Vaarasudu review ఎమోషనల్ రైడ్.. విజయ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా!

Rating 2.75/5

నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సంగీత, జయసుధ, శరత్ కుమార్, యోగిబాబు తదితరులు
కథ, దర్శకత్శం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
సినిమాటోగ్రఫి కార్తీక్ పళని
సంగీతం: థమన్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-01-14

వారసుడు కథ గురించి

వారసుడు కథ గురించి

రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాజేంద్ర పర్వతనేని (శరత్ కుమార్, జయసుధ) దంపతులకు జయ్, అజయ్, విజయ్ (శ్రీకాంత్, శ్యామ్, విజయ్) ముగ్గురు కుమారులు, జయ్, అజయ్ ఇద్దరు తండ్రి మాటను జవదాటరు. సొంత అభిప్రాయాలు, సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉన్న విజయ్ తండ్రి అభిప్రాయలను వ్యతిరేకిస్తాడు. దాంతో వారి మధ్య అభిప్రాయబేధాలు పెరడగంతో విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కుటుంబానికి దూరంగా బతుకుతుంటాడు. అయితే తల్లిదండ్రుల షష్టిపూర్తికి వచ్చిన విజయ్‌కి తండ్రి క్యాన్సర్ కారణంగా ఎక్కువ రోజులు బతకడని తెలుస్తుంది. ఆ సమయంలోనే కంపెనీ ప్రతిష్ట దిగజారేలా తన సోదరులు జయ్, విజయ్ స్వార్థంతో తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తారు.

వారసుడు మూవీలో ట్విస్టులు

వారసుడు మూవీలో ట్విస్టులు

తండ్రి మరణం తెలిసిన విజయ్ కుటుంబానికి ఎలా అండగా నిలిచారు. తన సోదరుడు కుటుబంలో జరిగిన సమస్యను ఎలా పరిష్కరించాడు. తన తండ్రి బిజినెస్‌ను కూల్చడానికి ఎత్తులు వేసే జేపీ (ప్రకాశ్ రాజ్)కు విజయ్ ఎలాంటి సవాళ్లు విసిరాడు? జేపీతో చేతులు కలిపిన తన బ్రదర్ అజయ్‌కి ఎలా గుణపాఠం నేర్పాడు? తన ప్రియురాలు ప్రియ (రష్మిక మందన్న) తో అఫైర్ ఎలా కొనసాగించాడుముక్కలు చెక్కలైన రాజేంద్ర పర్వతనేని కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేశారనే ప్రశ్నలకు సమాధానమే వారసుడు సినిమా కథ.

ఫస్టాఫ్ ఎమోషన్స్

ఫస్టాఫ్ ఎమోషన్స్

రాజేంద్ర పర్వతనేని కుటుంబ సభ్యుల పరిచయం, కథలోని కీలక పాత్రల ఇండ్రక్షన్‌తో సినిమా ఫీల్ గుడ్ నోట్‌‌తో ముందుకెళ్తుంది. విజయ్ ఫ్యాన్స్‌ను ద‌‌‌‌‌‌‌‌ృష్టి పెట్టుకొని సన్నివేశాలను రాసుకోవడంతో రొటీన్‌గా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కథను బాగానే సాగదీసినట్టు ఫస్టాఫ్ అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లోనే పలు తెలుగు సినిమాలను చూసిన ఫీలింగ్ కలుగుతంది. చక్కటి ఎమోషన్స్‌తో ఫస్టాఫ్‌ను ముగించడం ఉపశమనంగా ఉంటుంది.

సెకండాఫ్‌ ఎలా ఉందంటే?

సెకండాఫ్‌ ఎలా ఉందంటే?

ఇక సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే ఉత్సుకత పెద్దగా కనిపించదు. ఎందుకంటే.. సినిమా క్లైమాక్స్ ఏమిటో ముందే తెలిసిపోవడంతో.. కథను ఎలా ముగించాడు. ఏ రేంజ్‌లో ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశారో చూద్దామని ఫీలింగ్‌తో సెకండాఫ్ మొదలవుతుంది. సెకండాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని సీన్లు సహనానికి పరీక్ష పెట్టించేలా ఉంటాయి. అయితే ప్రీ క్లైమాక్స్‌కు ముందు దర్శకుడు గాడిలో పడినట్టు స్పష్టమవుతుంది. అన్న కూతురు ఎపిసోడ్‌తో కథ సీరియస్ నోట్‌లోకి మారుతుంది. ఇక తండ్రి మరణం గురించి ఫ్యామిలీ అందరికి తెలిసిన తర్వాత కథలో ఎమోషన్స్ ఊపందుకొంటాయి. విజయ్ సినిమాలకు భిన్నంగా క్లైమాక్స్ హార్ట్ టచ్ చేసేలా దర్శకుడు చేసిన ప్రయత్నం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి

దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి

ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో వచ్చిన కథల స్పూర్తితో ఎమోషన్స్ అనే సక్సెస్ ఫార్మూలాతో దర్శకుడు వంశీ పైడిపల్లి రాసుకొన్న కథ పెద్ద ఛాలెంజే. కానీ పాత సినిమాల సీన్లు చూస్తున్నామనే ఫీలింగ్ రాకుండా.. అందమైన వాతావరణం, రిచ్ యాంబియెన్స్, విజయ్ బాడీ లాంగ్వేజ్‌తో కథను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే రాసుకొన్న సీన్లపై ప్రేమ వల్లో ఏమో.. సినిమా నిడివిని అమాంతం పెంచేసి.. టెలివిజన్ సీరియల్‌గా మాదిరి ఫీల్‌ను కలిగించాడు. నిడివిపై కొంత వేటు మీద వేటు.. వేటు మీద వేటు వస్తే.. ఎమోషన్స్ మరింత పండి.. ప్రేక్షకుడు మంచి ఫీల్‌తో వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకొన్నాడనిపిస్తుంది.

విజయ్ యాటిట్యుడ్‌..

విజయ్ యాటిట్యుడ్‌..


విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు, యాటిట్యూడ్‌కు చక్కగా సరిపోయే విధంగా పాత్రను డిజైన్ చేయడంతో ఆ రోల్‌లో ఒదిగిపోవడానికి పెద్ద కష్టపడలేదనిపిస్తుంది. రెగ్యులర్ మేకోవర్, కొత్తగా స్టైల్స్ లేకపోవడంతో సునాయసంగానే తన పాత్రతో చెలరేగిపోయాడు. ఫ్యాన్స్‌ ఏం కావాలో అలాంటి హైస్, మాస్ మసాల అంశాలతో ఆకట్టుకొన్నాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు విజయ్ పాత్ర ఒక ఎమోషనల్ రైడ్. ఆ రైడ్‌ను మంచి ఫీల్‌తో ముగించాడు. ఇక రష్మిక మాత్రం పాటలకే పరిమితమైంది. అరకొర సన్నివేశాలతో అప్పుడు డైలాగ్స్ చెప్పి నేను కూడా ఈ సినిమాలో ఉన్నానే ఫీలింగ్ కలిగించింది.

జయసుధ, శరత్, ప్రకాశ్ పాత్రలు

జయసుధ, శరత్, ప్రకాశ్ పాత్రలు

మిగితా పాత్రల విషయానికి వస్తే.. జయసుధ, శరత్ కుమార్ మరోసారి మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ప్రకాశ్ రాజ్‌ది రెగ్యులర్ విలన్ ఛాయలు ఉన్న పాత్రతో తన వంతు న్యాయాన్ని కథకు చేశాడు. శ్రీకాంత్, కిక్ శ్యామ్ కథకు బలంగా ఉండే పాత్రల్లో ఒదిగిపోయారు. తమకు స్కోప్ ఉన్నంత వరకు తమ పాత్రలను ఎలివేట్ చేసే ప్రయత్నాన్ని చేశారు. యోగిబాబు అక్కడక్కడ తనదైన మేనరిజంతో నవ్వించాడు. మిగితా పాత్రల్లో వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

వారసుడు టెక్నికల్ అంశాలు

వారసుడు టెక్నికల్ అంశాలు

వారసుడు సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఆర్ట్ విభాగం పనితీరు గొప్పగా ఉంది. ఇంటిసెట్, ఇతర సెట్స్ అద్బుతంగా రిచ్‌గా ఉన్నాయి. సినిమాను అందమైన బొమ్మరిల్లులా కనిపించేలా చేయడంలో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ మంచి ప్రతిభను చూపించాడు. ఇక తమన్ తనదైన శైలిలో తన పనిని కానిచ్చేశాడు. పలు సీన్లను బీజీఎంతో ఎమోషనల్‌గా మార్చాడు. రంజిమే..పద పద పోదాం పాటలు ఆడియోపరంగానే కాకుండా తెర మీద కూడా బాగున్నాయి. దిల్ రాజు, శిరీష్, పీవీపీ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అనవసరంగా అక్కడక్కడ ఖర్చు బాగానే పెట్టారనిపిస్తుంది.

వారసుడు సినిమా ఫైనల్‌గా

వారసుడు సినిమా ఫైనల్‌గా

ఫ్యామిలీ వ్యాల్యూస్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఏ మాత్రం కొత్తదనం లేని సినిమా వారిసు. నాన్నకు ప్రేమతో, అలా వైకుంఠపురం, అజాతవాసి లాంటి సినిమాలు ప్రభావం ఈ సినిమాపై ఉందనే విషయం సగటు ప్రేక్షకుడికి కూడా అర్ధమవుతుంది. కాకపోతే తండ్రి కొడుకు, తల్లి, కొడుకు, అన్నాదమ్ముల మధ్య ఎమోషన్స్ మళ్లీ ఈ సినిమాకు వర్కవుట్ అయ్యాయనే చెప్పవచ్చు. సంకాంత్రి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూడటానికి వీలున్న సినిమా ఇది. కత్తులతో నరకడం, తుపాకుల కాల్పుల హల్‌చల్ మధ్య.. ఎమోషన్స్‌తో గుండె చప్పుడు వినిపించే రెగ్యులర్ సినిమా ఇది. అంచనాలు లేకుండా వెళితే.. మంచి ఫీల్‌గుడ్ ఉన్న చూశామనే సంతృప్తి కలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X