Vadhuvu Review చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ఆకట్టుకొందా? వధువు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Rating: 2.75/5
నటీనటులు: అవికా గోర్, నందు, అలి రెజా, వీఎస్ రూపాలక్ష్మి, శుభశ్రీ రాయ్ తదితరులు
దర్శకత్వం: పోలూరు కృష్ణ
నిర్మాత: ఎస్‌వీఎఫ్
మ్యూజిక్: శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫి: రామ్ కే మహేష్
ఆర్ట్ డైరెక్టర్: షర్మేలా
ఎడిటర్: అనిల్ కుమార్
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
రిలీజ్ డేట్: 2023-12-08
వధువు వెబ్ సిరీస్‌కు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పాజిటివ్ అంశాలు. రామ్ కే మహేష్ అందించిన సినిమాటోగ్రఫి పాత్రలు, సన్నివేశాల మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఇక శ్రీరామ్ మద్దూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను థ్రిల్లింగ్‌గా మార్చాయి. ఎడిటింగ్, ఆర్ట్ తదితర విభాగాల పనితీరు కూడా బాగుంది. సస్పెన్స్, థ్రిల్లర్ మూవీకి కావాల్సిన హంగులను సమకూర్చడమే కాకుండా వెబ్ సిరీస్‌ను ఎస్‌వీఎఫ్, డిస్నీ హాట్ స్టార్ రిచ్‌గా నిర్మించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఇందు (అవిక గోర్) పీటల మీద పెళ్లి ఎత్తిపోవడంతో ఆమెతోపాటు ఫ్యామిలీ షాక్ గురవుతుంది. ఏడాది తర్వాత ఆనంద్ (నందూ)తో వివాహం నిశ్చయం జరుగుతుంది. పెళ్లికి ప్రాణాంతకంగా ఉండే ఉమ్మెత్త ఆకును బహుమతిగా పంపిస్తారు. అయితే పెళ్లి తర్వాత అత్తారింటిలో ఇందుకు రకరకాల సమస్యలు ఎదురవుతాయి. తన మరిది ఆర్య (అలీ రెజా) భార్య అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతుంది. అత్తారింటిలో ఓ యువతిని గదిలో బంధిస్తారు. ఇలాంటి సమస్యల మధ్య మరిది భార్య కేసు విచారణకు ఇందును పిలుస్తారు.
ఇందు మొదటి పెళ్లి పీటల మీద ఎత్తి పోవడానికి కారణం ఏమిటి? ఆనంద్‌తో వివాహానికి ఎవరు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు? ఆర్య భార్య ఎందుకు ఇంట్లో నుంచి పారిపోయింది? ఆర్య భార్యను వెతుకుతూ ఇందు ఎందుకు వెళ్లింది? ఆర్య భార్య ఎలాంటి పరిస్థితుల్లో మరణించింది. అత్తారింటిలో యువతిని గదిలో ఎందుకు బంధించారు? ఆర్య భార్య కేసు విచారణకు హాజరైన ఇందుకు ఎలాంటి సమస్య ఎదురైంది అనే ప్రశ్నలకు సమాధానమే వధువు వెబ్ సిరీస్ కథ.

పెళ్లి కూతురుగా ఇందు ముస్తాబై పీటలకు మీదకు వెళ్లిపోయే సమయంలో ఓ సంఘటనతో వివాహం క్యాన్సిల్ కావడమనే సన్నివేశంతో వధువు వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. రకరకాల ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌తో రెండు, మూడు ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతుంది. అత్తారింటిలో సన్నివేశాలు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అయితే ఆర్య భార్య ఏమైందనే సింగిల్ పాయింట్‌తో కథను సాగదీసిన తీరు బోర్‌గా ఉండటమే కాకుండా స్టోరీ వేగానికి బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే పార్ట్ వన్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టు రెండో పార్ట్ కోసం ఎదురు చూసేలా చేసింది.

ఇందుగా అవికా గోర్ మరోసారి ఇంటెన్స్ రోల్‌తో ఆకట్టుకొన్నది. రకరకాల భావోద్వేగాలు ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో తన టాలెంట్‌తో ఆకట్టుకొన్నది. ఇక నందు కూడా కథకు బలంగా ఉండే పాత్రలో మెప్పించాడు. నందూ, అవికా గోర్ తమ పాత్రలతో వెబ్ సిరీస్ భారాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తమ భుజాలకు ఎత్తుకొన్నారని అనిపిస్తుంది. అలి రెజా కూడా ఓ ఎమోషనల్ రోల్ గుర్తుండిపోతారు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపిస్తారు.
ఇందు బెంగాళీ భాషలో రూపొందిన వెబ్ సిరీస్‌కు రీమేక్. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల కలబోసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అక్కడక్కడా స్లోగా, సాగదీసినట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కథలో ఉండే కొన్ని ట్విస్టులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. థ్రిలర్ సినిమాలను ఇష్టపడే వారికి వధువు నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











