twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉందా... లేదా?’ మూవీ రివ్యూ: ఇదో రొటీన్ హారర్ థ్రిల్లర్...

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    రామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం'ఉందా..లేదా?'. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమాలో ఏం ఉంది? ఏం లేదు? అనేది రివ్యూలో చూద్దాం.

    Recommended Video

    డిఫరెంట్ సినిమా 'ఉందా లేదా'..?
    కథేమిటంటే

    కథేమిటంటే

    విజయవాడలోని రాజా హరిశ్చంద్ర ప్రసాద్ ప్రభుత్వ లేడీస్ హాస్టల్‌‌లో రుబీనా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఆత్మహత్య వెనక కారణం కనిపెట్టేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కూడా రుబీనా మాదిరిగానే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ హాస్టల్ లో దెయ్యం ఉందని, ఈ ఆత్మహత్యలకు కారణం అదే అని ప్రచారం మొదలవుతుంది. రుబీనా ఆత్మహత్య తర్వాత ఈ హాస్టల్‌లో నందిని(అంకిత) అనే మెడికల్ స్టూడెంట్ చేరుతుంది. నందిని కూడా రుబీనా మాదిరిగానే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. తన ప్రియురాలు నందిని కాపాడేందుకు హీరో(రామకృష్ణ) రంగంలోకి దిగుతాడు. మరి అతడు ఏం చేశాడు? నిజంగానే ఈ హాస్టల్‌లో దెయ్యం ‘ఉందా... లేదా?' అనేది మిగతా కథ.

     పెర్ఫార్మెన్స్ పరంగా..

    పెర్ఫార్మెన్స్ పరంగా..

    ఈ సినిమా ద్వారా రామకృష్ణ, అంకిత హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరిలోనూ చెప్పుకునేంత విషయం ఏమీ లేదు. యాక్టింగ్ పరంగా ఇద్దరూ చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. లుక్ పరంగా కూడా యావరేజ్‌గా ఉన్నారు. ఈ రోజుల్లో ఫేం సాయి కుమార్ పంపాన హీరో ఫ్రెండ్ పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ జగన్, ప్రొఫెసర్ పాత్రలో జీవా, హోం మినిస్టర్ పాత్రలో ఝాన్సీ వారి వారి పాత్రలకు తగిన విధంగా నటించారు.

     టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా...

    హారర్ సినిమాలకు ప్రధాన బలం బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ. శ్రీమురళీ కార్తికేయ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ప్రవీణ్ కె బండారి సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. ఇతర టెక్నికల్ విభాగాల పనితీరు, నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏమీ లేవు.

     కొత్తదనం లేని కథ, కథనం

    కొత్తదనం లేని కథ, కథనం

    ఏ సినిమాకు అయినా కథ, కథనం అనేది ఎంతో ముఖ్యం. అయితే ‘ఉందా... లేదా?' సినిమాలో ఈ రెండు విషయాలు పరమ రోటీన్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేదు. సినిమాలో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఏమీ లేవు. అయితే సినిమాలో సౌండ్ పొల్యూషన్ గురించి, దాని వల్ల మనుషులు ఎలా ప్రభావితం అవుతారు అని చెప్పి విషయం మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉంది.

    దర్శకుడి పని తీరు

    దర్శకుడి పని తీరు

    ఈ చిత్రానికి అమ‌నిగంటి వెంక‌ట శివప్ర‌సాద్ దర్శకత్వం వహించారు. కథను ఎంచుకోవడంలో, స్క్రిప్టును ఆసక్తికరంగా మలచడంలో అతడి అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు నటీనటుల ఎంపిక కూడా సరిగా లేదు, వారి నుండి మంచినటన రాబట్టుకోవడంలో విఫలం అయ్యాడు.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    సినిమా ఫస్టాఫ్ కొన్ని కామెడీ సీన్లు, లవ్ సీన్లు, రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్‌లో జరిగే ఆత్మహత్య సంఘటనలతో సాగుతుంది. ఫస్టాఫ్ అంతగా రోటీన్ గా సాగుతూ ఆకట్టుకోలేదు.

    సెకండాఫ్...
    సినిమా సెకండాఫ్ అందులో దెయ్యం నిజంగానే ఉందా? లేదా? అనే అన్వేషణతో రన్ అవుతుంది. ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ కాస్త బెటర్.

     ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్స్

    సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కాస్త ఫర్వాలేదు. మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే... ప్రధాన తారాగణం కథ, కథనం, డైరెక్షన్ ఇలా చాలా ఉన్నాయి.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఉందా... లేదా? సినిమా గురించి చివరగా చెప్పేదేమంటే.... ఎలాంటి కొత్తదనం లేని రోటీన్ హారర్ థ్రిల్లర్.

     నటీనటులు

    నటీనటులు

    ఈ చిత్రంలో రామ‌కృష్ణ, అంకిత, కుమార్ సాయి, జీవా, రామ్‌జ‌గ‌న్ , ఝూన్సీ, ప్ర‌భావ‌తి తదితరులు నటిచారు.

     తెరవెనక

    తెరవెనక

    బ్యాన‌ర్ : జ‌య‌క‌మ‌ల్ ఆర్ట్స్ , ఎడిట‌ర్ :మ‌ణికాంత్ తెల్ల‌గూటి కొరియోగ్ర‌ఫీ: నందు జెన్నా, పాట‌లు :నాగరాజు కువ్వార‌పు ,శేషు మోహ‌న్ ,సింగ‌ర్స్ :సింహ ,హేమ‌చంద్ర ,స్వీక‌ర్ అగ‌స్సీ , మ్యూజిక్ : శ్రీముర‌ళీ కార్తికేయ సినిమాటోగ్ర‌ఫీ : ప్ర‌వీణ్ కె బంగారి స‌హానిర్మాత‌లు : అల్లం సుబ్ర‌మ‌ణ్యం ,అల్లం నాగిశెట్టి , నిర్మాత : అయితం ఎస్ క‌మ‌ల్ ద‌ర్శ‌క‌త్వం : అమ‌నిగంటి వెంక‌ట శివప్ర‌సాద్.

    English summary
    Check out Unda Leda Movie Review. New artists Ramakrishna and Ankitha itroduced as hero and heroine. Aitham N Kamal is producing the film on Jayakamal Arts banner with Amaniganti Venkata Shivaprasad as director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X