Jigra First Review: జిగ్రా మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆలియా భట్ హిట్టు కొట్టిందా?

దేశ సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటి వరకు ఆమె ఎన్నో చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకొన్నారు. టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అలాగే ఇటీవల RRR మూవీతో తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె నటించిన జిగ్రా సినిమా అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై ఉమేర్ సంధూ రివ్యూ ఎలా వెల్లడించారంటే..

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాయాకామ్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన చిత్రం జిగ్రా. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, యువ హీరో వేదాంగ్ రైనా, దక్షిణాది నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు. డ్రగ్స్ వాడకం కథాంశంగా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆలియా భట్, కరణ్ జోహర్, అపూర్వ మెహత, షాహీన్ భట్, సోమెశ్ మిశ్రా తదితరులు నిర్మించారు.

Umair Sandhu s Review on Alia Bhatt s Jigra Movie

దసరా కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ద్వారా తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు కనిపిస్తున్నది.

జిగ్రా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ షాకింగ్ కామెంట్స్ ఇచ్చారు. ఈ సినిమా కేవలం క్లాస్ ఆడియెన్స్ కోసమే అంటూ కామెంట్ పెట్టారు. అయితే కథ బలహీనంగా ఉంది. హాలీవుడ్ తరహా యాక్షన్ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు.

Umair Sandhu s Review on Alia Bhatt s Jigra Movie

జిగ్రా చిత్రాన్ని ఓవర్సీస్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఈ సినిమా మాస్ ఏరియాలో వర్క్ కాదు. మాస్ ప్రేక్షకులకు నచ్చదు. ఆలియా కెరీర్‌లో వీకెస్ట్, బోరింగ్ సినిమా. ఈ సినిమాలో ఓవరాక్షన్ ఎక్కువ. కథ, కథనంలో వేగం లేదు అంటూ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం నీవు చెప్పేదంతా తప్పే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఉమేర్ సంధూ ఇచ్చిన రివ్యూలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆయన చెప్పిన విషయాలన్నీ బూతులుగా మారాయి. పాపులర్ సినిమాలను తొక్కేసే విధంగా ఆయన పెట్టిన పోస్టులు తప్పని ప్రేక్షకుల తేల్చారు. అయితే ఆలియా భట్ మూవీ ఇలాంటి రివ్యూలను తప్పని నిరూపిస్తుందా? లేదా అనేది కొన్ని గంట్లలోనే తేలుతుంది. సినిమా లవర్స్ థియేటర్‌కు వెళ్లి మీరు కామెంట్ చేయండి..

More from Filmibeat

Read more about: alia bhatt jigra umair sandhu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X