Vettaiyan First Review: రజనీకాంత్ వేట్టయన్ ఫస్ట్ రివ్యూ.. అమితాబ్, రానా, ఫాహద్ మూవీ టాక్ ఏమిటంటే?

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం వేట్టయన్: ద హంట‌ర్‌. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుభాస్క‌ర‌న్ నిర్మించారు. విజయదశమి పర్వదినం కానుకగా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు.

ర‌జినీ టైటిల్ పాత్ర‌లో న‌టించిన‌ ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్‌ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

Umair Sandhu s Review on Rajinikanth s vettaiyan

ఇప్పటి వరకు లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్,ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా ఆదరణ లభిస్తున్నది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మల్టీ స్టారర్‌ మూవీ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్‌పై దృష్టిపెట్టారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన వ్యక్తమవుతున్నది.

ఇదిలా ఉండగా, దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ తాజాగా ట్వీట్ చేసి ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ చెప్పారు. సెన్సార్ బోర్డు కోసం వేసిన ప్రివ్యూను చూశాను. రజనీకాంత్, అమితాబ్ కాంబో ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. అమితాబ్, రజనీకాంత్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్‌గా, ఎనర్జీతో కనిపించారు. రజనీ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఓ సారి చూడొచ్చు అని ఆయన రివ్యూ చెప్పారు.

Umair Sandhu s Review on Rajinikanth s vettaiyan

అయితే ఉమేర్ సంధూ ఈ సినిమాపై పాజిటివ్‌గా కొన్ని కామెంట్లు చేశారు. అలాగే రజనీకాంత్‌పై కొన్ని నెగిటివ్‌గా పోస్టులు పెట్టారు. అయితే మాత్రం ఇన్‌సైడ్ రిపోర్టు ప్రకారం.. జైలర్ తర్వాత అంతకుమించిన సినిమా అవుతుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, రానా క్యారెక్టర్లు హైలెట్‌గా నిలుస్తాయి. మంజూవారియర్ పాత్ర ఆకట్టుకొంటుందని చెబుతున్నారు.

ఉమేర్ సంధూ పెట్టే రివ్యూలు వాస్తవానికి ఆమడదూరంలో ఉంటాయి. ఆయన సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పిన సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.అతడు డిజాస్టర్ అని వెల్లడించిన రివ్యూ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఏది ఏమైనా ఉమేర్ సంధూ ఏ మేరకు కరెక్ట్ అవుతారనే కొద్ది గంటల్లోనే తేలిపోనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X