twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఫస్ట్ టాక్.. సత్యదేవ్ ఫెర్ఫార్మెన్స్‌తో

    |

    ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో తెరకెక్కించడం సులభమే. కానీ అందులో ఉన్న సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయించడం కష్టమే. అందుకే కల్ట్ క్లాసిక్స్‌గా జనాలను మెప్పించిన చిత్రాలను రీమేక్ చేయడానికి కొందరు జంకుతారు. కానీ కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంటక్ మహా మాత్రం దాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. మలయాళి చిత్రం 'మహేషింతే ప్రతీకారమ్'ను తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యగా రీమేక్ చేశాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి రివ్యూ మరి కాసేట్లలో వస్తుంది. అంత వరకు ఈ సినిమాపై జనాల అభిప్రాయం, ట్విట్టర్‌లో కొనసాగుతున్న చర్చ ఎలా ఉందో ఓసారి చూద్దాం.

    ప్రశాంతమైన వాతావరణం..

    ప్రశాంతమైన వాతావరణం..

    ఒరిజినల్ సినిమాలో ఉన్న ప్రశాంతతను తెలుగులోనూ కంటిన్యూ చేసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. అమాయకత్వం, ప్రేమ, అప్యాయతలు, కలుపుగోలుదనం వీటన్నంటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడని వెంకట్ మహాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

     సున్నితమైన అంశాలు..

    సున్నితమైన అంశాలు..

    ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడిపేవారు జీవితంలో ఓ సంఘటన ఎలాంటి మలుపులకు కారణమైంది. ఆ ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వ్యక్తి చేసిన పనులు ఏంటి? జీవితంలో ప్రేమ ఎలాంటి మార్పులను తీసుకొస్తుందనే సున్నిత అంశాలు ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.

    సత్య దేవ్ విశ్వరూపం..

    సత్య దేవ్ విశ్వరూపం..

    ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే దూరిపోగల సత్తా ఉన్న నటుడు సత్యదేవ్. అలాంటి సత్యదేవ్.. ఓ పల్లెటూరిలో అమాయకుడైన పాత్రను ఇరగ్గొట్టేశాడని తెలుస్తోంది. చిన్న ఫోటోగ్రఫర్, వేరే వ్యాపకాలేవీ లేని వాడు.. తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లేవాడి జీవితంలో ఎదురైన ఓ ఘటన అతన్ని ఎలా మార్చేశాయ్.. ప్రతీకారేచ్చలో అతను ఏం చేశాడన్నది కీలకంగా మారుతుందట. సత్యదేవ్ ఈ చిత్రంలో నట విశ్వరూపాన్ని చూపించాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    Recommended Video

    కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
     మెప్పించిన చిత్రం..

    మెప్పించిన చిత్రం..

    ఓటీటీలో వరుసగా చిత్రాలు విడుదలవుతున్న తరుణంలో.. ఇలాంటి ఎమోషన్లతో కూడుకున్న చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. డిజిటట్ ఫ్లాట్‌ఫామ్‌కు ఇలాంటి కంటెంట్ వర్కౌట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    English summary
    Uma Maheswara Ugra Roopasya also referred to as UMUR, is a 2020 Indian Telugu-language comedy-drama film directed by Venkatesh Maha and starring Satyadev Kancharana and newcomer Hari Chandana. The film is a remake of the Malayalam film Maheshinte Prathikaaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X