Uruku Patela Review: ఉరుకు పటేల సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.25/5

న‌టీన‌టులు: తేజ‌స్ కంచెర్ల‌, ఖుష్బూ చౌద‌రి, లావణ్య రెడ్డి, ఆనంద చక్రపాణి, చమ్మక్ చంద్ర త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్‌
ద‌ర్శ‌క‌త్వం: వివేక్ రెడ్డి
నిర్మాత‌: కంచెర్ల బాల భాను
సినిమాటోగ్ర‌పీ: స‌న్నీ కూర‌పాటి
మ్యూజిక్‌: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
సౌండ్ డిజైన్‌: ప్ర‌దీప్.జి
ఎడిట‌ర్‌: శశాంక్ ఉప్పుటూరి
ఆర్ట్‌: వివేక్ అన్నామ‌లై
కొరియోగ్ర‌ఫీ: జీతూ మాస్ట‌ర్‌
ఫైట్స్‌: రాబిన్ సుబ్బు
రిలీజ్ డేట్: 2024-09-07

తెలంగాణలోని జమీందార్ కుటుంబానికి చెందిన పటేల (తేజస్ కంచెర్ల) బరువు బాధ్యతలు లేకుండా అందరికీ లైఫ్ ఇస్తానంటూ జల్సాగా తిరుగుతుంటాడు. లైఫ్‌లో ఎవరూ కూడా అతడిని ప్రేమించరు. అలాంటి పరిస్థితుల్లో తన గ్రామానికి మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు వచ్చిన డాక్టర్ అక్షర్ (ఖుష్బూ చౌదరీ)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఓ కారణంగా ఓ కాలు పనిచేయకుండా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పటేలను అక్షర పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. అయితే ఇరు కుటుంబాలు పటేల, అక్షరకు పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. కానీ పటేలను చంపడానికి అక్షర తండ్రి (ఆనంద చక్రపాణి) ప్లాన్ చేస్తాడు.

Uruku Patela Movie Review in Telugu  Tejas Kancherla impressive show

ఊరిలో పటేల లైఫ్ ఎలా సాగింది? చదువు సంధ్యలేని పటేల అందరికి లైఫ్ ఇస్తానని ఎందుకు తిరుగుతుంటాడు. స్టడీస్ లేని, అంగవికలుడైన పటేలాను డాక్టర్ అక్షర ఎందుకు ఇష్టపడుతుంది? అక్షరకు పటేలతో ఆమె తండ్రి ఎందుకు పెళ్లి చేయాలని అనుకొంటాడు? పటేలను అక్షర తండ్రి ఎందుకు చంపాలని అనుకొంటాడు? మర్డర్ ప్లాన్ నుంచి పటేల ఎలా తప్పించుకొన్నాడు? అక్షరను చివరికి పెళ్లి చేసుకొన్నాడా? మర్డర్ ప్లాన్ చేసిన వారికి పటేల ఎలా చెక్ పెట్టాడు అనేది సినిమా కథ.

ఉరుకు పటేల సినిమాను పాయింట్‌గా చూస్తే బాగుంటుంది. కానీ కథను విస్తరించే క్రమంలో బలమైన సన్నివేశాలను రాసుకోవాల్సిందనిపిస్తుంది. హీరోను ఎందుకు చంపాలనే విషయం వెనుక ఇంకా బలమైన పాయింట్‌తో, లాజిక్‌తో వెళ్లి ఉంటే డెఫినెట్‌గా మంచి ఫన్‌తో కూడిన థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. బలహీనమైన స్క్రిప్టు ఉన్నప్పటికీ.. హీరో తేజస్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సన్నివేశాలను బాగా ఎలివేట్, ఇంప్రూవ్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక తేజస్ కంచెర్ల పటేల పాత్రలో ఒదిగిపోయాడు. ఫన్, హ్యుమర్ ఫ్లేవర్‌తో సాగే క్యారెక్టర్‌ను బాగా పండించాడు. కథ, కథనాలు రొటీన్, రెగ్యులర్‌గా ఉండటం వల్ల తన వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో కొన్ని యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. మంచి పాత్రలు, కథలతో కూడిన సినిమాలను ఎంచుకొంటే యువ హీరోగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది.

ఇక అక్షర పాత్రలో కుష్బూ చౌదరీ గ్లామరస్‌గానే కాకుండా అవసరమైన చోట యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నది. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. ఇక హీరోయిన్ తండ్రిగా ఆనంద చక్రపాణి క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు సాఫ్ట్‌గా తండ్రి పాత్రలో నటించిన ఆయన విలన్ షేడ్ పాత్రతో ఆకట్టుకొన్నారు. కొన్ని సీన్లలో ఆయన నటన మెప్పించింది. చమ్మక్ చంద్ర కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.

Uruku Patela Movie Review in Telugu  Tejas Kancherla impressive show

టెక్నికల్ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ అంశాలు ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. మాస్ బీట్‌తో సాగే పాటలు క్యాచీగా ఉన్నాయి. మూవీలో ఓ జోష్‌ను పెంచాయి. సన్నివేశాలు చాలా రిచ్‌గా చిత్రకరించడంలో సన్ని కూరపాటి తన ప్రతిభను చాటుకొన్నారు. బలమైన కథ, కథనం, సన్నివేశాలు లేకున్నా సినిమాను ఎక్కడా బోర్ లేకుండా శంశాక్ ఉప్పుటూరి తన ఎడిటింగ్ ప్రావీణ్యాన్ని చూపించారు. నిర్మాత కంచెర్ల బాలభాను పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫన్, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే సరదా చిత్రం ఉరుకు పటేల. యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు ఈ సినిమాకు ప్లస్. మంచి పాయింట్‌తో కథను చెప్పే అవకాశం మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. చిన్న సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X