Annagaru Vostaru First Review: అన్నగారు వస్తారు ఫస్ట్ రివ్యూ
సౌత్ స్టార్ కార్తీ హీరోగా దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం వా వాతియార్. ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనందరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫిని, వెట్రే కృష్ణన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను సెన్సార్ అధికారులు వీక్షించి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తమిళంలో వా వాతియార్, తెలుగులో అన్నగారు వస్తారు సినిమాను ఇటీవల సెన్సార్ రివ్యూ జరిగింది. ఈ సినిమాను సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాకు స్వల్ప మార్పులు చేయాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు వాటిని చిత్ర యూనిట్ అడ్రస్ చేసింది. సెన్సార్ సూచనలను పాటించడంతో ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. క్లీన్ మూవీగా ఈ చిత్రానికి క్లీన్ సర్టిఫికెట్ లభించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నది.
ఇక ఈ సినిమాను అన్నీ రకాలుగా రివ్యూ చేసిన సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి యూఏ (U/A 7+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 7 సంవత్సరాలు దాటిన పిల్లలు ఈ సినిమాను చూడటానికి అనుమతి ఇచ్చారు. ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉండే వారు తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడటానికి వీలు ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో నిబంధనల్లో పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా నిడివి ఎక్కువగా, తక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని రెండు గంటలపాటు వినోదంగా రూపొందించారనేది రన్ టైమ్ చూస్తే తెలిసిపోయంది. ఈ సినిమా నిడివి 130 నిమిషాలు. అంటే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. పక్కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. కార్తీ మరోసారి డిఫరెంట్ రోల్‌లో పెర్ఫార్మ్ చేశారు. కార్తీ, కృతి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందనే విషయం గురించి సెన్సార్ అధికారులు పాజిటివ్‌గా చెప్పారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక మూవీ గురించి కార్తీ మాట్లాడుతూ.. అన్నగారు వస్తారు చిత్ర కథ ఒక ఊహా ప్రపంచంలో జరుగుతుంటుంది. ఇలాంటి గొప్ప పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక సవాల్ లాంటి సినిమా. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పాత్రలో నటించాను. ఇలాంటి టఫ్ సినిమాలను చేసినప్పుడే మనం నెక్ట్స్ లెవెల్ కు వెళ్లగలం అనిపించింది. బాగా నటించాననే అనుకుంటున్నా. మీ అందరికీ మా మూవీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా మరోసారి చేయడం కష్టం. కొత్తదనం లేని సినిమాలు మీ ముందుకు తీసుకురావాలంటే భయపడతాను. సత్యం సుందరం సినిమా వచ్చినప్పుడు ఆ మూవీని తెలుగు ప్రేక్షకులు, మీడియా ఎంతగా సెలబ్రేట్ చేశారో చూశాను. ఆ క్రమంలో మరో డిఫరెంట్ సినిమాను తీసుకొస్తున్నామని చెప్పగలను. ఇలాంటి కొత్త తరహా చిత్రాలు నా దగ్గరకు రావడం అదృష్టంగా భావిస్తున్నా అని కార్తీ అన్నారు.


Click it and Unblock the Notifications











