Good Bad Ugly First Review: గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు మూవీ ఫస్ట్ రివ్యూ.. అజిత్ మూవీ హిట్టా? ఫట్టా?
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళ దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్ జంటగా నటించారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో దుబాయ్ క్రిటిక్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
మైత్రీ మూవీ మేకర్స్ తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిర్మించిన తొలి చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్ స్లే, యోగిబాబు, సిమ్రాన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫి, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా యాక్షన్ కామెడీగా రూపొందింది. ఈ సినిమా షూటింగును భారీగా హైదరాబాద్లో ప్రారంభించారు. అజిత్ కెరీర్‌లో 63వ ఈ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను స్పెయిన్‌లో భారీగా నిర్మించారు. భారీ తారాగణం, హై ఎండ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాను సుమారుగా 250 నుంచి 270 కోట్ల రూపాయలతో రూపొందించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఓవర్సీస్‌కు సంబంధించిన సెన్సార్ పనులు దుబాయ్‌లో పూర్తయ్యాయి. ఈ సినిమా దుబాయ్ సెన్సార్ సందర్భంగా తాను చూసినట్టు అక్కడి క్రిటిక్ ఉమేర్ సంధూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లోను, ఇన్స్‌టాగ్రామ్ స్టోరీగా ఈ సినిమా రివ్యూను పోస్టు చేశాడు. అయితే ఈ సినిమాపై ఇచ్చిన రివ్యూతో అజిత్ ఫ్యాన్స్ సంబరంలో మునిగిపోయారు.
ఉమేర్ సంధూ తన రివ్యూను ఇన్స్‌టాగ్రామ్ స్టోరీగా వెల్లడిస్తూ.. అజిత్ కుమార్ హ్యాట్సాఫ్. మీరు ఎప్పటికప్పుడు అడ్డంకులను ఎదురించి క్లాసీ యాక్షన్ థ్రిల్లర్ అందిస్తావు. గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా క్రేజీ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరు ఊహకు అందని విధంగా ఫెర్ఫార్మెన్స్ చేశారు అని తెలిపారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ విషయానికి వస్తే.. అజిత్ కుమార్ వన్ మ్యాన్ షో. ఈ సినిమాకు క్లైమాక్స్ అదనపు ఆకర్షణ. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. ఈ సినిమా బీజీఎం మైండ్ బ్లోయింగ్. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉండటమే కాకుండా రేసీగా ఉంది. డైలాగ్స్‌కు ఫ్యాన్స్ నుంచి చప్పట్లు మోగాల్సిందే. ఇక ఈ సినిమాలో అజిత్ గెటప్ చూస్తే ఫ్యాన్స్ ఓ కిక్ వచ్చేలా ఉంటుంది అని ఉమేర్ సంధూ రివ్యూ వెల్లడించారు. అయితే ఈ సినిమా ఉమేర్ సంధూ చెప్పినట్టుగానే ఉంటుందా? లేదా అనేది ఏప్రిల్ 10వ తేదీన ఫిల్మ్ బీట్ వెల్లడించే రివ్యూ కోసం వేచి చూడండి.


Click it and Unblock the Notifications











