Tripti Dimiri Movie First Review: త్రిప్తి డిమ్రీ నటించిన వికీ విద్యా కా ఓ వాలా వీడియో ఫస్ట్ రివ్యూ

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్ ఫిల్మ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్, వాకూ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్, విపుల్ డీ షా సంయుక్తంగా రూపొందించిన చిత్రం వికీ విద్యా కా ఓ వాలా వీడియో.

బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ, యువ హీరో రాజ్ కుమార్ రావు, విజయ్ రాజ్, మల్లికా షెరావత్, అర్చన పూరన్ సింగ్, షెహనాజ్ గిల్, దలేర్ మహేంది తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై క్రిటిక్ వెల్లడించిన రివ్యూ గురించిన వివరాల్లోకి వెళితే..

Tripti Dimiri s Vicky Vidya Ka Woh Wala Video

వికీ విద్యా కా ఓ వాలా వీడియో మూవీ కథ విషయానికి వస్తే.. 1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. అయితే శోభనం రోజు రాత్రి వారికి చిలిపి కోరిక కలుగుతుంది. భవిష్యత్‌లో తమ ఫస్ట్ నైట్‌ను మరోసారి చూసుకోవడానికి ఆ మధురమైన రాత్రిని వీడియోలో బంధించాలనే కోరికతో షూట్ చేస్తారు. ఆ వీడియో సీడీ దొంగతనానికి గురి అవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు దంపతుల పరిస్థితి ఏమిటనేది ఈ సినిమా కథ.

యానిమల్ సినిమా తర్వాత త్రిప్తి డిమ్రీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఆ సినిమా తర్వాత ఇటీవల రిలీజైన బ్యాడ్ న్యూజ్ సినిమా అద్బుతమైన విజయాన్ని అందుకొన్నది. దాంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అలాగే ఈ సినిమా ప్రోమోలు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా గురించి దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ రివ్యూను అందించారు. ఈ సినిమాను ఓవర్సీస్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక్క నిమిషం కూడా నవ్వకుండా ఉండలేకపోయాను. నేను పెట్టుకొన్న అంచనాలు పూర్తిగా అందుకొన్నది. ఈ సినిమా మంచి వినోదాన్ని పంచింది అని అన్నారు.

వికీ విద్యా కా ఓ వాలా వీడియో సినిమాలో రాజ్ కుమార్ రావు ఫెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్. 2024లో నంబర్ హీరో ఎవరంటే..ఆయనే పేరే చెప్పుకోవాలి. త్రిప్తి డిమ్రీ యాక్టింగ్ బాగుంది. మల్లికా షెరావత్ మరోసారి తనదైన శైలిలో రీ ఎంట్రీ ఇచ్చింది అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నారు.

డ్రీమ్ గర్ల్ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించిన రాజ్ శాండిల్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అసీమ్ మిశ్రా, ప్రకాశ్ చంద్ర సాహు ఎడిటింగ్, సచిన్ జిగర్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హితేష్ సోనిక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X