twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వజ్ర కవచధర గోవింద మూవీ రివ్యూ అండ్ రేటింగ్: సప్తగిరి ఊర మాస్

    |

    Rating:
    3.0/5
    Star Cast: సప్తగిరి, వైభవి జోషి, వేద అర్చన శాస్త్రి
    Director: అరుణ్ పవార్

    కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలతో తన సత్తాను చాటుకొన్నారు. హీరోగా తన మూడో చిత్రం వజ్రకవచధర గోవింద చిత్రంతో ముందుకొచ్చారు. హ్యాట్రిక్ కొట్టడానికి దర్శకుడు అరుణ్ పవార్‌తో రెండోసారి జతకట్టాడు. వైభవి జోషి హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి అర్చన వేద ఓ కీలకపాత్రలో కనిపించారు. జీవిఎన్ రెడ్డి, ఎడల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జబర్దస్త్ టీమ్ సభ్యులు చేరికతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. వజ్రకవచధార గోవింద చిత్రం సప్తగిరికి హ్యాట్రిక్‌ను అందించిందా? స్పెషల్ పాత్రతో అర్చన ఆకట్టుకొన్నదా? వైభవి జోషి అందాల ఆరబోత ప్రేక్షకులను అలరించిందా? దర్శకుడు అరుణ్ పవార్‌ ద్వితీయ విఘ్నాన్ని దాటించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ ఏమిటంటే

    కథ ఏమిటంటే

    గోవిందు (సప్తగిరి) ఓ చిల్లర దొంగ. తన ఊరికి ఓ సమస్య రావడంతో దొంగగా మారుతాడు. గ్రామ సమస్యను తీర్చుతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మి (అర్చన) మోసం చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతాడు. ఇలాంటి సమయంలో నిధుల కోసం వేటాడే ముఠా తారసపడుతుంది. వారితో కలిసి వేట మొదలుపెట్టిన గోవిందుకు ఓ అరుదైన వజ్రం లభిస్తుంది

    వజ్ర కవచధర ట్విస్టులు

    వజ్ర కవచధర ట్విస్టులు

    గోవిందుకు లభించిన వజ్రం తన గ్రామ సమస్యకు పరిష్కారం చూపిందా? ఆ వజ్రం గోవిందుకు ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది?. ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మి మనుసు మార్చడానికి గోవిందు ఏం చేశాడు? జబర్దస్త్ టీం ఏ మేరకు హాస్యాన్ని పండించింది. వైభవి జోషి అందచందాలు ఆకట్టుకొన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానమే వజ్ర కవచధర గోవింద చిత్రం.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    వజ్ర కవచ ధర తొలిభాగం పలు భావోద్వేగ అంశాలతో నిండిందని చెప్పవచ్చు. గ్రామంలో నెలకొన్న సమస్య చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. అలాగే సీనియర్ నటి అర్చన క్యారెక్టర్ సినిమాలో ఓ ట్విస్ట్‌గా మారుతుంది. సప్తగిరి తన మార్కు ఫెర్పార్మెన్స్‌తో ఆకట్టుకోగా, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ కామెడీ సినిమాను ముందుకు తీసుకెళ్లింది. తొలి భాగం ఎమోషనల్ అంశాలతో ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగం ఊరమాస్ కామెడీతో హంగామాగా సాగుతుంది. జబర్దస్త్ అవినాష్, గెటప్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్ ఉల్లి, రాకెట్ రాఘవ, ఆర్పీ, నల్ల వేణు ఇతర కమెడియన్స్ తమదైన శైలిలో హాస్యాన్ని పండించారు. అయితే కొంత కథ సాగదీసినట్టు ఉండటం మైనస్ పాయింట్. నాటు కామెడీ‌తో ముగింపు సినిమాను రొటీన్‌గా మలిచింది.

     అరుణ్ పవార్ డైరెక్షన్

    అరుణ్ పవార్ డైరెక్షన్

    సప్తగిరి ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా రాసుకొన్న సన్నివేశాలతో దర్శకుడు అరుణ్ పవార్ తొలిభాగాన్ని చకచకా పరుగులు పెట్టించారు. ఇంటర్వెల్‌కు ముందు ఫైట్స్ మోతాదు కొంత భారంగా అనిపిస్తుంది. ఇక రెండో భాగంలో మతిమరుపు ఎపిసోడ్స్, విలన్లతో కొన్ని సీన్లను చక్కగా హ్యాండిల్ చేశారు. జీటీఆర్ మహేంద్ర అందించిన కథను ఎమోషనల్‌గా మలచడంలో పూర్తిగా సఫలమయ్యాడు. సప్తగిరితో మితిమీరిన సీన్లు, ఫైట్లు చేయించకుండా కంట్రోల్‌గా సినిమాను తెరకెక్కించడం ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది.

     సప్తగిరి ఫెర్ఫార్మెన్స్

    సప్తగిరి ఫెర్ఫార్మెన్స్

    హీరోగా సప్తగిరి మరోసారి అదరగొట్టారు. భావోద్వేగ సన్నివేశాల్లో సప్తగిరి ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. రొమాన్స్‌కు పెద్దగా చోటులేకపోయినా.. ఉన్నంతలో ప్రేక్షకులను సంతృప్తిని కలిగించాడని చెప్పవచ్చు. దొంగగా, స్వామిగా, పిచ్చివాడిగా, ప్రేమికుడిగా, గ్రామం కోసం తపించే యువకుడిగా పలు షేడ్స్‌లో రాణించాడు. గోవిందు పాత్రకు సప్తగిరి పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. హాస్యంతో కూడిన ఎమోషనల్‌ రోల్‌లో ఒదిగిపోయాడు. సినిమాను మొత్తంగా తన భుజాలపై నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

     అర్చన, వైభవీ జోషి యాక్టింగ్

    అర్చన, వైభవీ జోషి యాక్టింగ్

    ఇక మిగితా పాత్రల్లో వైభవి జోషి ఎక్కువగా ఆటపాటలకే పరిమితమైంది. మగరాయుడిగా కొన్ని సీన్లలో ఆకట్టుకొన్నది. నటనపరంగా, గ్లామర్ పరంగా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎమ్మెల్యే పాత్రలో అర్చన ప్రేక్షకులకు ఓ ఝలక్. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అర్చన.. భారమైన పాత్రలో కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు అర్చన ఆకట్టుకొన్నారు.

    జబర్దస్త్ కామెడీ బ్యాచ్

    జబర్దస్త్ కామెడీ బ్యాచ్

    వజ్ర కవచధర గోవింద చిత్రం ఊర మాస్ చిత్రం. ఈ చిత్రంలో హాస్యాన్ని పూర్తిగా పడించే బాధ్యతను అవినాష్ ఎత్తుకొన్నాడు. పలు సన్నివేశాల్లో అవినాష్, అప్పారావు వేసిన పంచులు, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ బ్రహ్మండంగా పేలాయి. గెటప్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, రాకెట్ రాఘవ, నరేష్, అతిథి పాత్రల్లో మెరిసారు. ఈ సినిమాకు విలన్లు మైనస్. విలన్‌గా టెంపర్ వంశీ ఫర్వాలేదనించాడు.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌గా

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బుల్గానిన్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ సీన్లకు బలంగా మారింది. ప్రవీణ్ వనమాలి అందించిన సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ సీన్లను చక్కగా తెరకెక్కించారు. కర్నూలు గుహాలో ఆయన తీసిన రిస్కీ షాట్స్ బాగున్నాయి. కిషోర్ మద్దాలి కత్తెరకు ఇంకా కొంత పదునుపెట్టాల్సింది. ఫస్టాఫ్‌లో కొంత, సెకండాఫ్‌లో కొన్ని సీన్ల నిడివిని తగ్గిస్తే మరింత ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. నిర్మాతలు జీవిఎన్ రెడ్డి, ఎడల నరేంద్ర, బ్రహ్మయ్య సినిమాను చాలా రిచ్‌గా రూపొందించారు. ఇండస్ట్రీకి కొత్త అయినప్పటికీ నిర్మాణ విలువలను చక్కగా పాటించారు.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    సప్తగిరి
    జబర్దస్త్ కమెడియన్లు
    కథ, కథనాలు
    అరుణ్ పవార్ డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    విలనిజం
    సెకండాఫ్‌లో స్లో నేరేషన్

     తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: సప్తగిరి, వైభవి జోషి, అర్చన, అవినాష్, అప్పారావు, టెంపర్ వంశీ, గెటప్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, రాకెట్ రాఘవ, నరేష్ తదితరులు

    దర్శకత్వం: అరుణ్ పవార్
    కథ: జీటీఆర్ మహేంద్ర
    నిర్మాతలు: జీవిఎన్ రెడ్డి, ఎడల నరేంద్ర
    మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
    సినిమాటోగ్రఫి: ప్రవీణ్ వనమాలి
    ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
    రిలీజ్: 2019-06-14

    తుదితీర్పు

    తుదితీర్పు

    వజ్ర కవచధర గోవింద చిత్రం పక్కా మాస్ కామెడీ చిత్రం. జబర్దస్త్ లాంటి హస్యాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. పక్కాగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన చిత్రమని చెప్పవచ్చు. ఏ క్లాస్, మల్టీ‌ప్లెక్స్ ప్రేక్షకులకు ఆదరిస్తే కమర్షియల్‌గా మరింత మైలేజ్ లభిస్తుంది. నాటు, ఊరమాస్ కామెడీని నచ్చే వారికి ఈ సినిమా ఊరటనిస్తుంది.

    English summary
    Saptagiri's latest movie Vajra Kavachadhara Govinda. Vaibhavi joshi is the lead heroine in this movie. Produced bY Narendra Edala, GVN Reddy. Directed by Arun Pawar. Music by Bulganian. This movie hits screens on June 14.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X