Ustaad Bhagat Singh Public Talk: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పబ్లిక్ టాక్.. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh Public Talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించగా, మరో కీలక పాత్రలో రాశీ ఖన్నా కనిపించారు.అలాగే గౌతమీ, అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, నర్రా శ్రీను, నాగ మహేష్, రెడిన్ కింగ్స్‌లే, టెంపర్ వంశీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా, మాస్ ఆడియన్స్‌లో ఈ మూవీకి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్. థమన్ సమకూర్చారు. సినిమాటోగ్రఫీని ఆయనంకా బోస్ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను కార్తీక్ శ్రీనివాస్ చేపట్టారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోలు పూర్తయిన తర్వాత ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

Ustaad Bhagat Singh Public Talk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీమియర్ షోలు మొదలైన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వీడియోలు, పోస్టులు చేస్తున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్ హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ప్రారంభం నుంచే మాస్ టోన్ సెట్ అవుతుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సన్నివేశంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేయడం ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చారట. తర్వాత నల్లమల అడవుల్లో జరిగే ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్, చిన్నప్పటి నుంచి హీరో బ్యాక్‌స్టోరీ చూపించడం కథకు స్ట్రాంగ్ బేస్ గా మారిందట.

ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం థియేటర్లలో పండగలా మారిందని, గబ్బర్ సింగ్ రిఫరెన్స్‌తో వచ్చే సీన్‌కు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 'భగవద్గీత... భగత్ గీత'డైలాగ్‌తో హీరో ఎలివేషన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేయడం దర్శకుడు హరీష్ శంకర్ స్టైల్‌ను గుర్తు చేస్తుంది. రాశి ఖన్నా పాత్ర గ్లామర్‌తో పాటు ఎమోషన్ కూడా కలిపి చూపించగా, సత్యం రాజేష్ ట్రాక్ చాలా ఎంటర్టైన్ గా ఉందట. అలాగే ఇతర హీరోల పాటలు, ముఖ్యంగా చిరంజీవి సాంగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయని టాక్.

ఇక ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాకు పెద్ద ప్లస్‌గా చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్- విలన్ ఆర్ పర్తీబన్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ సెట్ చేయడం, ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుందట. ఇక్కడి నుంచి సినిమా పీక్స్‌కి వెళ్తుందన్న ఫీలింగ్ కలిగించిందని ప్రేక్షకులు అంటున్నారు. సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా సీరియస్ మోడ్‌లోకి మారుతుందనీ, శ్రీలీల ఎంట్రీతో కథకు కొత్త ట్రాక్ వస్తుందట. ఆమెతో పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా వర్క్ అయ్యాయని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా నిర్భయ ఘటనను గుర్తు చేసే ఎమోషనల్ సీక్వెన్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉందని టాక్. అలాగే లుంగీ ఫైట్, పోలీస్ స్టేషన్ సీన్స్, మాస్ డైలాగ్స్ అని కలిసి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ లా మూవీ ఉండట.

సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. ప్రతి ఎలివేషన్ సీన్‌లో బీజీఎం హైలైట్ అవుతుందని పబ్లిక్ టాక్. 'దేఖ్ లేంగే సాలా' వంటి పాటలు థియేటర్లలో హై ఎనర్జీ తీసుకొచ్చాయని చెబుతున్నారు. డ్యాన్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ స్టెప్పులు అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా నిలిచాయంట. క్లైమాక్స్ విషయానికి వస్తే.. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొంత డిఫరెంట్ టచ్ ఇచ్చారని చెబుతున్నారు. టెర్రరిస్ట్ బ్యాక్‌డ్రాప్, దేశభక్తి ఎలిమెంట్స్‌తో క్లైమాక్స్‌ను ముగించడం మరో హైలెట్ అనే అభిప్రాయపడుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మొత్తం సినిమాను మోస్తుందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇక కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం కొన్ని సీన్లు రొటీన్‌గా అనిపిస్తున్నాయని అంటున్నారు. ఇలా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటాడో? ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X