Kesari 2 First Review: కేసరి చాప్టర్ 2 ఫస్ట్ రివ్యూ.. అక్షయ్ కుమార్‌కు హిట్టు పడిందా?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, స్టార్ హీరో ఆర్ మాధవన్ హీరోలుగా, అనన్య పాండే, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్. చరిత్ర ఆధారంగా రూపొందుతున్న కోర్టు రూమ్ డ్రామాకు డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాను హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను దుబాయ్‌కు చెందిన క్రిటిక్ వెల్లడించారు. ఈ సినిమా గురించి వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో 2019 సంవత్సరంలో రూపొందిన కేసరి సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో సైమన్ పైస్లీ డే, అలెక్స్ ఓనెల్, అమిత్ సియాల్, మసాబా గుప్తా, స్టివెన్ హార్ట్‌లీ నటించారు. ఈ సినిమాకు దేబోజిత్ రే సినిమాటోగ్రఫి, సాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ అందించారు. నితిన్ బేద్ ఎడిటర్‌గా బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాకు ముందుగా శంకర అనే టైటిల్ అనుకొన్నారు. కానీ కేసరి 2 అని ఫైనల్‌గా టైటిల్ నిర్వహించారు. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఓవర్సీస్‌లో రిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గల్ఫ్ కంట్రీస్ సెన్సార్‌ను దుబాయ్‌లో నిర్వహించగా.. తాను ఈ సినిమాను చూశానని అక్కడి క్రిటిక్ ఉమేర్ సంధూ వెల్లడించారు.
కేసరి 2 సినిమా కథలో పెద్దగా కొత్తదనం లేదు. ఈ సినిమా పాత సీసాలో కొత్త సారా లాంటిది. ఈ మూవీలో హీరోగా అక్షయ్ కుమార్ సూట్ కాలేదు. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. కానీ ఆర్ మాధవన్ తన నటనతో మెప్పిస్తాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ సినిమా అప్పర్ క్లాస్ మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం మాత్రమే రూపొందించారు అని ఉమేర్ సంధూ పేర్కొన్నాడు.
కేసరి 3 సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే.. నాసిరకంగా, పేలవంగా ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయి. స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాతకాలం నాటి తరహా ఉంటుంది. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్‌లో కాబోయే మరో ఫ్లాప్ సినిమా అని ఉమేర్ సంధూ తేల్చేశాడు. తన వంతుగా సోషల్ మీడియాలో 2/5 రేటింగ్ ఇచ్చాడు. అయితే థియేట్రికల్‌గా రిలీజై ఎలాంటి ఫలితాన్ని ప్రేక్షకులు అందిస్తారో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, కేసరి 2 మూవీపై రివ్యూ అందించిన ఉమేర్ సంధూను నెటిజన్లు ఘాటుగా, బూతులతో విరుచుకుపడుతున్నారు. నీ అయ్య చూశాడా? ఈ సినిమాను. ఈ చిత్ర యూనిటే ఇంకా సినిమాను చూడలేదు. ఇలాంటి చెత్త రివ్యూలు ఇస్తే.. నీపై కేసు పెడుతా అంటూ ఓ నెటిజన్ బండబూతులతో జవాబిచ్చాడు. ఇలానే చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఆయనపై కేసులు పెట్టండి అంటూ ధర్మ ప్రొడక్షన్స్‌ను కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











