twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉప్పెన మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతిశెట్టి
    Director: బుచ్చిబాబు సనా

    మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి హీరోయిన్‌గా, బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, టైలర్లే కాకుండా పాటలు సోషల్ మీడియాలో బ్లాక్‌బస్టర్‌గా మారాయి. ఫిబ్రవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే....

    ఉప్పెన కథ

    ఉప్పెన కథ

    ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే పట్టుదల ఉన్న రవణం ( విజయ్ సేతుపతి) ఓ గ్రామ పెద్ద. ఆయన కుమార్తె బేబమ్మ అలియాస్ సంగీత (కృతి శెట్టి)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) ఈ క్రమంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. ఆశీతో తిరుగుతుందనే విషయం రవణంకి తెలిసి బేబమ్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆశీ, బేబమ్మ లేచిపోతారు. రాయుడు కంటపడకుండా పూరి, కోల్‌కత్తా, గ్యాంగ్ టక్ ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ ఓ రోజు రవణానికి బేబమ్మను ఆశీ అప్పగిస్తాడు.

    ఉప్పెన చిత్రంలో ట్విస్టులు

    ఉప్పెన చిత్రంలో ట్విస్టులు

    తన ప్రాణం కన్నా ప్రేమించిన బేబమ్మను ఆశీ ఎందుకు దూరం చేసుకొన్నారు? ఆశీ చేసిన నిర్వాకానికి బేబమ్మ ఎలా స్పందించింది. ఆశీ వదిలేసిన తర్వాత బేబమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. బేబమ్మ కోసం రవణం ఎలా తపించాడు? ప్రేమను రవణం వ్యతిరేకించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉప్పెన చిత్రం కథ.

     ఉప్పెన ఫస్టాఫ్ అనాలిసిస్

    ఉప్పెన ఫస్టాఫ్ అనాలిసిస్

    రాయుడు పాత్రలో విజయ్ సేతుపతి ఎంట్రీతో సినిమా కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. రాయుడు చేసే కొన్ని పనులు ఆసక్తిని, కథపై క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఇక మంచి మాస్ ఎలిమెంట్స్‌తో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఫర్‌ఫెక్ట్‌గా లాంచ్ అయిందనే విధంగా ఫీలింగ్ కల్పిస్తుంది. ఇక ఆశీ, బేబమ్మ మధ్య లవ్, రొమాంటిక్ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ఫస్టాఫ్‌లో కథను మరీ లాగదీసి చెప్పారా అనే ఫీలింగ్ కలుగుతుంది. తొలిభాగం చూస్తే ఇంత నిడివా అనే ఫీలింగ్ కలుగడానికి పసలేని సన్నివేశాలే కారణం అని చెప్పవచ్చు.

    ఉప్పెన సెకండాఫ్ అనాలిసిస్

    ఉప్పెన సెకండాఫ్ అనాలిసిస్

    ఇక ఉప్పెన రెండో భాగంలో దర్శకుడు తన చేతికి, ప్రతిభకు సాన పట్టారు. ఆశీ, బేబమ్మ లేచిపోయిన తర్వాత సీన్లు మరీ కొత్తదనం లేకుండా తెరపైన కనిపిస్తాయి. చాలా చిత్రాల్లో ఉండే సీన్లను మళ్లీ పాత సీసాలో కొత్తగా అనే చందంగా చూపించారు. ఇక ఆశీ తండ్రి జాలయ్య (సాయి చంద్)కు సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు భావోద్వోగాన్ని రేకెత్తిస్తాయి. చివర్లో కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు పీక్స్‌లో ఉంటాయి.

    డైరెక్టర్ ప్రతిభ

    డైరెక్టర్ ప్రతిభ

    పేద, గొప్ప కుటుంబాల అతి సాధారణమైన పాయింట్‌కు తనదైన శైలిలో దర్శకుడు బుచ్చిబాబు రంగులు అద్దారు. తొలి చిత్ర దర్శకుడిగా ఎక్కడా కనిపించరు. బుచ్చిబాబు రాసిన డైలాగ్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. ఇక క్లైమాక్స్‌లో కథను చెప్పిన విధానం, క్లిష్టమైన అంశాన్ని తెర మీద కన్విన్స్ చేసిన విధానం బాగుంది. దర్శకుడిగా బుచ్చిబాబు భారీ సినిమాలను హ్యాండిల్ చేసే సత్తాను తెర మీద చూపించారని చెప్పవచ్చు.

    విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎలా ఉందంటే

    విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎలా ఉందంటే

    కథ, కథనాలు ఎలా ఉన్నా ఉప్పెన సినిమాకు ప్రాణం విజయ్ సేతుపతి పాత్ర. అతని గెటప్, హావభావాలు తెర మీద అద్భుతంగా కనిపిస్తాయి. కథలో విజయ్ సేతుపతి పాత్ర మరికొంత పెంచి ఉంటే సినిమాకు కొత్తదనం వచ్చి ఉండేది. ప్రేమ కథ చెప్పాలనే ఆసక్తి కారణంగా విజయ్ సేతుపతి పాత్రకు అన్యాయం జరిగిందా అనిపిస్తుంది. మొత్తంగా సినిమాకు బలం, బలహీనత విజయ్ సేతుపతే అని చెప్పవచ్చు.

    వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్

    వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్

    ఉప్పెన చిత్రం వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీకి పర్‌ఫెక్ట్ లాంచ్‌గా మారింది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో అనుభవం ఉన్న హీరోగా నటించాడు. ఎక్కడా తొలి చిత్ర హీరో అనే ఫీలింగ్ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. సెకండాఫ్‌లో వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో ప్రతిభావంతుడైన నటుడు తెలుగు తెరకు పరిచయం అయ్యారని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    కృతి శెట్టి టాలెంట్

    కృతి శెట్టి టాలెంట్

    బేబమ్మ పాత్రలో కృతిశెట్టి ఒదిగిపోయింది. ప్రతీ సన్నివేశంలో మెచ్యురిటీ ఉన్న నటిగా కనిపించింది. డైలాగ్స్ డెలివరీ, హావభావాలను స్పష్టంగా పలికించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతితో పోటాపోటిగా నటించింది. తొలి చిత్రమైనా నటనపరంగా ఎక్కడా లోపాలు లేకుండా నటించారని చెప్పవచ్చు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    ఉప్పెన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా ఆలరించాయి. నీ కళ్లు నీలి సముద్రం, జల జల జలపాతం నువ్వు, ఈశ్వర పాటలు చాలా బాగున్నాయి. రీరికార్డింగ్‌ అద్భుతంగా ఉంది. షమాదత్ అందించిన సైనుద్దీన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఆకర్షణ. నవీన్ నూలి చేతికి ఇంకా చాలా పని ఉంది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు అద్భుతంగా ఉంది.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో వచ్చిన చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక పర్‌ఫెక్ట్‌గా ఉంది. అయితే తొలి భాగంలో కథ, కథనాలు, నిడివి విషయంలో జాగ్రత్తపడి ఉంటే తప్పకుండా ఉప్పెన మరో క్లాసిక్ అయి ఉండేదేమో అనిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే రొటీన్ ప్రేమ కథా చిత్రం ఉప్పెన. ఉప్పెన సినిమా చూస్తున్నంత సేపు రంగస్థలం, సైరత్‌తోపాటు పలు సినిమాల కథలు, సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. అయితే క్లైమాక్స్‌లో ఉండే ట్విస్టుతో సినిమా కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఉండే ఉండే కీలక పాయింట్‌పై ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తే ఉప్పెన మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రేక్షకులను భారీగా రప్పించే అవకాశం ఉంది. మెగా హీరో, రిలీజ్‌కు ముందు సినిమాపై పెరిగిన అంచనాలతో భారీగా ఒపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంది. కొద్ది రోజులు ఆగితే సినిమా ఫలితంపై స్పష్టమైన తీర్పు రావడానికి అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    దర్శకుడి టేకింగ్
    విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్
    వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి యాక్టింగ్
    సినిమాటోగ్రఫి,
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్
    క్లైమాక్స్

    తెర వెనుక తెర ముందు

    తెర వెనుక తెర ముందు

    నటీనటులు: వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతిశెట్టి
    రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సనా
    నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవి శంకర్
    సినిమాటోగ్రఫి: షమాదత్ సైనుద్దీన్
    మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
    ఎడిటర్: నవీన్ నూలి
    ఆర్ట్ డైరెక్టర్స్: మౌనిక రామకృప్ణ
    సీఈవో: చెర్రీ
    సమర్పణ: సుకుమార్
    బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

    English summary
    Uppena movie is set to release on February 12th. Vaishnav Tej and Krithi Shetty, Vijay Sethupathi are in the lead roles in the uppena. Buchchi Babu is debuting director. This movie got huge craze before its release. In this occassion, Telugu filmibeat gives exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X