twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యు టర్న్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: సమంత అక్కినేని, భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, రవి ప్రకాశ్
    Director: పవన్ కుమార్

    పెళ్లి తర్వాత సమంత అక్కినేని కెరీర్ జూమ్ అంటూ దూసుకెళ్తున్నది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్ తర్వాత సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యూ టర్న్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం సమంతకు మరో హిట్టును అందించిందా? నటనతో సమంత మరోసారి మెప్పించిదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథను, ఓవరాల్‌గా సినిమాను సమీక్షించాల్సిందే.

    యు టర్న్ సినిమా కథ

    యు టర్న్ సినిమా కథ

    రచన ఓ ఆంగ్ల దినపత్రికలో పనిచేసే ట్రైనీ రిపోర్టర్. అదే ఆఫీస్‌లో పనిచేసే ఆదిత్య (రాహుల్ రవీంద్రన్), రచనకు ఒకరంటే మరొకరి ఇష్టం. ఈ క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను తొలగించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా చనిపోతుంటారు. ఆ కోణంలో పరిశోధన చేస్తున్న క్రమంలో రచన ఓ మరణం కేసులో అడ్డంగా ఇరుక్కుపోతుది. దాంతో సాఫీగా సాగిపోతున్న జీవితం పోలీసుల మధ్య నలిగిపోతుంది. ఈ వ్యవహారంలో అండగా నిలిచిన నాయక్ (ఆది పినిశెట్టి)కు సస్పెండ్ అవుతాడు.

    యు టర్న్ సినిమాలో ట్విస్టులు

    యు టర్న్ సినిమాలో ట్విస్టులు

    రోడ్డుపై డివైడర్‌ను తొలగించిన వారు చనిపోవడం వెనుక మిస్టరీ ఏమిటీ? తనపై పడిన నేరారోపణలను నుంచి రచన ఎలా బయపడింది. నాయక్‌ ఎందుకు సస్పెండ్ అయ్యాడు. ఈ చిత్రంలో మాయ (భూమిక) పాత్ర ఏమిటి? దాదాపు 20 మరణాలకు కారణమేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే యు టర్న్ సినిమా కథ.

     యు టర్న్ ఫస్టాఫ్

    యు టర్న్ ఫస్టాఫ్

    పెళ్లి అంటే చిరాకు పడే రచనను వివాహం చేసుకొమని పట్టుబట్టే తల్లి ఎపిసోడ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. కానీ అసలు కథలోకి టేకాఫ్ కావడం సినిమా ఎంగేజింగ్‌గా సాగిపోతుంది. కళ్ల ముందే రెండు మరణాలు సంభవించడం, ఆ కేసులో రచన ఇరుక్కుపోవడం లాంటి అంశాలు ఆడియెన్స్‌కు ఆసక్తిరేపుతాయి. కేసు దర్యాప్తులో పోలీసుల తీరు, ఇతర అంశాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంటుంది. ఎలాంటి హంగామా లేకుండా ఓ ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ పడుతుంది.

     యు టర్న్ సెకండాఫ్

    యు టర్న్ సెకండాఫ్

    ఇక సెకండాఫ్‌లో బ్రిడ్జిపై యూటర్న్ తీసుకొనే వారికి ఏం జరుగబోతుంది? భూమిక చనిపోవడానికి కారణం ఏమిటి? అనే అంశాలు సినిమాను ముందుకు తీసుకెళ్లుంటాయి. చివర్లలో హృదయాన్ని ద్రవించే విధంగా ఓ పాయింట్ చూపించడం ఈ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది. కాకపోతే సెకండాఫ్‌లో ఫీల్‌గుడ్ కథపై కాకుండా సమంతపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో తన పాత్రకు సమంత చెప్పిన డబ్బింగ్ కొన్ని చోట్ల చిరాకు పెడుతుంది. దాంతో కథ, కథనాలపై నుంచి దృష్టి సారించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది.

    ప్రతికూల అంశాలు

    ప్రతికూల అంశాలు

    యూటర్న్ సినిమాలో కొన్ని సీన్లు కన్విన్స్‌గా అనిపించవు. కారణం చెప్పకుండా ఓ రిపోర్టర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అతిశయోక్తిగా అనిపిస్తాయి. అంతేకాకుండా ఓ మహిళను రాత్రంతా ఇంటరాగేట్ చేయడం కొంచెం అతిగానే అనిపిస్తుంది. యాక్సిడెంట్ అనే ఎమోషన్ పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం, సెకండాఫ్‌లో భావోద్వేగాన్ని పండించలేకపోవడం ఈ సినిమాకు ప్రతికూలమని చెప్పవచ్చు. కన్నడలో అత్యంత సహజంగా నటించిన శ్రద్దా శ్రీనాథ్ రేంజ్‌లో సమంత తన పాత్రను ఎలివేట్ చేయలేకపోయారనే చెప్పవచ్చు.

    పవన్ కుమార్ టేకింగ్

    పవన్ కుమార్ టేకింగ్

    కన్నడలో పవన్ కుమార్ రూపొందించిన యు టర్న్ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. కథను రాసుకొన్న తీరు, కథనంతో సినీ విమర్శకులను మెప్పించాడు. అదే కథను తెలుగులో తీయడంలో కొంత తడబాటు కనిపించింది. కన్నడలో సహజంగా కనిపిస్తే.. తెలుగులో కమర్షియల్ విలువల కోసం పాకులాడినట్టు కనిపిస్తుంది. కన్నడ వెర్షన్‌లో ఉండే ఫీలింగ్‌ను తెలుగులో చూపించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. కన్నడ చిత్రం చూడని ప్రేక్షకులకు పవన్ కుమార్ టేకింగ్ అద్భుతంగా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు.

    సమంత అక్కినేని నటన

    సమంత అక్కినేని నటన

    యు టర్న్ చిత్రాన్ని రీమేక్‌గా ఎంచుకొని తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయంలో సమంతను అభినందించాల్సిందే. ఈ సినిమా తొలిభాగంలో సమంత ఫెర్ఫార్మెన్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ నుంచి సమంత యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు సమంత డబ్బింగ్ చెప్పుకోవాలని తీసుకొన్న నిర్ణయం చాలా దారుణం. కొన్నిసార్లు డబ్బింగ్ నాన్ సింక్‌లో కనిపిస్తుంది. డైలాగ్స్ క్లియర్‌గా వినిపించవు. చిన్మయి వాయిస్‌కు అలవాటు పడటం వల్ల అలా ఫీల్ కలిగి ఉండవచ్చేమో. కానీ చిన్మయి డబ్బింగ్ చెప్పి ఉంటే రచన పాత్ర మరింత ఎలివేట్ అయ్యేది.

    ఆకట్టుకొన్న ఆది పినిశెట్టి

    ఆకట్టుకొన్న ఆది పినిశెట్టి

    సమంత తర్వాత ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పోషించిన నాయక్ పాత్ర ఆకట్టుకొంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఆది బాడీలాంగ్వేజ్, ఫిజిక్, లుక్ బాగుంటాయి. నాయక్ పాత్రలో ఆది బిహేవ్ చేసిన తీరు సూపర్‌గా కనిపిస్తుంది. ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని పోలీస్ జీప్‌పై పడిన సీన్‌, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎపిసోడ్‌లో ఆది నటన మెప్పిస్తుంది.

    రాహుల్ రవీంద్రన్ గురించి

    రాహుల్ రవీంద్రన్ గురించి

    సమంత బాయ్‌ఫ్రెండ్‌ అదిత్యగా రాహుల్ రవీంద్రన్ నటించాడు. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. రాహుల్ మంచి ఫెర్ఫార్మర్ అయినప్పటికీ.. ఈ సినిమాలో డెప్త్ లేకపోవడం ఆయన పాత్ర అంతగా గుర్తుంచుకొనేలా ఉండదు. కేవలం ప్యాడింగ్ ఆర్టిస్టు మాదిరిగానే మిగిలిపోయాడు.

    పూర్ణచంద్ర తేజ‌స్వీ మ్యూజిక్

    పూర్ణచంద్ర తేజ‌స్వీ మ్యూజిక్

    థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన రేంజ్‌లో సంగీతాన్ని సమకూర్చడంలో పూర్ణచంద్ర తేజ‌స్వీ సక్సెస్ అయ్యాడు. పాటలు లేకపోవడం కొంత నిరాశే అయినప్పటికీ.. కీలక సన్నివేశాల్లో రీరికార్డింగ్‌తో అదరగొట్టేశాడు. సెకండాఫ్‌లో రీరికార్డింగ్ ద్వారా కొన్ని సీన్లను మరోస్థాయికి చేర్చాడని చెప్పవచ్చు. పోలీస్ జీప్‌పై శవం పడిన సీన్‌కు ఇచ్చిన ఎఫెక్ట్ ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

    సినిమాటోగ్రఫి

    సినిమాటోగ్రఫి

    యు టర్న్ సినిమాకు మరో అదనపు ఆకర్షణ సినిమాటోగ్రఫి. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో తన కెమెరా పనితనంతో ఆకట్టుకొన్న నిఖేత్ బొమ్మిరెడ్డి మరోసారి తన సత్తాను నిరూపించుకొన్నాడు. కథకు తగినట్టుగా సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు ఈ సినిమాను రూపొందించారు. సాంకేతిక నిపుణుల, నటీనటుల ఎంపిక బాగుంది. సినిమాను కమర్షియల్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఫలితాన్ని సాధించారు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సమంత అక్కినేని నటనను అభిమానించే ప్రేక్షకులకు, థ్రిల్లర్, హరర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే విధంగా యు టర్న్ ఉంటుంది. భావోద్వేగానికి గురిచేసే ఈ సినిమాకు ప్రాణం. క్లైమాక్స్‌లో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కదిలిస్తాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరించడంపై ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ఏంటో తెలుస్తుంది.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    సమంత అక్కినేని, ఆది పినిశెట్టి ఫెర్ఫార్మెన్స్
    సినిమాటోగ్రఫీ
    రిరీకార్డింగ్

    మైనస్ పాయింట్స్
    డబ్బింగ్ వర్క్
    డైలాగ్స్ పార్ట్
    ఎమోషనల్‌, ఫీల్ కలిగించలేకపోవడం

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: స‌మంత‌ అక్కినేని, రాహుల్ రవీంద్రన్‌, ఆది పినిశెట్టి, భూమిక‌ చావ్లా, న‌రేన్‌ తదితరులు
    రచన, దర్శకత్వం : ప‌వ‌న్ కుమార్‌
    సంగీతం : పూర్ణచంద్ర తేజ‌స్వీ
    సినిమాటోగ్రఫి: నిఖేత్ బొమ్మిరెడ్డి
    ఎడిటింగ్: సురేష్ ఆర్ముగం
    నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు

    English summary
    After Their marriage, Samantha Akkineni and Naga Chaitanya Akkineni will have a face-off this week at the box office. While Samantha will be seen in her film U Turn, a Tamil-Telugu bilingual, Chaitanya's Shailaja Reddy Alludu is also releasing on the same day - September 13. On the occassion, Telugu Filmibeat brings exclusive Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X