Jaat Movie First Review: జాట్ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాలీవుడ్‌లో గోపిచంద్ మలినేని హిట్టు కొట్టాడా?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం జాట్. యాంగ్రీ స్టార్, బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని తొలిసారి బాలీవుడ్‌కు పరిచయమవుతూ రూపొందించిన చిత్రమిది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, ఉమేశ్ కుమార్ భన్సల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను దుబాయ్‌కి చెందిన క్రిటిక్ వెల్లడించారు. ఆ రివ్యూ వివరాల్లోకి వెళితే..
హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో సన్నీడియోల్‌తోపాటు రెజీనా కసండ్రా, సయామీ ఖేర్, రమ్యకృష్ణన్, జగపతి బాబు, బబ్లూ పృథ్వీరాజ్, జరీనా వాహెబ్, ఉపేంద్ర లిమియే,అజయ్ ఘోష్, ఆయేషా ఖాన్, దయానంద్ రెడ్డి, ఊర్వశీ రౌటేలా అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.

గదర్ 2 బ్లాక్ బస్టర్ విజయం సన్నీడియోల్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ అంచనాలు ఏ మాత్రం తగ్గుకుండా భారీ బడ్జెట్, అత్యంత ప్రతిభావంతులైన టెక్నిషియన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించడం, అలాగే భారీగా ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమా బడ్జెట్‌ను సుమారుగా 100 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు.
సన్నీడియోల్ నటించిన జాట్ సినిమాను దుబాయ్‌లోని సెన్సార్ బోర్డు షోలో చూశాను. దక్షిణాది, ఉత్తరాది కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా పైసా వసూల్. సింగిల్ స్క్రీన్‌లో దుమ్మురేపే మూవీ కాబోతున్నది. సింగిల్ స్క్రీన్ ఆడియెన్స్‌కు ఈ మూవీ బాగా కనెక్ట్ కాబోతుంది. సన్నీడియోల్ సెక్సీగా కనిపించబోతున్నాడు అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు.
గదర్ 2 సినిమా తర్వాత సన్నీడియోల్ హాట్ కేక్ అయ్యాడు. పవర్ బ్యాంగ్‌తో సినిమా ఇండస్ట్రీకి తిరిగి వచ్చాడు. ఈ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల మనసులను దోచుకొంటాడు. కథ, స్క్రీన్ ప్లే యావరేజ్‌గా ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా గుడ్ టైంపాస్ మాస్ ఫిలిం అని చెప్పవచ్చు అని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కొద్దికాలం విరామం తర్వాత గదర్ 2 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సన్నీడియోల్ భారీ విజయాన్ని అందుకొన్నాడు. ఈ చిత్రం సుమారుగా 700 కోట్ల రూపాయల గ్రాస్, 525 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి విజయం తర్వాత జాట్ చిత్రం వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా గదర్ 2 రికార్డులను తిరగరాస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











