For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  V movie రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్
  Director: మోహన కృష్ణ ఇంద్రగంటి

  V Movie Review | ఫస్ట్ హాఫ్ మేజర్ ప్లస్ పాయింట్..!! || Oneindia Telugu

  దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మూవీస్ డిఫరెంట్‌గా ఉంటాయనే కొత్తగా చెప్పనక్కర్లేదు. గ్రహణం, అష్టా చమ్మ నుంచి సమ్మోహనం వరకు విభిన్నమైన కథాంశం, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అయితే ఇక తాజా సినిమా V మూవీ విషయానికి వస్తే తన రూట్ మార్చి కొత్తగా ట్రై చేశారనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగానే నానిని విలన్‌గా, సుధీర్ బాబును సూపర్ కాప్‌గా చూపించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్‌డౌన్ కారణంగా థియేటర్‌కు రాలేకపోయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో రిలీజైంది. నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరీ, నివేదా థామస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే..

  V మూవీ కథ

  V మూవీ కథ

  డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) హైదరాబాద్‌లో పవర్‌ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రచయితగా మారిన అపూర్వ అనే సైకాలజీ స్టూడెంట్‌తో ప్రేమలో పడుతాడు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకొంటున్న సమయంలో ఊహించని విధంగా ఓ క్రిమినల్ (నాని) జీవితంలోకి ప్రవేశిస్తాడు. వరుస హత్యలు చేస్తూ ఆదిత్యకు సవాల్ విసురుతుంటాడు. ఐదు హత్యలు చేస్తానని సవాల్ విసిరి దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేస్తాడు.

  V మూవీ కథలో ట్విస్టులు

  V మూవీ కథలో ట్విస్టులు

  V అని ఈ సినిమాకు ఎందుకు టైటిల్ పెట్టారు? ఆర్మీ ఆఫీసర్ (నాని) ఎందుకు క్రిమినల్‌గా మారాల్సి వచ్చింది? డీసీపీ అదిత్యనే టార్గెట్ చేసుకొని క్రిమినల్‌ (నాని) హత్యలు చేయడం మొదలుపెట్టారు? క్రిమినల్ ఐదుగురిని ఎందుకు హత్యలు చేయాలనుకొంటాడు? సూపర్ కాప్ ఆదిత్య తనకు ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించాడు. పిల్లి ఎలుక చెలగాటంలా మారిన హత్యల దర్యాప్తు ఎలా సాగింది? అపూర్వ, ఆదిత్య ప్రేమ కథ ఎలా సాగింది? సాహోబా (అదితిరావు హైదరీ) పాత్ర ఎంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

  V మూవీ కథ ఫస్టాఫ్ అనాలిసిస్

  V మూవీ కథ ఫస్టాఫ్ అనాలిసిస్

  పబ్‌లో జరిగే పార్టీలో ఆదిత్య, అపూర్వ కలుసుకోవడంతో లవ్లీగా సినిమా ప్రారంభమవుతుంది. తదనంతరం ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ హత్యతో మూవీని వెంటనే కథలోకి వెళ్లిపోతుంది. క్రిమినల్ (నాని) ఎంట్రీతో కథలో జోష్ పెరుగుతుంది. ఆదిత్య, అపూర్వ మధ్య రొమాంటిక్ సీన్లు, ఆ ఇద్దరి కెమిస్ట్రీ కొత్తగా ఉంటుంది. ఈ మధ్యలో క్రిమినల్, పోలీస్ ఆఫీసర్ మధ్య గేమ్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మధ్యలో నాని తన ఫెర్ఫార్మెన్స్‌తో ఝలక్‌లు ఇవ్వడంతో తొలిభాగంలో డిఫరెంట్ సినిమా చూడబోతున్నామనే ఆసక్తి పెరుగుతుంది. కథలో నాని, సాహెబా (అదితిరావు హైదరీ) ప్రేమకథ మొదలవ్వడం.. ఎపిసోడ్స్ వైజాగ్ నుంచి కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చకచక మారిపోతాయి.

  V సెకండాఫ్ అనాలిసిస్

  V సెకండాఫ్ అనాలిసిస్

  ఇక రెండో భాగంలో కథ రకరకాల మలుపులతో మరింత ఆసక్తిని రేపుతుంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని ఓ అనాథ యువతి సాహెబా (అదితిరావు హైదరీ) ఆర్మీ ఆఫీసర్ ప్రేమ కథ మొదలై ఫటాఫట్ మంటూ పెళ్లి, కాపురం ఎపిసోడ్స్‌తో సినిమా క్రైమ్ నుంచి ఫీల్‌గుడ్ మోడ్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకోవడంతో కథ నెక్ట్స్ లెవెల్‌కు చేరినట్టు అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ విలువలపై దృష్టి పెట్టడం మూలంగా సెకండాఫ్‌ మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని ఎమోషనల్స్ పాయింట్స్ జోడించడంతో కథలో ఏదో మ్యాజిక్ జరుగబోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రేక్షకుల అంచనాలను హైజాక్ చేసి.. క్లైమాక్స్‌ను రివర్స్ చేయడంతో పాత్రలపై కలిగిన ఎమోషన్ తగ్గించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్రైమాక్స్ పార్ట్ మరీ రొటీన్‌గా ఉండటం మైనస్‌ అని చెప్పవచ్చు. చివర్లో ఎమోషనల్ టిస్ట్‌తో సినిమాకు జస్టిఫికేషన్ ఇవ్వడంతో ఆ అసంతృప్తి కొంత వరకు తగ్గించే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తున్నది. కాకపోతే చివరి 20 నిమిషాలు మరీ సాగదీసిన ఫీలింగ్ ఏర్పడుతుంది.

  ఇంద్రగంటి మేకింగ్

  ఇంద్రగంటి మేకింగ్

  దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన అభిరుచికి భిన్నంగా ప్రయత్నించడం కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే రేసీగా, ఎంటర్‌టైనింగ్‌గా రాసుకోవడం ఈ సినిమాకు బలంగా మారింది. ఇక సెకండాఫ్‌లో పాతబస్తీ అల్లరు, ప్రధానమైన సమస్యను ప్రేక్షకుల హృదయాలకు తగిలేటట్టు చెప్పడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఒక్కో పాత్రను రాసుకొన్న విధానం, వాటిని డిజైన్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్. వీ సినిమా బాగా అసంతృప్తికి గురిచేసేది క్లైమాక్స్‌. దానిని ఎఫెక్టివ్‌గా చెప్పలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ముంబై ఎపిసోడ్స్ వరకు దర్శకుడిగా పట్టు సాధించిన మోహన కృష్ణ.. పాతబస్తీ ఎపిసోడ్స్ నుంచి కథపై పట్టు సడలిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే డిఫరెట్ సినిమాలను ఆశించే వారికి V మూవీ ద్వారా ఇంద్రగంటి కొత్తగా కనిపిస్తాడు.

  నాని ఫెర్ఫార్మెన్స్

  నాని ఫెర్ఫార్మెన్స్

  నాని పాత్ర విషయానికి వస్తే.. ఆయన అభిమానులకు థ్రిల్లింగే. ఎందుకంటే.. నాని క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. ప్రతీ వేరియేషన్‌ను తన నేచురల్ టాలెంట్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. లవర్‌గా, ఆర్మీ ఆఫీసర్‌గా, క్రిమినల్‌గా, చివరకు ఓ ఫ్రెండ్‌గా కూడా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. ఉన్నంతలో రొమాంటిక్‌గా ఆకట్టుకొంటాడు. ఫస్టాఫ్ అంతా సుధీర్ బాబు కమాండ్ చేస్తే.. సెకండాఫ్‌లో నాని షో సాగుతుంది. నానికి ఇది నిజంగా డిఫరెంట్ సినిమానే అవుతుంది.

  స్టైలిష్‌గా, ఢిఫరెంట్ లుక్‌తో సుధీర్ బాబు

  స్టైలిష్‌గా, ఢిఫరెంట్ లుక్‌తో సుధీర్ బాబు

  సుధీర్ బాబును ఇప్పటి వరకు ఓ రేంజ్‌ యాక్టర్‌గానే చూశాం. కాకపోతే డీసీసీ ఆదిత్య పాత్రలో ఆయన ఫెర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుంది. పూర్తిస్థాయి కమర్షియల్‌ హీరోగా ఈ సినిమాలో కనిపిస్తారు. ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడని చెప్పవచ్చు. సుధీర్ బాబు కెరీర్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారనే ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు కెరీర్ గ్రాఫ్ మరో స్థాయికి వెళ్లుందనే ఫీలింగ్ కలుగుతుంది.

  నివేదా, అదితిరావు హైదరీ పాత్రలు

  నివేదా, అదితిరావు హైదరీ పాత్రలు

  ఇక అపూర్వగా నివేదా థామస్‌కు బబ్లీ క్యారెక్టర్ దక్కింది. చిలిపిగా కవ్విస్తూ.. ఇంటెలిజెంట్ అమ్మాయి షేడ్స్ ఉండే పాత్రలో ఒదిగిపోయింది. సుధీర్ బాబుతో నివేదా థామస్ కెమిస్ట్రీ తెరమీద బాగానే పండిందనే చెప్పాలి. రెండు పాటల్లోనూ నివేదా థామస్ మరింత గ్లామరస్‌గా కనిపించింది. అతిథి పాత్రలో అదితి రావు హైదరీ కనిపించినప్పటికీ.. గుర్తుండి పోయేలా పాత్రను చేసింది. చివర్లలో అదితి తన ఫెర్ఫార్మెన్స్‌తో భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇద్దరు హీరోల మీద స్టోరీ రన్ కావడం వల్ల వీరిద్దరి పాత్రలు వెనుకపడ్డాయనే ఫీలింగ్ కలుగుతుంది.

  పీజీ విందా సినిమాటోగ్రఫి

  పీజీ విందా సినిమాటోగ్రఫి

  సాంకేతిక విభాగాల్లో అత్యధికంగా మార్కులు కొట్టేసింది సినిమాటోగ్రాఫర్ పీజీ విందానే. గత చిత్రాలకంటే విభిన్నంగా సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్, రొమాంటిక్, క్రైమ్ లాంటి యాంగిల్స్ ఉండటంతో చేతినిండా దొరికిన పనికి పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చాడు. డిఫరెంట్ టైప్స్‌లో లైటింగ్ వాడిన విధానం, సన్నివేశాల మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఇక టెక్నికల్ విషయాల్లో థమన్ తన బీజీఎంతో ఎప్పటిలానే ఇరగదీశాడు. అమిత్ త్రివేది అందించిన ఫస్ట్ రెండు పాటలు అలరించాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది.

  ఇక ఫైనల్‌గా..

  ఇక ఫైనల్‌గా..

  దేశానికి రక్షకుడిగా ఉండాల్సిన ఓ వ్యక్తి రాక్షసుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందనేది ఈ సినిమాకు సంబంధించిన బేసిక్ పాయింట్. ఆ క్రమంలో రాక్షసుడిగా మారిన ఓ మంచి మనిషి పోలీస్ ఆఫీసర్‌ను ఎందుకు టార్గెట్ చేసుకొన్నారనే విషయం వెనుక ఉన్న అసలు పాయింట్ కాస్త గందరగోళంగా ఉంది. రకరకాల మలుపులతో కథ కలుగాపులగంగా మారిందని చెప్పవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే.. ఒక్కో నటుడి ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు జస్టిఫికేషన్ అని చెప్పవచ్చు. కథ, కథనాలు వదిలేస్తే నాని, సుధీర్, అదితి, నివేదా యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణంగా మారాయి. ఇంద్రగంటిని కొత్తగా చూడాలనుకొనే వారికి V కేరాఫ్ అడ్రస్. చివరగా అంచనాలను మీట్ అయిందా అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  నాని, సుధీర్ బాబు, అదితి, నివేదా
  పీజీ విందా సినిమాటోగ్రఫి
  ఎస్ థమన్ బీజీఎం
  కథ

  మైనస్ పాయింట్స్
  కథనంలో లోపాలు
  సెకండాఫ్‌
  ఎమోషనల్ పాయింట్స్ ఎఫెక్టివ్‌గా చెప్పలేకపోవడం
  కొంత సాగదీత

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్, నాజర్, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి
  రచన, దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
  నిర్మాత: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి
  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్ థమన్
  మ్యూజిక్: అమిత్ త్రివేది
  సినిమాటోగ్రఫిం పీజీ విందా
  ఎడిటింగ్: మర్తాండ్ కే వెంకటేష్
  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  రిలీజ్ డేట్: 2020-09-05

  English summary
  Natural Star Nani's 25th movie is V. This movie is Directed by Indraganti Mohana Krishana, Produced by Dil Raju. This movie set to release on September 5th on Amazon prime video. On this occasion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X