For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vakeel saab movie రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు
  Director: శ్రీరాం వేణు

  Recommended Video

  Vakeel Saab Review : Pawan Kalyan పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్... సమస్యలను వేలెత్తి చూపించే కంటెంట్!!

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెర పైకి వస్తుండటంతో వకీల్ సాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పింక్ కథను తెలుగు నేటివిటికి, పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్టుగా మార్చామనే మాటతో సినిమాపై మరింత కుతూహలం కలిగింది. భావోద్వేగమైన పింక్ కథకు ఎలాంటి రంగులు అద్దారు? పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్టుగా ఎలాంటి మార్పులు చేశారు.. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే విషయాలను మనం చర్చించుకొందాం..

  వకీల్ సాబ్ కథ

  వకీల్ సాబ్ కథ

  పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ల) హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్. నగరానికి దూరంగా కారు పాడవడంతో ఈ ముగ్గురు యువతులు ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) బంధువు వంశీతోపాటు మరో ఇద్దరు యువకులను కలుస్తారు. ప్రకృతి అనే రిస్టారుకు వెళ్లిన సమయంలో జరిగిన గొడవలో వంశీ గాయపడటం, ముగ్గురు యువతులు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీ మనుషులు ముగ్గురు యువతులపై అక్రమ కేసులు బనాయించడంతో కోర్టులో సస్పెండ్ అయిన వకీల్ సాబ్ సత్యదేవ్‌ (పవన్ కల్యాణ్) కలుస్తారు.

  కథలో ట్విస్టుల గురించి

  కథలో ట్విస్టుల గురించి


  ప్రకృతి అనే రిసార్డులో వంశీ బ్యాచ్‌కు ముగ్గురు యువతులకు మధ్య ఏం జరిగింది? వంశీ తలకు బలమైన గాయం ఎందుకైంది. ఎంపీ రాజేంద్ర వర్గం ముగ్గురు యువతులపై ఎందుకు కేసులు పెట్టారు. ఏ పరిస్థితుల్లో సత్యదేవ్‌ను ముగ్గురు అమ్మాయిలు సహాయం కోరుతారు. ఈ కేసులో టాప్ లాయర్‌ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్)ను ఎందుకు రంగంలోకి దించాల్సి వచ్చింది. కోర్టులో రాజేంద్ర, సత్యదేవ్‌కు మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి. ఈ కథలో శృతి హాసన్ పాత్ర ఏమిటి? చివరకు న్యాయం, ధర్మం ఎవరివైపు నిలబడిందనే ప్రశ్నలకు సమాధానమే వకీల్ సాబ్ సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎనాలిసిస్

  ఫస్టాఫ్ ఎనాలిసిస్

  పింక్‌ సినిమా కథకు గురించి చెప్పాలంటే పక్కాగా ఎమోషనల్ కంటెంట్‌తో కొనసాగుతుంది. కానీ వకీల్ సాబ్‌ విషయానికి వస్తే ఎమోషనల్ కంటెంట్, పవన్ కల్యాణ్ ఇమేజ్, తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలను జొప్పించి ఈ సినిమాను పక్కగా కమర్షియల్‌గా చేర్చారు. ముగ్గురు అమ్మాయిల కుటుంబ నేపథ్యాన్ని మగువ పాటతో పరిచయం చేస్తూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లడం జరుగుతుంది. అలాగే ఒక సామాజిక సమస్యతో పవన్ కల్యాణ్‌ను ఎంట్రీ ఎవ్వడంతో సినిమా ప్రారంభమైన పది నిమిషాల్లో ఓ ధమాకా పేలినట్టు అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో సత్యదేవ్ స్టూడెంట్ లీడర్.. ఆ తర్వాత ప్రజల పక్షాన నిలబడే వకీల్ సాబ్ ఎపిసోడ్స్ చూస్తే జార్జిరెడ్డి, బాలగోపాల్ క్యారెక్టర్లు తెరపైన కనిపిస్తాయి. ఇక సత్యదేవ్ మద్యానికి ఎందుకు బానిసయ్యారు? కోర్టు నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యారనే విషయాలను చెబుతూ తన భార్య (శృతి హాసన్‌)రే ఎందుకు దూరమయ్యారనే అంశాలు రొటీన్‌గా సాగుతాయి. ఇక ఎంపీ రాజేంద్ర ఇంటికి వెళ్లి ఇచ్చిన కౌంటర్‌తో తొలి భాగం పవర్‌పుల్‌గా ముగుస్తుంది.

  సెకండాఫ్‌ ఎలా ఉందంటే

  సెకండాఫ్‌ ఎలా ఉందంటే


  ఇక సెకండాఫ్‌ ఆరంభంలోనే నంద గోపాల్ అలియాస్ నందాజీ ఎంట్రీతో మరింత ఊపందుకొన్నట్టు కనిపిస్తుంది. కోర్టు‌లో నందా, సత్యదేవ్ మధ్య వాదనలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన ఎమోషన్స్, ఆవేదన, సత్యదేవ్ ఆవేశం సినిమాకు కీలకంగా మారుతాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన యాక్షన్ పార్ట్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై వేసిన సెటైర్లు, ఓటమి గురించి చెప్పిన డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకొంటాయి. అయితే పింక్ సినిమా ఆత్మకు ఇబ్బంది కలగకుండా దర్శకుడు శ్రీరాం తీసుకొన్న జాగ్రత్తలు సెకండాఫ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

  దర్శకుడు శ్రీరాం వేణు

  దర్శకుడు శ్రీరాం వేణు

  పింక్ సినిమాను, పవన్ కల్యాణ్‌ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయడమంటే ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు శ్రీరాం వేణు చేసిన మార్పులు, తెలుగు ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు చేసిన మార్పులు ఫర్‌ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. అయితే ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన పొలిటికల్ పంచులు బ్రహ్మండంగా పేలాయి. ఓటమి అవమానం కాదు.. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఓ అవకాశం.. ఓటమి ఎదుటి వాడు డిసైడ్ చేసే అంశం కాదు.. మనల్ని మనం డిసైడ్ చేయాల్సిన విషయం లాంటి డైలాగ్స్‌ ప్రేక్షకులు, అభిమానుల చేత చప్పట్లు కొట్టించేలా దర్శకుడు రాసుకోవడం సినిమా పాజిటివ్‌గా మారాయి. కథాపరంగా ప్రతి మలుపులో దర్శకుడు శ్రీరాం వేణు అనుసరించిన పంథా ఎక్కడా అదుపు తప్పినట్టు కనిపించదు.

  పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్‌గా

  పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్‌గా

  వకీల్ సాబ్ చిత్రంలో సత్యదేవ్‌ పాత్ర పవన్ కల్యాణ్‌కు టైలర్ మేడ్ క్యారెక్టర్, హిందీ, తమిళం సినిమాలతో పోల్చుకొంటే పవన్‌కు పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్ లభించిందనే చెప్పాలి. రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలకు తగినట్టుగా తీర్చి దిద్దిన పాత్రలో పవన్ కల్యాణ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్ల ఆయనకు కొత్తేమీ కాదు. తనకు కొత్తగా అనిపించిన కోర్టు డ్రామాలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్‌కు ధీటుగా చెలరేగిపోయాడు. ఉస్మానియా క్యాంపస్‌ ఎపిసోడ్‌లో సత్యదేవ్ క్యారెక్టర్‌తో విజృంభించాడని చెప్పవచ్చు. పింక్ కథ మాటున అంతర్లీనంగా దాగిన పొలిటికల్ కలర్ ఎక్కడా ఎలివేట్ కాకుండా జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు.

  నివేదా, అంజలి, అనన్య పెర్ఫార్మెన్స్

  నివేదా, అంజలి, అనన్య పెర్ఫార్మెన్స్

  ముగ్గురు అమ్మాయిల విషయానికి వస్తే.. పల్లవిగా నివేదా థామస్ చుట్టే కథ తిరిగినా.. జరీనాగా అంజలి ఫుల్ మార్కులు కొట్టేసింది. భావోద్వేగమైన పాత్రను అద్భుతంగా రక్తి కట్టించింది. కీలక సన్నివేశాల్లో అంజలి నటన మరో లెవెల్‌లో ఉంది. నివేదా థామస్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకొన్నది. అలాగే అనన్య నాగళ్ల కూడా గిరిజన యువతిగా సానుభూతి పొందే క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. నివేదా థామస్, అంజలి, అనన్య ముగ్గురు కూడా తమ నటనతో సినిమాకు మంచి సపోర్టుగా నిలిచారు. అలాగే అతిధి పాత్రకే పరిమితమైన శృతి హాసన్ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. పెద్దగా ఆమె పాత్ర గురించి చెప్పుకొనేంత రేంజ్ పాత్ర అని చెప్పవచ్చు.

  ప్రకాశ్ రాజ్ యాక్టింగ్, ఇతర నటీనటుల గురించి

  ప్రకాశ్ రాజ్ యాక్టింగ్, ఇతర నటీనటుల గురించి

  నంద గోపాల్‌గా ప్రకాశ్ రాజ్ మరోసారి నట విశ్వరూపాన్ని చూపించారు. ఆవేశంతోపాటు కఠినంగా వాదించే లాయర్‌గా ఆయన ఆకట్టుకొన్నారు. కోర్టులో పవన్ కల్యాణ్‌తో పోటాపోటీగా సరిగే సీన్లు హై ఓల్టేజ్‌తో సాగుతాయి. ఇక అనన్య తండ్రిగా నటించిన ఆనంద చక్రపాణి, నివేదా థామస్ తండ్రి పాత్రలో కనిపించిన నటుడు తమ సన్నివేశాలను బాగా పండించారు. భావోద్వేగమైన నటనతో కథకు సపోర్టుగా నిలిచారు.

  థమన్ మ్యూజిక్

  థమన్ మ్యూజిక్


  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. మగువ మగువా పాట, సత్యమేవ జయతే పాటలు తెరపైన మరింత ఎమోషనల్‌గా సాగాయి. కోర్టు డ్రామా సమయంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పలు సన్నివేశాలను థమన్ తన మ్యూజిక్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో థమన్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పవచ్చు.

  పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వ్యాల్యూస్

  పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వ్యాల్యూస్


  సాంకేతిక అంశాల్లో సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పీఎస్ వినోద్ తన ప్రతిభతో మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. యాక్షన్ సీన్లుగానీ, కోర్టు డ్రామా సీన్లను బాగా చిత్రీకరించారు. ఎడిటర్ ప్రవీణ్ తన పనిని ఎలాంటి రిమార్కు లేకుండా చేసుకొంటూ వెళ్లిపోయారనిపిస్తుంది. సీన్లు చకచకా ముందుకెళ్లేలా ప్రవీణ్ పూడి తన టాలెంట్‌ను ప్రదర్శించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్లపై దిల్ రాజు రూపొందించిన సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉన్నాయి. నిర్మాణ పరంగా ఫుల్ మార్కులు కొట్టేశారని చెప్పవచ్చు

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  మహిళా సాధికారితతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సమస్యలకు వేలెత్తి చూపి పొలిటికల్ కలర్ ఉన్న సినిమా వకీల్ సాబ్. పక్కాగా పింక్ కథను కాకుండా పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్‌కు, సగటు ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి చిత్రమని చెప్పవచ్చు. డైలాగ్స్, సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైన కారణంగా రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో బాక్సాఫీస్ వద్ద నమోదయ్యే వసూళ్లే ప్రమాణికంగా నిలువనున్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  కథ, కథనాలు
  పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్
  ప్రకాశ్ రాజ్ యాక్టింగ్
  శ్రీరాం వేణు డైరెక్షన్, రచన
  థమన్ మ్యూజిక్

  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్‌‌ ఫ్లాష్ బ్యాక్‌లో కొంత పార్ట్
  పొలిటికల్ పంచులు

  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు


  నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు
  రచయిత, డైరెక్టర్: శ్రీరాం వేణు
  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
  నిర్మాత: దిల్ రాజు, శిరీష్
  సమర్పణ: బోనీ కపూర్
  డీవోపీ: పీఎస్ వినోద్
  మ్యూజిక్: థమన్ ఎస్
  ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
  ఎడిటర్: ప్రవీణ్ పూడి
  డైలాగ్స్: థిరు
  యాక్షన్: రవి వర్మ
  రిలీజ్ డేట్: 2021-04-09

  English summary
  Vakeel Saab Review: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat telugu brings exclusive review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X