Kanguva First Review: కంగువ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ (3.5/5).. సూర్య, బాబీ డియోల్ టెర్రిఫిక్!
తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన పిరియాడిక్ ఫిల్మ్ కంగువ. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందించాయి. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ కనీవినీ ఎరుగని రీతిలో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లతు దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఓ సినీ క్రిటిక్ ఫస్ట్ రివ్యూను పోస్టు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
కంగువ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా చేపట్టడంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ మూవీ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ధీర ధీర కదన విహార..ధీర పాట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై క్రేజ్‌ను రెండింతలు చేసింది. కంగువ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఈ రిలీజ్ ట్రైలర్ చేసింది.

ఇక కంగువ సినిమా విషయానికి వస్తే.. 1000 ఏల్ల కిందట 5 తెగల మధ్య సాగే పోరాటం బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కింది. ఓటమి ఎరుగని ధీరుడు కంగువ ఓ వైపు.. నేటి తరం యువకుడిగా సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఆ సమయంలో కంగువ ఇచ్చిన మాట ఏమిటి? కంగువాను ఎవరు మోసం చేశారు? కంగువానే పునర్జన్మ ఎత్తాడా? అతడు ఎవరి కోసం పోరాటం చేశాడు. ఎవరి అత్మగౌరవం కోసం ప్రాణాలకు తెగించాడు? అతడి ప్రామిస్‌ను నేటి తరం యువకుడు ఎలా నిలబెట్టాడనే ఈ సినిమా కథ అనేది ప్రచారంలో ఉంది.
అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దుబాయ్‌కి చెందిన స్వయం ప్రకటిత క్రిటిక్ ఉమేర్ సంధూ తన రివ్యూను పోస్ట్ చేశాడు. తాను దుబాయ్ సెన్సార్ బోర్డు స్క్రీనింగ్ సమయంలో సినిమా చూశాను. మూవీ అద్బుతంగా ఉందంటూ ట్విట్ చేశాడు. తన రివ్యూలో సూర్య పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు గుప్పించారు.

ఓవరాల్‌గా కంగువ మూవీ గురించి చెప్పాలంటే.. ఫస్టాఫ్ కొంత స్టోగా ఉంటుంది. కానీ సెకండాఫ్ విధ్వంసమే. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత గర్వంగా ఫీలవుతారు. ఓ తమిళ దర్శకుడు గొప్పగా కల కనడమే కాకుండా దానిని సాకారం చేసుకొన్నాడు. ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా. సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ హిట్ అని అంటారు. కానీ భావితరాలు ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ అని చెప్పుకొంటారు అని ఉమేర్ సంధూ అన్నాడు.
కంగువ చిత్రంలో సూర్య నటన అద్బుతంగా ఉంటుంది.నటనతో ప్రతీ ఒక్కరి మనసులను దోచుకొంటాడు. బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్. దిశా పటానీ శృంగారం, రొమాన్స్ సన్నివేశాల్లో అదరగొట్టింది. దీపావళీ సినిమాలను వదిలేసి ఈ సినిమాను చూడండి. మంచి అనుభూతిని పంచుతుంది అని ఉమేర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











