Ustaad Bhagat Singh Critic Review: ఉస్తాద్ భగత్ సింగ్ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్

పవర్ స్టార పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్‌: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి బాలీవుడ్ సింగర్, క్రిటిక్ తన షార్ట్ రివ్యూను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ సినిమాపై వెల్లడించిన అభిప్రాయం ఏమిటనే విషయానికి వస్తే..

Ustaad Bhagat Singh Critic Review

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. దానికి తోడుగా ఇటీవల రిలీజైన టీజర్, ఎత్తరా కాలర్ అనే పాట కూడా ఆడియెన్స్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా సానుకూలంగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొంటున్నది. ఈ క్రమంలో హిందీ డబ్బింగ్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాను సెన్సారింగ్ సందర్భంగా చూసిన నటుడు, క్రిటిక్ కుల్దీప్ గాడ్వీ తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

సెన్సార్ బోర్డు రివ్యూ సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ కలిగింది. పవన్ కల్యాణ్ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడమే కాకుండా ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో స్క్రీన్‌పై అగ్గిపుట్టించాడు అని ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఇక పవన్ కల్యాణ్‌కు తోడుగా శ్రీలీల, రాశీ ఖాన్నా గ్లామర్‌తో అదరగొట్టారు. వారి చార్మింగ్ ఎలిమెంట్ ఈ సినిమాకు సాలిడ్‌గా వర్కయింది. హరీష్ శంకర్ స్టోరీ చెప్పిన విధానం ఊరమాస్‌గా ఉంది. ఈ సినిమాపై నా ఫైనల్ జడ్జిమెంట్ ఏమిటంటే.. పవర్ ప్యాక్డ్ సినిమా. ఈ సినిమాకు నా రేటింగ్ 4.5 అంటూ ట్వీట్‌లో సంక్షిప్తంగా ఈ సినిమాను సమీక్షించారు.

కుల్దీప్ గాధ్వీ విషయానికి వస్తే.. హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో జానపద గాయకుడు. నటుడిగాను రాణిస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని పాపులర్ సినిమాలను చూసి తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అయితే ఈ సినిమా ఎక్స్‌క్లూజిక్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X