వకీల్ సాబ్ మూవీ ఫస్ట్ రివ్యూ: పవన్ కల్యాణ్ మైండ్ బ్లోయింగ్.. 100 కోట్లు గ్యారెంటీ.. బ్లాక్‌బస్టర్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత తెలుగు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వకీల్ సాబ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, కథనాలు దాదాపు అందరికి తెలిసినప్పటికీ.. పవన్ కల్యాణ్ చేయబోయే మ్యాజిక్ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగు సినిమాలపై ట్విట్టర్ రివ్యూ ఇచ్చే క్రిటిక్ ఉమేర్ సంధూ తాజాగా వకీల్ సాబ్‌తో ముందుకొచ్చారు. ఈ సినిమాపై ట్వీట్ల వర్షం కురిపిస్తూ...

పవర్‌ఫుల్ మెసేజ్‌తో

పవర్‌ఫుల్ మెసేజ్‌తో


ఓవర్సీస్ సెన్సార్ బోర్డు కోసం ప్రదర్శించిన వకీల్ సాబ్ మూవీని చూశాను. నటీనటుల హై ఫెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఓ రకమైన షాక్ గురిచేస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత నా నోట మాటలు రాలేదు. పవర్‌ఫుల్ మెసేజ్‌తో వస్తున్న వకీల్ సాబ్‌ను మిస్ చేసుకోకండి అంటూ ఉమేర్ సందూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ అత్యున్నత పెర్ఫార్మెన్స్

పవన్ కల్యాణ్ అత్యున్నత పెర్ఫార్మెన్స్


వకీల్ సాబ్‌ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన, స్టైల్‌ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ సినిమాను తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యున్నత పెర్ఫార్మెన్స్‌ను చూడటం ఖాయం. ఏ విషయంలోనూ ఈ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. తొలిభాగం కొంచెం స్లోగా నడిచినా.. సినిమా అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది అని ఉమేర్ సందూ తెలిపారు

టాలీవుడ్ కోర్టు డ్రామాలో ది బెస్ట్

టాలీవుడ్ కోర్టు డ్రామాలో ది బెస్ట్


ఇప్పటి వరకు టాలీవుడ్‌లో వచ్చిన కోర్డు డ్రామా చిత్రాల్లో వకీల్ సాబ్ బెస్ట్. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజు తమ నటనతో చించేశారు. వాళ్ల పెర్ఫార్మెన్స్ మరో రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో రిచ్ కంటెంట్ ఉంది. కథ వల్ల కొంత డల్‌గా అనిపిస్తుంది. అవన్నీ పక్కన పెడితే వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అంటూ ఉమేర్ సంధూ తన రివ్యూను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

కోవిడ్ పరిస్థితుల్లో 100 కోట్లు

కోవిడ్ పరిస్థితుల్లో 100 కోట్లు

వకీల్ సాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం. కోవిడ్ పరిస్థితుల్లో మాస్టర్ మూవీ తర్వాత 100 కోట్లు సంపాదించే సినిమాగా వకీల్ సాబ్ నిలుస్తుంది. మరోసారి చెబుతున్నా.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్టింగ్ చూస్తే మంత్రముగ్దులు అవ్వడం గ్యారెంటీ అంటూ ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

Recommended Video

Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
వకీల్ సాబ్ మూవీ మైండ్ బ్లోయింగ్

వకీల్ సాబ్ మూవీ మైండ్ బ్లోయింగ్


వకీల్ సాబ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిలిం. గ్రాండ్‌గా టాలీవుడ్‌కు కమ్ బ్యాక్ అవుతున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పడానికి ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటూ ఉమేర్ సంధూ ట్వీట్ల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X