక్ జగదీష్‌ మూవీ కథ మొదలవుతుంది. అయితే అసలు కథలోకి వెళ్లడానికి దాదాపు 30 నిమిషాలు పట్టడం సహనానికి పరీక్షలా ఉంటుంది. ఎప్పుడైతే ఆదిశేషు నాయుడు మరణించడం, చంద్రమ్మ పెళ్లి జరగడం లాంటి ట్విస్టులతో ఈ సినిమా ఎమోషనల్‌గా మారుతుంది. ఇక ఎమ్మార్వోగా టక్ జగదీష్ భూదేవీపురంలో అడుగుపెట్టడంతో కథలో జోష్ పెరుగుతుంది. కాకపోతే దర్శకుడు నింపాదిగా, అరటిపండు ఒలిచిపెట్టినట్టు కథ చెప్పడం కాస్త బోర్‌గా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని ఎమోషన్స్ ఫీల్‌గుడ్‌గా మారుస్తాయి. రొమాన్స్ డోస్ తగ్గడం యూత్‌కు కొంత నిరాశగానే అనిపించవచ్చు.

  ఆరంభంలో డౌట్‌గానే మొదలై..

  ఆరంభంలో డౌట్‌గానే మొదలై..

  దర్శకుడు శివ నిర్వాణ ఎంచుకొన్న పాయింట్ చూస్తే ఆరంభంలో కాస్త డౌట్‌గానే అనిపిస్తుంది. కాకపోతే నాని పాత్రను డిజైన్ చేసిన తీరుతో సినిమాను ఆసక్తిగా మార్చడమే కాకుండా ఓ కుటుంబ కథా చిత్రమనే ఫీలింగ్ కల్పించడంలో సక్సెస్ అయ్యాడు. కథ, కథనాలను పక్కాగా రాసుకొన్నాడని చెప్పవచ్చు. కథలో పాత్రలను చాలా ఎమోషనల్‌గా మార్చడం సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. ఎప్పటిలానే ఎమోషన్స్, డ్రామాతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

  నానికి కొత్త రకం పాత్రగా

  నానికి కొత్త రకం పాత్రగా

  టక్ జగదీష్ మూవీ కథ, కథనాలు, పాత్ర నానికి కొత్తరకం అనిచెప్పవచ్చు. నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం సాహసం చేశాడనే చెప్పవచ్చు. ఫ్యామిలీ డ్రామాకు కమర్షియల్ హంగులు జోడించి తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. విభిన్నమైన పాత్రను ఎంచుకొనే నాని.. మరోసారి ఆ ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా చేశాడని చెప్పవచ్చు. మాస్ హీరో అనే ట్యాగ్ కోసం ట్రై చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం తన ఫెర్ఫార్మెన్స్ కారణంగానే టక్ జగదీష్ సినిమాను నిలబెట్టారని చెప్పవచ్చు.

  Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
  రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్

  రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్

  నాని ప్రేయసిగా వరలక్ష్మి పాత్రలో రీతూ వర్మ కనిపించారు. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోవడం వల్ల రీతూ వర్మ ఏమీ చేయలేకపోయింది. సినిమా అంతా ఉత్సవ విగ్రహంలా నాని పక్కన కనిపిస్తుంది. ఇక ఐశ్వర్య రాజేశ్ చంద్రమ్మ పాత్రతో ఫెర్ఫార్మెన్స్ పరంగా ఇరగదీసింది. భర్త వేధింపుల భరించే సాధారణ యువతి పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా గుర్తుండిపోయే పాత్రను చేసింది. తన పాత్రకు ఫుల్ మార్కులు పడేలా అభినయంతో ఆకట్టుకొన్నది.

  జగపతి బాబు, తిరువీర్ ఎలా చేశారంటే..

  జగపతి బాబు, తిరువీర్ ఎలా చేశారంటే..

  బోసుబాబుగా జగపతిబాబు సాఫ్ట్ విలన్‌గా ఆకట్టుకొన్నారు. ఊర్లో మన బాబాయిలను, మామలను నరేష్, రావు రమేష్ గుర్తు తెప్పిస్తారు. రేవతి, దేవదర్శిని చూస్తే మన ఫ్యామిలీలో అక్కలు, అత్తమ్మలు కనిపిస్తారు. ప్రవీణ్ డేనియల్ బాలాజీ, తిరువీర్ తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు.

  సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు ..

  సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు ..


  సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లను అద్భుతంగా షూట్ చేశారు. అలాగే పల్లె అందాలతో ఫ్రేములను పచ్చదనంతో నింపేశాడు. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌ను ఆహ్లాదకరంగా మార్చాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు. కాకపోతే రీరికార్డింగ్ బాగుంది. చాలా సన్నివేశాలు రీరికార్డింగ్ కారణంగా మరింత హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  వినాయక చవితి పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా కలిసి తమ అనుభూతులను నెమరువేసుకొనే విధంగా టక్ జగదీష్‌ను నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది రూపొందించారు. పాత్రల ఎంపిక, మూవీని రిచ్‌గా రూపొందించిన తీరు వారికి సినిమా పట్ల ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌గా టక్ జగదీష్

  ఫైనల్‌గా టక్ జగదీష్


  రొటీన్ కథ, కథనాలు, ఎలాంటి కొత్తదనం లేని సినిమా టక్ జగదీష్. కాకపోతే సింపుల్ కథను భావోద్వేగంగా చెప్పిన తీరు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే మనుషుల్లో ఉండే మట్టి వాసన, ఆ మనసుల్లో ఉండే పరిమళం స్పష్టంగా తెరపైన కనిపిస్తుంది. దాంతో రొటీన్ సినిమా కూడా ఓ మోస్తారుగా మెప్పించే ప్రయత్నం చేసింది. అశ్లీల, అసభ్యతకు తావు లేకుండా నీట్‌గా ఈ సినిమా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే.. ఇంటిల్లిపాది హ్యాపీగా పండుగతోపాటు సినిమాను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతి బాబు, డేనియల్ బాలాజీ తిరువీర్, నరేష్, రావు రమేష్, ప్రవీణ్, దేవదర్శిని, రోహిణి, పార్వతి తదితరులు
  కథ, దర్శకత్వం: శివ నిర్వాణ
  నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
  సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ల
  ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
  మ్యూజిక్: ఎస్ థమన్ (పాటలు), గోపి సుందర్ (రీరికార్డింగ్)
  బ్యానర్: షైన్ స్క్రీన్స్
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్ డేట్: 2021-09-10

  English summary
  Nani's latest movie is tuck Jagadish. Directed by Shiva Nirvana. Produced by Sahu, Hareesh. This movie released on Amazon Prime Video on September 10th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X