Umair Sandhu Review: దేవర టెర్రిఫిక్. ఎన్టీఆర్, జాన్వీపై క్రిటిక్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ దేవర. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మిస్తున్న చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్స్‌తో భారీ హంగామా మొదలైంది. ఈ క్రమంలో పాపులర్ క్రిటిక్ తన రివ్యూలో ఏం చెప్పారనే విషయాన్ని పరిశీలిద్దాం..

ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, అలాగే సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 160 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు సమాచారం. ఇక ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ 165 కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Umair Sandhu Review on Devara  Jr NTR is Terrific  Janhvi Kapoor decorum piece

అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్‌కు మస్తుగా కిక్కెక్కించింది. దాంతో ఈ సినిమా ప్రీ సెల్స్, అడ్వాన్స్ బుకింగ్ అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధూ తన రివ్యూను పోస్టు చేశారు. ఆయన చేసిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

దేవర సినిమాను దుబాయ్ సెన్సారింగ్ సమయంలో చూశాను. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊహకు అందని విధంగా పెర్ఫార్మ్ చేశాడు. కనురెప్ప వేయని విధంగా సినిమాలో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. దేవరకు కావాల్సిన పవర్‌ను ఆయన అందించించాడు అని ఉమేర్ సంధూ తెలిపారు.

Umair Sandhu Review on Devara  Jr NTR is Terrific  Janhvi Kapoor decorum piece

ఇక ఈ మూవీలో విలన్‌గా నటించిన సైఫ్ ఆలీ ఖాన్‌ను కూడా ఆకాశానికి ఎత్తేశాడు. సైఫ్ నటన ఫెంటాస్టిక్. ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ మూమెంట్. సెకండాఫ్‌లో ఎన్టీఆర్, సైఫ్ మధ్య సీన్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మ్యూజిక్ ఓకే అనిపించేలా ఉంది అని ఉమేర్ తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశారు.

జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఈ మూవీలో కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితమైంది. పాటలు ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఓవరాల్‌గా ఇది టెర్రిఫిక్ ఎంటర్‌టైనర్. కేవలం ఇది బిగ్ స్క్రీన్‌పై మాత్రమే చూడాల్సిన సినిమా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. డోంట్ మిస్ ఇట్ అంటూ ఉమేర్ ఇన్స్‌టా స్టోరీలో తెలిపారు.

More from Filmibeat

Read more about: devara jr ntr janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X