twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయభానుకు మళ్లీ ఛాన్సిస్తే ఒట్టు! (మధుమతి మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.0/5
    హైదరాబాద్: తెలుగు టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఉదయభాను తనదైన గ్లామర్, చలాకీతనం, టాలెంటుతో ఆ రంగంలో టాప్ రేంజికి ఎదిగింది. తన టాలెంటను బుల్లితెరకు మాత్రమే పరిమితం చేయకుండా....అప్పుడప్పుడు వెండితెరపై కూడా ప్రదర్శిస్తూ వచ్చింది. రెండు మూడు చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. అయితే ఆమె తొలిసారిగా హీరోయిన్‌గా నటించిన చిత్రం 'మధుమతి'. తొలి చిత్రంలోనే ఉదయభాను వేశ్య పాత్రలో నటించడం కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ఎన్నో ఆశలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.

    కథ విషయానికొస్తే...పెళ్లంటే అసలు ఇష్టం లేని కార్తీక్ (విష్ణు ప్రియన్) ఇంట్లో వాళ్లు ఖాయం చేసిన బంధువుల సంబంధం నుంచి తప్పించుకోవడానికి తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నానని అబద్దం చెబుతాడు. భార్యను తీసుకురమ్మని కార్తీక బామ్మ(తెలంగాణ శకుంతల) బలవంతం పెట్టడంతో....ఏం చేయాలో తోచక వేశ్య అయిన మధుమతి(ఉదయభాను)కి డబ్బుఇచ్చి కొంతకాలం తన భార్యగా నటించమని కోరతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తర్వాతి కథ.

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...ఉదయభాను ఫర్వాలేదనిపించింది. గ్లామర్‌గా కనిపించింది. అయితే తన పాత్రకు పూర్థి స్థాయిలో న్యాయం చేయలేక పోయిందని చెప్పక తప్పదు. విష్ణు ప్రియన్ తో పాటు మిగతా నటీనటులు కూడా ఆకట్టుకోలేక పోయారు. సెకండ్ హీరోయిన్ దీక్షాపంథ్ పాత్ర ఉండి లేనట్లే. మధ్య మధ్యలో వేణు, శ్రీను తదితరులు చేసిన కామెడీ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు.

    ఇక సినిమాకు ప్రధానమైన కథ రొటీగా ఉండటం, ఇదివరకు వచ్చిన సినిమా చూసిన ఫీలింగ్ కలగడం పెద్ద మైనస్ పాయింట్. కనీసం స్క్రీన్ ప్లేతో కూడా దర్శకుడు మేనేజ్ చేయలేక పోయాడు. ఇలాంటి సినిమాలకు డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉండాలి. కానీ అలాంటి డైలాగులు దర్శకుడు రాబట్టుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. టోటల్‌గా ప్రతి విభాగంలోనూ దర్శకుడి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.

    సినిమా ముగింపు కూడా ఆకట్టుకోక పోవడంతో పాటు... ప్రేక్షకులను నిరాశ పరిచే విధంగా ఉంది. కాన్సెప్టు కూడా లేదు. ఇలా ప్రతి విషయంలోనూ నిరాశ పరుస్తూ సాగిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్షిస్తూ తలబాదుకునేలా చేస్తోంది. అయితే ఈ చిత్ర నటి ఉదయభాను సినిమా విడుదల రోజు సినిమాలో తన పాత్రను అశ్లీలంగా చూపారంటూ వివాదానికి తెరలేపింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఓ వైపు సినిమాపై తీవ్రమైన నెగెటివ్ టాక్, సినిమా విడుదలకు ముందే ఉదయభాను వివాదానికి తెరలేపడం లాంటి పరిణామాలు పరిశీలిస్తే..... ఇకపై ఆమెను హీరోయిన్‌గా పెట్టి ఇక ఏ పొడ్యూసరూ సినిమా తీయడేమో? ఎందుకంటే సినిమా పరిశ్రమలో టాలెంటు కంటే విజయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. కాదంటారా?

    English summary
    Madhumati is a 2013 Telugu film written and directed by Raaj Shreedhar, produced By Kadiyam Ramesh, K.Ranishreedhar. Udaya Bhanu is acting in a role of sex worker in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X