Get Set Baby First Review: గెట్ సెట్ బేబీ ఫస్ట్ రివ్యూ.. మార్కో మూవీకి భిన్నంగా ఉన్ని ముకుందన్!
మార్కో సినిమా తర్వాత మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం గెట్ సెట్ బేబీ (Get Set Baby). స్కంధ సినిమాస్, కింగ్స్‌మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సాజీవ్ సోమన్, సునీల్ జైన్, ప్రకాశ్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు వినయ్ గోవింద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందించగా.. అలెక్స్ పులిక్కల్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి ఉన్ని ముకుందన్ ఇచ్చిన రివ్యూ, అలాగే ట్రైలర్‌లోని కీలక అంశాల విషయాల్లోకి వెళితే..
పిల్లలు భగవంతుడు ఇచ్చే వరప్రసాదం.. పిల్లలు దేవుడు ఇచ్చే గొప్ప బహుమతి. మనం చేసే పనిలో స్వచ్ఛత ఉంటే.. దేవుడు కూడా మనతోనే ఉంటాడు అంటూ ట్రైలర్‌లో మాతృత్వం గురించిన విషయాలను ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బాలికలందరు మెడికల్ స్టూడెంట్స్‌గా అందరూ క్లాస్‌లో కూర్చొంటే.. మన క్లాస్‌లో ఓ అబ్బాయి కూడా ఉన్నాడు అంటూ టీచర్ చెప్పడం ద్వారా ఉన్ని ముకుందన్ క్యారెక్టర్‌ను ట్రైలర్‌లో ఇస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.

గెట్ సెట్ బేబీ (Get Set Baby Trailer Review) చిత్రంలో అర్జున్ పాత్రలో ఉన్ని ముకుందన్ గైనాకాలిజిస్టుగా నటించారనేది స్పష్టమైంది. అయితే తన తోటి విద్యార్థిని.. మీరు ఎందుకు గైనకాలాజీని ఎంచుకొన్నారు అని ప్రశ్నిస్తే.. నాకు అవసరం ఏర్పడింది అంటూ సమాధానం ఇస్తాడు. అయితే ఓ గర్భిణి మాట్లాడుతూ.. అతడు ఎవరూ అర్ధం చేసుకోని విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్‌ను అర్దం చేసుకొంటున్నాడు అని అనడం కథలోని ఇంటెన్సిటీని చెప్పింది. అలాగే ఓ మహిళ ప్రసవ వేదన ఈ సినిమాలో భావోద్వేగాలను పండించే విధంగా కనిపించింది.
మార్కో సినిమా తర్వాత ఉన్ని ముకుందన్ నటిస్తున్న చిత్రం కావడంతో అందరూ మళ్లీ మితి మీరిన హింస ఉంటుందేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ మర్కో సినిమాకు విభిన్నంగా ఆయన ఈ చిత్రాన్ని ఎంచుకొన్న తీరు అతడి కెరీర్ ప్లానింగ్ ఏమిటో చెప్పకనే చెప్పేలా చేశారు. మార్కో లాంటి వయోలెంట్ మూవీ తర్వాత పక్కాగా ఫ్యామిలీ చిత్రంతో వస్తున్నానని ఆయన ట్విట్ చేశారు.

ఉన్ని ముకుందన్ ట్వీట్ చేస్తూ.. గెట్ సెట్ బేబీ (Get Set Baby Review) చిత్రాన్ని సెన్సార్ బోర్డు అధికారులు చూశారు. మా సినిమాకు పక్కగా యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌గా అన్ని ప్రమాణాలతో రూపొందించాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా గెట్ సెట్ బేబీ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ అవుతున్నది అని ఆయన వెల్లడించారు.
గెట్ సెట్ బేబీ (Get Set Baby) సినిమాకు రన్ టైమ్ విషయానికి వస్తే.. మొత్తంగా 134 నిమిషాలు. అంటే ఈ సినిమా 2 గంటల 14 నిమిషాల పాటు పూర్తిగా వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారనిపిస్తున్నది. ఫ్యామిలీ ప్యాకేజీగా రూపొందిన ఈ సినిమాలో ఫన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే మంచి కథ, కథనాలతో కంటెంట్ బేస్డ్ సినిమాగా ఉంటుంది అని ఉన్ని ముకుందన్ ట్వీట్ చేశారు. దాంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.


Click it and Unblock the Notifications











