Uppu Kappurambu Movie Review: ఉప్పు కప్పురంబు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: కీర్తీ సురేష్, సుహాస్, తాళ్లూరి రామేశ్వరి, బాబు మోహన్, శత్రు, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, విష్ణు ఓఐ, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకత్వం: అని ఐవీ శశి
రచన: వసంత్ మరింగంటి
నిర్మాత: రాధిక లావు, పృథ్వీ గణేష్ వేగిరాజు
మ్యూజిక్: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రాఫర్: దివాకర్ మణి
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీ నాగేంద్ర తంగలా
ఆర్ట్: ప్రసాద్ పెనుమర్తి, లక్ష్మీ తమంగ్
క్యాస్టూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-07-12

చిట్టి జయపురం గ్రామంలో అంత్యక్రియల విషయంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ఖననం చేయడం తప్ప దహనం చేయరు. అలాగే ప్రతీ ఒక్కరికి సమాధి నిర్మించి వారి మరణానికి కారణం రాస్తారు. శవాలను పూడ్చడానికి గోతులు తవ్వడం లాంటి అంత్యక్రియల కార్యక్రమాలను చిన్నా (సుహాస్) పూర్తి చేస్తుంటాడు. అయితే ఆ ఊరి పెద్ద (శుభలేఖ సుధాకర్) మరణంతో ఆయన వారసత్వంతో ఆ గ్రామపెద్దగా అపూర్వ (కీర్తి సురేష్) బాధ్యతలు చేపడుతుంది. అయితే ఆమె వారసత్వాన్ని గ్రామ పెద్దలు భీమయ్య (బాబు మోహన్), మధు బాబు (శత్రు) వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో ఆ ఊరిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి ఖాళీ స్థలం లేక హౌస్‌ఫుల్ అవుతుంది.

Uppu Kappurambu Movie Review

ఇష్టంలేని గ్రామ పెద్ద పదవిని చేపట్టిన అపూర్వ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? అపూర్వ గ్రామ పెద్ద పదవిని ఎలాంటి పరిస్థితుల్లో చేపట్టింది? చిట్టి జయపురంలో ఆచారాలు ఎలా ఉన్నాయి? శ్మశాన వాటికలో ఖాళీ స్థలం లేకపోవడం వల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయి? శ్మశాన వాటిక విషయంలో చిన్నా ఆడిన అబద్దం ఏమిటి? చిన్నా చేసిన తప్పుకు గ్రామ పెద్దలు ఎలాంటి శిక్షను విధించారు? గ్రామ పెద్ద పదవి నుంచి అపూర్వ ఎందుకు తప్పుకొన్నది? అపూర్వ తప్పుకొన్న తర్వాత ఆ పదవిని ఎవరు చేపట్టారు? ఊరికి సమస్యగా మారిన శ్మశాన వాటిక అంశానికి పరిష్కారం లభించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఉప్పు కప్పురంబు సినిమా కథ.

రానా దగ్గుబాటి నేరేషన్‌తో అపూర్వ తండ్రి, గ్రామ పెద్ద (శుభలేఖ సుధాకర్) మరణంతో సినిమా కథ ఫన్నీగా, హ్యుమర్‌గా మొదలవుతుంది. మంచి ఎమోషనల్ పాయింట్‌ను కామెడీగా చెప్పడానికి, బలమైన సన్నివేశాలు రాయడానికి స్టోరి స్కోప్ ఇచ్చింది. కానీ ఫస్టాఫ్ చాలా పేలవంగా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా సాదాసీదాగా సాగిపోతుంది. చిన్నా, తాళ్లూరి రామేశ్వరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అపూర్వగా కీర్తి సురేష్ క్యారెక్టర్ టేకాఫ్ సరిగా లేకపోయిందనిపిస్తుంది. శత్రు, బాబూ మోహన్ పాత్రలు కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా లేకపోవడం కథలో ఉండే సీరియస్ అంశాలు తేలిపోయేలా చేశాయి.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కథలో భావోద్వేగాలు సరైన ట్రాక్‌లో ఉండటంతో కథకు కనెక్ట్ అయ్యేందుకు దోహదపడుతాయి. కథలో ఎప్పుడైతే సమస్య బలంగా కనిపించిందో అప్పటి నుంచి పాత్రల బిహేవియర్ ఎమోషనల్‌గా కనిపించేలా చేస్తుంది. ఇక చిన్నాకు సంబంధించి ఓ భావోద్వేగమైన పాయింట్ సినిమా కథా స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. క్లైమాక్స్‌లోని సన్నివేశాలు గుండెను బరువెక్కేలా చేస్తాయి.

ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలతో ఆకట్టుకొన్నది. అయితే ఈ సినిమాలో ఓ డిఫరెంట్ ఫ్లేవర్‌తో ఉండే క్యారెక్టర్‌లో కనిపించింది. కామెడీ, ఎమోషన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. అయితే ఆమె క్యారెక్టరైజేషన్ సరిగా డిజైన్ చేయకపోవడం వల్ల ఆమె తెర మీద మరింత ఫెర్ఫార్మ్ చేయడానికి అవకాశం చిక్కలేదనిపిస్తుంది. సుహాస్ మరోసారి మంచి పాత్రలో, సానుభూతిని పొందే క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు తన నటనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొంటారు. తాళ్లూరి రామేశ్వరి, బాబు మోహన్, శత్రు, ఇతర పాత్రల్లో నటించిన వారంతా కథ డిమాండ్ మేరకు నటించారు. విష్ణు కనిపించిన కాసేపైనా నవ్వించాడు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ బలంగా కనిపిస్తుంది. ఇక సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. గ్రామీణ వాతావరణంలో జరిగే కథను సినిమాటోగ్రాఫర్ చక్కగా కెమెరాలో బంధించారు. గ్రామీణ ప్రజల్లో ఉండే అమాయకత్వం, చలాకీ తనాన్ని మంచిగా చూపించాడు. ఈ సినిమాకు ఎడిటింగ్ వర్క్ మరో ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తెలుగు తెర మీద ఇప్పటి వరకు రానుటువంటి.. ఏ డైరెక్టర్ అటెంప్ట్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో వచ్చిన ఎమోషనల్ డ్రామా ఉప్పు కప్పురంబు. ఉప్పు, కర్పూరాన్ని ఎలా చూస్తారు? ఎలా ఉపయోగిస్తారు అనే విషయాన్ని కథకు అన్వయించి చెప్పిన విధానం బాగుంది. స్టోరి పాయింట్ బాగుంది. కానీ కథను నడిపించిన విధానం, పాత్రల డిజైన్‌లోనే కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దర్శకుడు శశి ఇంకాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందనిపిస్తుంది. చాలా సీన్లు మెచ్యురిటీగా కనిపించవు. కీర్తీ సురేష్ కొన్ని సీన్లలో చేసిన ఓవరాక్షన్ భరించలేకుండా ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో ఎమోషన్స్ జొప్పించి ఆకట్టుకొనేలా నటించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తీరిక వేళలో ఒకేసారి సినిమాను చూసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓ డిఫరెంట్ అనుభూతిని పొందుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X