Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ దుబాయ్ సెన్సార్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలతో జోరును కొనసాగిస్తున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున్న నిర్వహించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాపై దుబాయ్ క్రిటిక్ వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌కి చెందిన ఉమేర్ సంధూ ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూను తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమాను దుబాయ్ సెన్సారింగ్ సందర్భంగా చూడటం జరిగింది. సెన్సార్ తర్వాత ఈ సినిమాకు సంబంధించి నా ఫస్ట్ రివ్యూ ఇది. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు హైస్పీడ్‌తో తీసుకొచ్చే వెహికిల్ పవన్ కల్యాణ్.. ఈ సినిమాకు బిగ్‌బాస్ ఆయనే. ఈ సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్‌ను మరొకరిని ఊహించుకోలేదు. మరొకరు చేయలేరు అని తన రివ్యూలో పేర్కొన్నారు.

Ustaad Bhagat Singh Movie Review by Umair Sandhu

ఈ సినిమాతో మరోసారి తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను దోచుకొంటాడు. ఈ చిత్రంలో శ్రీలీల హాట్ హాట్‌గా కనిపించింది. మాస్‌కు నచ్చే విధంగా మాస్ అంశాలు చాలా ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ సినిమాను పెద్ద హిట్ చేసేందుకు ఉపయోగపడుతాయి అని ఉమేర్ సంధూ తన రివ్యూలో జడ్జిమెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఎంట్రీ అదిరిపోతుంది. ఈ సినిమా హిట్ ఫార్ములా ఏంటి? అంటే పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్.. ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అని చెబుతాను. భారీ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను దట్టించారు. సినిమా గేమింగ్ రూల్స్ మార్చే చిత్రంగా నిలుస్తుంది. పండుగ సెలవులను టార్గెట్ చేసుకొనే వస్తున్న సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే దమ్ము ఉంది అని ఉమేర్ సంధూ తన అభిప్రాయాన్ని చెప్పారు.

ఉస్తాద్ భగత్ సింగ్ స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్. పవర్ ప్యాక్డ్ స్టోరీ. పవన్ పవర్ క్లాస్ పెర్ఫార్మెన్స్. రాశీ ఖన్నా అందంగా కనిపించింది. ఈ సినిమా తప్పకుండా ఫెస్టివల్ ధమాకా అవుతుంది. థియేటర్‌లో ప్రతీ డైలాగ్‌కు ఈలలు పడటం ఖాయం. ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిగా పైసా వసూలు మూవీ. ఈ సినిమాకు నా రేటింగ్ 4/5. తప్పకుండా ఈ సినిమాను చూడండి.. డొంట్ మిస్ అంటూ ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో ఏకపక్షంగా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.

అయితే ఉమేర్ సంధూ వెల్లడించే రివ్యూల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆయన చెప్పే కొన్ని రివ్యూలకు, రిజల్ట్‌కు పొంతన ఉండదు. భారీ హిట్ అని చెప్పిన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. డిజాస్టర్లు అని చెప్పిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. కాబట్టి ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X