Ustaad Bhagat Singh Twitter Review: ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్రీమియర్ షోలు పూర్తయిన తర్వాత ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ మాస్ సీన్లు ఉన్నాయి. ఈ రేంజ్‌లో సినిమాను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హరీష్ స్క్రీన్ ప్లే, థమన్ బీజీఎం, పవన్ చెప్పిన డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో చాలా సీన్లలో గూస్‌బంప్స్ వచ్చేలా ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కింద చూపించిన సీన్‌లో పవన్ కల్యాణ్ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాటకు పవన్ కల్యాణ్ వేసిన డ్యాన్స్ బాగుంది. ఇక సినిమా థియేటర్లలో వాతావరణం అదిరిపోతుంది అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫైనల్‌గా ఉస్తాద్ భగత్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టేశాం. థ్యాంక్స్ హరీష్ స్వామి, మళ్లీ మా బాబాయ్‌ని ఇలా చూస్తామని అనుకోలేదు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ బాల్యంలో వచ్చే సీన్లు బాగా రాశారు. పవర్ స్టార్ ఎంట్రీ సీన్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ బాగా పోతున్నది. హరీష్ శంకర్‌ను తక్కువ అంచనా వేసినందుకు సారీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అభిమానులకు ఎలా చూపించాలో హరీష్ శంకర్ బాగా తెలుసు. 5 నిమిషాలపాటు సాగే ఈ సీన్ చూస్తే నాకే కన్నీళ్లు వచ్చాయి. ఇక ఫ్యాన్స్‌కు పండుగే. ఇలాంటి పవన్ కల్యాణ్ వింటేజ్ వైబ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ అవుట్ డేటెడ్ స్టోరీ. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. మిగితాది రొటీన్, రెగ్యులర్ సినిమానే. కామెడీ సీన్లు పెద్దగా వర్కవుట్ కాలేదు. కమర్షియల్ ఎలిమెంట్ సీన్లు కూడా ఎప్పటివో పాతవి అంటూ వెంకీ రివ్యూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సెకండాఫ్ ఎక్సలెంట్. హరీష్ అన్నా నీకు సారీ. ఎందుకంటే నిన్ను తప్పుగా అర్ధం చేసుకొన్నందుకు. ఫ్యాన్స్‌ను మెప్పించాలంటే నీకే సాధ్యం. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో. యాక్టింగ్, డ్యాన్స్, కామిక్ టైమింగ్, ఎవర్రీథింగ్ కుమ్మి వదిలాడు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశాను. పూర్తిగా ఫ్యాన్స్‌కు ఏం కావాలో అదే స్టఫ్ ఇచ్చేశాడు. సెకండాఫ్ కేక పెట్టించాడు. డీసెంట్ వాచ్. బాబాయ్ హిట్ కొట్టేశాడు అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఉస్దాద్ భగత్ సింగ్ సినిమాలో హైలెట్స్ ఇవే.. పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్, కామెడీ, డ్యాన్స్ సీక్వెన్ైస్, కాలర్ ఎత్తరా సాంగ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, లుంగీ ఫైట్, తొలి ప్రేమ సాంగ్, దేఖ్ లేంగే సాంగ్, డ్రామా పోర్షన్స్ బాగున్నాయి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. గాజు పగిలే కొద్ది పదను ఎక్కుతుంది. గాజు అంటే పదను కాదు.. ఒక సైన్యం సీన్ బాగుంది. సెకండాఫ్‌లో మాస్, క్లాస్, ఎవర్రీథింగ్ పీక్స్. పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ప్యూర్‌గా మాస్ కమర్షియల్ సినిమా. ఈ ఉగాది.. ఉస్తాద్ ఉగాది అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











